బ్రెసీలియా: ఏదైనా అవయవానికి లోపముంటే డాక్టర్ దగ్గరకు వెళ్లి సరి చేయించుకుంటాం. అదేంటో కానీ ఈ మధ్య కొందరికి అన్ని అవయవాలు బాగుంటే నచ్చడం లేదు. మొన్నా మధ్య ఓ వ్యక్తి తన చెవులను కత్తిరించి జాడీలో భద్రపరుచుకున్నాడని చదివాం కదా! ఇప్పుడో వ్యక్తి ఏకంగా ముక్కును కత్తిరించేసుకుని అందరినీ షాక్‌కు గురి చేస్తున్నాడు. ఇది చదవగానే మీకు రామాయణంలోని శూర్పణఖ గుర్తొస్తుంది కదూ! పైన ఫొటోలో కనిపిస్తున్న వ్యక్తి కూడా ముక్కును కత్తిరించేసుకున్న తర్వాత రాక్షసుడిలానే కనిపిస్తున్నాడు. ఎందుకిలా చేశాడు అంటే.. అది ఓ సరదా అని చెప్తున్నాడు. (చదవండి: ఇదేం పిచ్చి: చెవులను కత్తిరించి భద్రంగా..)
బ్రెజిల్ దేశానికి చెందిన మైకెల్ ఫరోడో ప్రాడో ఓ టాటూ ఆర్టిస్టు. అతడి భార్య, స్నేహితులు కూడా టాటూ ఆర్టిస్టులే కావడంతో మైకేల్ శరీరమంతా పచ్చబొట్లు పొడిచారు. అయినప్పటికీ అతడికి సంతృప్తి కలగలేదు ఇంకేదైనా కొత్తగా ట్రై చేయాలనిపించింది. సైతాన్‌గా అవతరించాలనే కోరిక పుట్టింది. ఇందుకోసం సంవత్సరాల తరబడి ఆపరేషన్లు చేయించుకున్నాడు. ఎట్టకేలకు ముక్కును తొలగించుకున్నాడు. దీంతో అప్పటికే తల మీద ఉన్న కొమ్ములు, వికృతంగా మార్చుకున్న ముఖభాగం, ఇప్పుడు కోసేసిన ముక్కుతో నిజంగానే దయ్యంలా కనిపిస్తున్నాడు. భయంకరమైన తన కొత్త రూపాన్ని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ప్రపంచానికి తన పేరును డెవిల్ ప్రాడోగా పరిచయం చేసుకున్నాడు. కాగా ప్రపంచంలోనే నాసికాన్ని తొలగించుకున్న మూడో వ్యక్తిగా మైఖేల్ అవతరించాడు. (చదవండి: ఎముకలు, ఈకలు తప్ప ఇంకేం మిగలవు!)
Comments
Please login to add a commentAdd a comment