
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశీయంగా 2022 మే నెలలో 1.20 కోట్ల మంది విమాన ప్రయాణం చేశారు. 2021 మే నెలతో పోలిస్తే ఇది అయిదు రెట్లు అధికం కావడం విశేషం.
డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) ప్రకారం..గతేడాది దేశీయంగా మే నెలలో 21 లక్షల మంది విమానాల్లో ప్రయాణించారు. 1.20 కోట్లలో ఇండిగో విమానాల ద్వారా 70 లక్షల మంది విహంగ విహారం చేశారు. మొత్తం ప్రయాణికుల్లో ఇది 57.9 శాతం. గో ఫస్ట్ ద్వారా 12.76 లక్షల మంది రాకపోకలు సాగించారు.
Comments
Please login to add a commentAdd a comment