
ఒకప్పుడు స్టార్ హీరోగా రాణించిన జగపతి బాబు..ఇప్పుడు విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా దూసుకెళ్తున్నాడు. ఓ వైపు సినిమాల్లో నటిస్తూనే వెబ్‌సిరీస్‌లపై దృష్టిపెడుతున్నారు. ఆ మధ్య ‘పరంపర’ అనే వెబ్‌సిరీస్‌లో నటించారు. ప్రస్తుతం జగపతి బాబు సలార్ తో పాటు మహేశ్‌బాబు-త్రివిక్రమ్ ‘గుంటూరు కారం’చిత్రంలో కూడా నటిస్తున్నాడు. ఇలా వరుస సినిమాలతో బిజీగా ఉన్నప్పటికీ.. సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్‌గా ఉంటాడు జగ్గూ భాయ్.
సినిమా అప్‌డేట్స్‌తో పాటు వ్యక్తిగత విషయాలను కూడా పంచుకుంటాడు. తాజాగా ఆయన షేర్ చేసిన ఫోటో ఒకటి నెట్టింట తెగ వైరల్ అవుతోంది. విమానంలో ప్రయాణం చేస్తున్న ఫోటోని నేను చేస్తూ.. అందులో మొదటి సారిగా మొదటి ప్రయాణికుడిగా ఎక్కానని చెప్పుకొచ్చాడు.
(చదవండి: తల్లితో కలిసి అమెరికాకు సమంత.. దాని కోసమేనా?)
‘నా జీవితంలో ఫస్ట్ టైమ్ మొదటి ప్యాసింజర్‌గా విమానం ఎక్కాను. ఈ సందర్భంగా త్రివిక్రమ్ చెప్పిన చెప్పిన డైలాగ్ ఒకటి గుర్తుకొస్తుంది. ‘విమానం ఎగురుతుంది కానీ.. నువ్వు కాదు. నువ్వు సీట్లో కూర్చుంటావ్ అంతే’..త్రివిక్రమ్ చెప్పిన ఈ డైలాగ్ అంటే నాకు చాలా ఇష్టం. ఒక్క డైలాగ్‌తో జీవితం మొత్తాన్ని చెప్పాడు’అని జగపతి బాబు రాసుకొచ్చాడు. ప్రస్తుతం ఈ ఫోటో వైరల్ కాగా.. ‘ఫ్లైట్‌ని హైజాక్ చేస్తున్నారా?’, ఒక్కరే ఫ్లైట్ బుక్ చేసుకున్నారా? ఏ సినిమా షూటింగ్ ఇది? అప్‌డేట్ ఇవ్వండి’అని కామెంట్ చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment