
సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే సినీ సెలబ్రెటీలలో యాంకర్ అనసూయ ఒకరు. సినిమా విషయాలతో పాటు వ్యక్తిగత విషయాలను కూడా సోషల్ మీడియా ద్వారా ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటుంది. అంతేకాదు పలు అంశాలపై తన స్పందన ఏంటో కూడా చెబుతుంది. వీటివల్ల అప్పుడప్పుడు అనసూయ ట్రోల్ అయిన సందర్భాలూ ఉన్నాయి. కానీ అనసూయ మాత్రం తన పంథాను మార్చుకోలేదు. తనకు నచ్చిన అంశంపై కుండబద్దలు కొట్టినట్లు మాట్లాడుతుంది.
తాజాగా ఎయిర్‌పోర్ట్‌లో తనకు ఎదురైన చేదు అనుభవాన్ని అభిమానులతో పంచుకుంది అనసూయ. ఫ్యామిలీతో కలిసి బెంగళూరు వెళ్లిన అనసూయ..తిరిగి హైదరాబాద్‌కు రావడానికి అలియన్స్ ఎయిర్ సంస్థకు చెందిన ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసుకుందట.
(చదవండి: ఫోన్ ఎత్తవు.. ప్రమోషన్స్‌కి రావు.. రష్మీపై హీరో నందు ఫైర్)
అది సాయంత్రం 6.55 గంటలకు టేకాఫ్ కావాల్సింది. కానీ దాదాపు అరగంట లేట్‌గా వచ్చిందట. అప్పటి వరకు బస్‌లోనే వేయిట్ చేసిన అనసూయ ఫ్యామిలీ.. ఫ్లైట్ రాగానే లోపలి వెళ్లేందుకు ప్రయత్నించగా.. అక్కడి సిబ్బంది అపేశారట. మాస్క్ లేదనే కారణంతో అక్కడే వెయిట్ చేయించారట. చివరకు మాస్కులు ధరించి లోపలికి వెళ్తే.. అక్కడ ఒక్కోక్కరి ఒక్కో చోట కూర్చోబెట్టారట. తను మాత్రం అందరూ ఒకే చోట కూర్చునేలా టికెట్స్ బుక్ చేస్తే.. సిబ్బంది ఇలా వేరువేరుగా కూర్చోబెట్టిందని అనసూయ అసహనం వ్యక్తం చేసింది. ఇక ఆ ఫ్లైట్‌లో సీట్లు సరిగా లేవని, దానివల్ల తన షర్ట్ కూడా చిరిగిందని అనసూయ చెప్పుకొచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment