టికెట్ లేకుండా విమానంలో ప్రయాణించిన బాలుడు... గూగుల్‌లో సెర్చ్‌ చేసి మరీ.. | 9 Year Old Brazilian Boy Travel Alone Without An Airline Ticket | Sakshi
Sakshi News home page

టికెట్ లేకుండా విమానంలో ప్రయాణించిన బాలుడు... గూగుల్‌లో సెర్చ్‌ చేసి మరీ..

Published Fri, Mar 4 2022 2:59 PM | Last Updated on Fri, Mar 4 2022 5:04 PM

 9 Year Old Brazilian Boy Travel Alone Without An Airline Ticket - Sakshi

Boy Managed To Travel Almost 3000 kilometres Alone: ఇంతవరకు మనం బస్సు లేక రైలులో టికెట్‌ లేకుండా ప్రయాణించడం గురించి విని ఉంటాం. అదృష్టం బావుంటే పట్టుబడం లేదంటే ఫైన్‌ కట్టి బయటపడతాం. ఇది అందరికీ తెలిసిందే. అయితే ఈ బుడ్డోడు ఒంటరిగా అదికూడా టి​కెట్టు లేకుండా ఏకంగా విమానం ఎక్కి వచ్చేశాడు. ఈ ఘటన బ్రెజిల్‌లో చోటు చేసుకుంది. 

వివరాల్లోకెళ్తే...బ్రెజిల్‌లోని ఇమాన్యుయెల్ మార్క్వెస్ ఒలివేరా అనే 9 ఏళ్ల బాలుడు ఒంటరిగా లేకుండా విమానంలో ప్రయాణించాడు. అంతేకాదు తన ఇంటి నుంచి సుమారు 3వేల కి. మీ దూరంలో ఉన్నఆగ్నేయ రాష్ట్రమైన సావో పాలోలోని గౌరుల్‌హోస్‌కు విమానంలో పయనించాడు. ఈ మేరకు అతని తల్లి డేనియల్ మార్క్వెస్ ఆ రోజు కొడుకుని ఉదయం 5 గంటల ప్రాంతంలో చూశానని చెప్పారు.

ఆ తర్వాత అతను కనిపించక చాలా ఆందోళన చెందామని వివరించారు. ఆ బాలుడు గూగుల్‌లో టికెట్‌ లేకుండా, ఎవరి కంటపడకుండా విమానం ఎక్కడం ఎలా అనే దానిపై సర్చ్‌ చేసి మరీ వెళ్లాడు. ఆ బాలుడి తల్లికి అతని ఆచూకి తెలియడంతో కాస్త ఊపిరి పీల్చుకోగలిగింది. ఈ రోజుల్లో పిల్లలు పెద్దవాళ్లకంటే ఈజీగా స్మార్ట్‌ ఫోన్‌, ఇంటర్నెట్‌ని ఆపరేట్‌ చేసేస్తున్నారు.

కానీ ఈ బాలుడిని చూస్తే మరీ ఇంత అడ్వాన్స్‌డ్‌గా పిల్లలు ఉంటారా? అని ఆశ్చర్యం కలగకమానదు. అంతేకాదు పెద్దల్లో గుబులు కూడా కాస్త ఎక్కువ అవుతుంది. ఈ మేరకు ఈ విషయం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవ్వడంతో ఎలాంటి ప్రయాణ పత్రాలు లేదా లగేజీ లేకుండా బాలుడు ఎలా ఎక్కగలిగాడనే విషయంపై మనౌస్ విమానాశ్రయ యాజమాన్యం విచారణ ప్రారంభించింది. మరోవైపు పోలీసులు కూడా దర్యాప్తు ప్రారంభించారు.

(చదవండి: సినిమా రేంజ్‌లో గాల్లోకి ఎగిరిపడ్డ ట్రక్‌! వైరల్‌ వీడియో)

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement