ప్రజలు సొంతూళ్లను వదిలి ఉద్యోగాలు, ఉపాధి కోసం నగరాలకు వలసపోతున్నారు. అయితే ఉద్యోగాలైతే దొరుకుతున్నాయి గానీ నివసించేందుకు సొంత ఇళ్లు అంటేనే.. అనుకున్నంత ఈజీ కాదు. సరే పోనీ అద్దె ఇంట్లో ఉంటూ బతుకు బండిని ముందుకు నడిపిద్దామని అనుకుంటే.. నగరాల్లో అద్దెలా భారం భయాన్ని పుట్టిస్తోంది. దీంతో చేసేదేమి లేక తక్కువ అద్దె చూసుకుని.. పని చేస్తున్న కంపెనీకి కిలీమీటర్ల దూరం అయినా..ట్రాఫిక్ జామ్‌లో గంటల సమయాన్ని వృథా చేసుకుంటూ జీవనాన్ని గడిపేస్తుంటాం. ఇదంతా మనకి తెలిసిన కథే.. అయితే ఓ యువతి చేసిన పనికి నెటిజన్స్ అవాక్కవుతున్నారు.
అద్దె భరించలేక.. విమాన ప్రయాణం
ఒక యువతి ఇంటి అద్దె భరించలేక విమానంలో ఉద్యోగానికి మరొక రాష్ట్రానికి వెళ్ళొస్తోంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. సోఫియా సెలెంటానో అనే 21 ఏళ్ల యువతి న్యూజెర్సీలోని ఓగిల్వీ హెల్త్‌లో సమ్మర్ ఇంటర్న్‌షిప్ చేస్తోంది. కానీ ఆ నగరంలో అపార్ట్‌మెంట్ల అధిక ధర పలుకుతూ ఆకాశాన్నంటుతున్నాయి. కనీసం ఆ నగరం శివారు ప్రాంతం ఉండాలంటే కూడా.. కనీసం నెలకు 3400 డాలర్లు అద్దె చెల్లించాల్సి ఉంటుంది. ఇక్కడ మరో విషయం ఏంటంటే.. రెండునెలల తన ఇంటర్న్‌షిప్ కాలంలో సోఫియా వారానికి ఒక రోజే ఆఫీసుకు వెళ్లాలట.
అందుకని ఆమె తాను ఇంటర్న్‌షిప్ చేస్తున్న ప్రదేశం నుంచి దాదాపు 700 కి.మీ దూరంలో తక్కువ అద్దెకు రూం తీసుకుంది. ఆఫీసుకు వారానికి ఒక రోజు కాబట్టి విమానం ప్రయాణాన్ని ఎంచుకుంది. ఎందుకంటే.. రెండు నెలల్లో మొత్తంగా 8 రోజులు ఆఫీసుకు వెళ్లాల్సి ఉండగా అందుకు విమాన టికెట్, క్యాబ్ ఖర్చులు అంతా కలిపి 2,250 డాలర్లే ఖర్చవుతుందట. న్యూజెర్సీలో ఇల్లు అద్దెకు తీసుకుని ఉండటం కంటే.. ఇదే నయమని తాను ఈ దారిని ఎంచుకుంది. అందుకోసం తాను తెల్లవారుజాము 3 గంటలకే లేవాల్సి వస్తోందని, రాత్రి పొద్దుపోయాక ఇల్లు చేరుతున్నట్లు ఆమె తెలిపింది. టిక్‌టాక్‌లో ఆమె మాట్లాడిన తర్వాత తన కథ వెలుగులోకి వచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment