ప్రతీకాత్మక చిత్రం
వాషింగ్టన్: ఓ ప్రయాణికుడి అనుచిత ప్రవర్తన వల్ల విమానాన్ని అత్యవసరంగా దారి మళ్లించాల్సి వచ్చింది. లాస్ ఏంజెల్స్ నుంచి నాష్‌విల్లేకు వెళ్లే విమానంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఆ వివరాలు.. డెల్టా ఎయిర్ లైన్స్ ఫ్లైట్ 386 విమానం లాస్ ఏంజెల్స్ నుంచి నాష్‌విల్లేకు వెళ్తుంది. ఈ క్రమంలో దానిలో ఉన్న ఓ ప్రయాణికుడు సడెన్‌గా లేచి.. ‘‘విమానాన్ని ఆపండి.. లేదంటే నేను దూకేస్తాను’’ అంటూ.. లాక్ చేసిన కాక్‌పిట్‌ట్‌లోకి వెళ్లేందుకు ప్రయత్నించాడు.
ఇతర ప్రయాణికులు అతడిని అడ్డుకోవడానికి ప్రయత్నించినా కుదరలేదు. అతి కష్టం మీద అతడిని విమానంలో వెనక సీటులో కట్టి పడేశారు. ఆ తర్వాత విమానాన్ని న్యూమెక్సికోలోని అల్బుకెర్కీ ఇంటర్నేషనల్ సన్‌పోర్ట్‌కు మళ్లీంచారు. "విమానం సురక్షితంగా ల్యాండ్ అయింది. ఎఫ్‌బీఐ, పోలీసులు సదరు ప్రయాణికుడిని అదుపులోకి తసుకున్నారు’’ అని డెల్టా ఓ ప్రకటనలో తెలిపింది. ఈ ఘటనలో ఎవరికి గాయాలు కాలేదని.. దీనిపై ఎఫ్‌బీఐ దర్యాప్తు చేస్తోంది. అల్బుకెర్కీలోని ఎఫ్‌బిఐ ప్రతినిధి ఫ్రాంక్ ఫిషర్ తెలిపారు. ఈ ఘటన వల్ల ప్రజలకు ఎటువంటి ముప్పు లేదని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment