Aviation Charges
-
ప్రయాణికులు పెరుగుతున్నా విమాన సంస్థలకు నష్టాలే: కాపా ఇండియా
విమానయాన కంపెనీలకు ఈ ఆర్థిక సంవత్సరంలో నష్టాలు తప్పవని కాపా ఇండియా(సెంటర్ ఫర్ ఏవియేషన్ పార్ట్ ఆఫ్ ది ఏవియేషన్) అంచనావేసింది. విమాన ప్రయాణీకుల రద్దీ పెరుగుతున్నప్పటికీ కంపెనీ ఖర్చులు అధికమవుతుండడంతో 2024-25 ఆర్థిక సంవత్సరంలో సంస్థలు నష్టాలబాటపట్టే అవకాశం ఉన్నట్లు తెలిపింది.కాపా తెలిపిన వివరాల ప్రకారం..2024-25 ఆర్థిక సంవత్సరంలో దేశీయ ప్రయాణీకుల రద్దీ 15.4 కోట్ల నుంచి 16.1 కోట్లకు పెరుగుతుంది. ఇండియా నుంచి విదేశాలకు వెళ్లేవారి సంఖ్య 7.5కోట్ల నుంచి 7.8 కోట్లకు పెరుగనుంది. విమాన కంపెనీల ఆదాయానికి మించి ఖర్చులు పెరిగి నష్టాలు అధికమవుతాయి. ఫలితంగా ఈ ఆర్థిక సంవత్సరంలో సంస్థలకు 400-600 మిలియన్ డాలర్ల(రూ.4వేలకోట్లు) నష్టాలు రావొచ్చు. ఈ ఏడాది ఇప్పటివరకు ఒక ప్రయాణికుడు కిలోమీటరు ప్రయాణించడానికి చెల్లించే సగటు మొత్తం దాదాపు 1 శాతమే పెరిగింది. అయితే ఏడాది పూర్తయ్యేనాటికి కంపెనీల ఖర్చులు మాత్రం 3.8 శాతం పెరుగుతాయని అంచనా.ఇదీ చదవండి: టీవీ ఛానళ్ల సబ్స్క్రిప్షన్ రేట్లు పెంపు.. ఎంతంటే..‘ప్రపంచంలోనే భారత విమానయాన మార్కెట్ అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతోంది. దేశీయ ప్రయాణాలకు సంబంధించి ఇండిగో సంస్థ 60% మార్కెట్ వాటాను కలిగి ఉంది. టాటాగ్రూప్ ఆధ్వర్యంలోని ఎయిర్ ఇండియా, విస్తారా కలిపి దాదాపు 30 శాతం వాటాను కలిగి ఉన్నాయి. మిగతావాటాను అకాసా ఎయిర్, స్పైస్‌జెట్ వంటి సంస్థలు చేజిక్కించుకున్నాయి’ అని కాపా ఇండియా తెలిపింది. -
మంత్రుల విమానయాన చార్జీలు రూ. 6 కోట్లు
ముంబై: దేశంలో ఆర్థిక సంక్షోభం నెలకొన్నప్పటికీ రాష్ట్ర మంత్రులకు అదేమీ పట్టినట్టు కనిపించడం లేదు. గడచిన మూడేళ్ల కాలంలో రాష్ట్రానికి చెందిన మంత్రులు రూ. 6.28 కోట్లను విమానచార్జీల కింద ప్రభుత్వ నిధులను వెచ్చించారు. దీంతో నిరాడ ంబరంగా ఉండాలంటూ కేంద్రం వీరికి గౌరవపూర్వక ఉత్తర్వులు ఇచ్చే అవకాశం సంగతి ఏవిధంగా ఉన్నా ఇదే సమయంలో ఖర్చులు తగ్గించుకోవాలంటూ యాధృచ్ఛికంగా రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఉద్యోగులను ఆదేశించడం గమనార్హం. అనేక పర్యాయాలు విమానయానం మంత్రుల జాబితాలో పతంగ్‌రావ్ కదమ్ ఉన్నారు. గడచిన మూడు సంవత్సరాల కాలంలో పతంగ్‌రావ్ విమానబిల్లు రూ. 43 లక్షలు. ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ పదవీబాధ్యతలు చేపట్టిన నాటినుంచి ఇప్పటిదాకా అయిన బిల్లు మొత్తం రూ. 6.32 లక్షలు. ఇక ఉపముఖ్యమంత్రి అజిత్‌పవార్ బిల్లు 10.23, హోం మంత్రి ఆర్.ఆర్.పాటిల్ బిల్లు రూ. 14.35, ఛగన్ భుజ్‌బల్ బిల్లు రూ. 18. రాజేంద్ర ములక్ రూ. 19.29, మాజీ ముఖ్యమంత్రి అశోక్‌చవాన్ బిల్లు రూ. 1.46 లక్షలు. ప్రముఖ సామాజిక కార్యకర్త అనిల్ గల్గాలి సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ) కింద దరఖాస్తు చేయగా పే అండ్ ఎకౌంట్స్ విభాగం ఈ వివరాలను అందజేసింది. ఇవన్నీ 2009, నవంబర్ నుంచి 2013, జనవరి మధ్యకాలంలో చేసిన విమాన ప్రయాణానికి సంబంధించిన ఖర్చుల వివరాలు.