విమానయాన కంపెనీలకు ఈ ఆర్థిక సంవత్సరంలో నష్టాలు తప్పవని కాపా ఇండియా(సెంటర్ ఫర్ ఏవియేషన్ పార్ట్ ఆఫ్ ది ఏవియేషన్) అంచనావేసింది. విమాన ప్రయాణీకుల రద్దీ పెరుగుతున్నప్పటికీ కంపెనీ ఖర్చులు అధికమవుతుండడంతో 2024-25 ఆర్థిక సంవత్సరంలో సంస్థలు నష్టాలబాటపట్టే అవకాశం ఉన్నట్లు తెలిపింది.
కాపా తెలిపిన వివరాల ప్రకారం..2024-25 ఆర్థిక సంవత్సరంలో దేశీయ ప్రయాణీకుల రద్దీ 15.4 కోట్ల నుంచి 16.1 కోట్లకు పెరుగుతుంది. ఇండియా నుంచి విదేశాలకు వెళ్లేవారి సంఖ్య 7.5కోట్ల నుంచి 7.8 కోట్లకు పెరుగనుంది. విమాన కంపెనీల ఆదాయానికి మించి ఖర్చులు పెరిగి నష్టాలు అధికమవుతాయి. ఫలితంగా ఈ ఆర్థిక సంవత్సరంలో సంస్థలకు 400-600 మిలియన్ డాలర్ల(రూ.4వేలకోట్లు) నష్టాలు రావొచ్చు. ఈ ఏడాది ఇప్పటివరకు ఒక ప్రయాణికుడు కిలోమీటరు ప్రయాణించడానికి చెల్లించే సగటు మొత్తం దాదాపు 1 శాతమే పెరిగింది. అయితే ఏడాది పూర్తయ్యేనాటికి కంపెనీల ఖర్చులు మాత్రం 3.8 శాతం పెరుగుతాయని అంచనా.
ఇదీ చదవండి: టీవీ ఛానళ్ల సబ్‌స్క్రిప్షన్ రేట్లు పెంపు.. ఎంతంటే..
‘ప్రపంచంలోనే భారత విమానయాన మార్కెట్ అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతోంది. దేశీయ ప్రయాణాలకు సంబంధించి ఇండిగో సంస్థ 60% మార్కెట్ వాటాను కలిగి ఉంది. టాటాగ్రూప్ ఆధ్వర్యంలోని ఎయిర్ ఇండియా, విస్తారా కలిపి దాదాపు 30 శాతం వాటాను కలిగి ఉన్నాయి. మిగతావాటాను అకాసా ఎయిర్, స్పైస్‌జెట్ వంటి సంస్థలు చేజిక్కించుకున్నాయి’ అని కాపా ఇండియా తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment