సాధారణంగా వివాహ వేడుక కోసం తల్లిదండ్రులు తమ కుటుంబ సభ్యులు, బంధువులను తీసుకు వెళ్లడానికి బస్సులు బుక్ చేసుకోవడం చూస్తూ ఉంటాం. మరి కొంతమంది ఇంకాస్త ముందుకేసి ఒక రైల్లోని ఒక బోగి మొత్తం మాట్లాడుకుని వెళ్లడం కూడా చూసి ఉంటాం. బాగా డబ్బున్న వాళ్ల అయితే తమకు స్పెషల్‌గా ఒక ప్రైవేట్ విమానాలను ఏర్పాటు చేసుకుని మరీ వెళ్తారు. అంతేగాక వారికి సంబంధించిన వారి బంధువులకు విమానంలో వచ్చే ఏర్పాట్లు చేస్తారు.
కానీ ఇక్కడొక జంట చాలా విభిన్నంగా... తమ వివాహన్ని తమ కుటుంబ సభ్యుల మధ్య ఆనందంగా జరుపుకోవాలని మొత్తం కుటుంసభ్యలు, బంధువలందరికీ ఏకంగా ఫ్లైట్ బుక్ చేసి మరీ తీసుకువెళ్లింది. అందుకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది. రాజస్తాన్‌లోని జైసల్మేర్‌లో వివాహం జరుగుతోంది.
కోవిడ్ మహమ్మారి కారణంగా డెస్టినేషన్ వెడ్డింగ్‌లు బంద్ అయ్యాయి. ఇప్పుడిప్పుడే మళ్లీ ఆ డిస్టినేషన్ వెడ్డింగ్‌ల సందడి మొదలైంది. ఈ మేరకు శ్రేయ షా అనే ఇన్‌స్ట్రాగాం వినియోగదారుడు తన సోదరి పెళ్లి కోసం మొత్తం విమానాన్నే బుక్ చేసినట్లు తెలిపాడు. ఆ వీడియోలో తమ కుటుంబ సభ్యులను అందర్నీ చూపిస్తూ....పెళ్లి చేసుకోబోతున్న జంటను కూడా చివర్లో చూపిస్తాడు. దీంతో నెటిజన్లు ఇలా కుటుంబసభ్యులందర్నీ ఫ్టైట్‌లో తీసుకెళ్లగలిగేంతా డబ్బుండాలి అని ఒకరు. మరోకరు వివాహం కోసం ఏకంగా మొత్తం విమానాన్నే బుక్ చేశారు సో గ్రేట్ అంటూ పొగుడుతూ ట్వీట్ చేశారు.
(చదవండి: అదృష్టం మాములుగా లేదుగా! ఒకేసారి రెండు జాక్‌పాట్‌లు)
Comments
Please login to add a commentAdd a comment