బ్రెజీలియా: బ్రేకప్ ఎన్నిరకాలో తెలీదు కానీ విడిపోయిన తర్వాత చేసుకునే పార్టీలు మాత్రం రెండే రకాలు. నచ్చిన అమ్మాయి ఇక కన్నెత్తి చూడదని తెలిసి కుమిలి కుంగి కృశించి చెడు వ్యసనాలకు బానిసయ్యేవారు కొందరైతే, పోతే పోయిందీ... అని లైట్ తీసుకుని ఇంకోదారి చూసుకునేవారు మరికొందరు. కానీ ఇక్కడో ఆదర్శ పురుషుడు మాత్రం చిత్రంగా మూడో కేటగిరీకి చెందినవాడు. ప్రేమించిన అమ్మాయితో బ్రేకప్ అవగానే మరో ఆలోచనే లేకుండా తనను తానే వివాహం చేసుకున్నాడు. అదెలాగంటారా.. ఎలాగో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదివేయండి..
బ్రెజిల్‌కు చెందిన ముప్పై మూడేళ్ల డియోగో రాబెలో గతేడాది నవంబర్‌లో విటర్ బ్యూనోతో నిశ్చితార్థం జరుపుకున్నాడు. ఊరంతా జాతరలా పెళ్లి చేసుకుందామని కలలు కన్నాడు. సెప్టెంబర్‌లో నెచ్చెలితో ఏడడుగులు నడుద్దామనుకున్నాడు. కానీ అంతలోపే వారి మధ్య గొడవలు మొదలయ్యాయి. అవి తీవ్ర స్థాయికి చేరుకోవడంతో జూలైలో విడిపోయారు. ఎవరి దారి వారు చూసుకున్నారు. అయినా సరే డియోగో మనసులో నుంచి పెళ్లి ఆలోచన పోలేదు. అనుకున్న దాని కన్నా నెల ఆలస్యంగా అక్టోబర్ 17న పెళ్లి కొడుకుగా ముస్తాబయ్యాడు. అతడి ఆహ్వానం మేరకు చుట్టాలు, స్నేహితులు బహియాలోని ఇటాకేర్లో రిసార్ట్‌కు వచ్చేశారు. పెళ్లికూతురు మాత్రం రాలేదు, రాదని అక్కడున్న వారికికి కూడా తెలుసు. కుడి చేతికి రింగు తొడుక్కున్నాడు. తనను తానే వివాహం చేసుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. (చదవండి: ముగ్గురు అక్కాచెల్లెళ్లు ఒకరినే మనువాడారు!)
Comments
Please login to add a commentAdd a comment