Viral Video: Brazilian Man Made Helicopter With Scrapped Cars Parts - Sakshi
Sakshi News home page

పాత కార్లు, సైకిల్‌ విడిభాగాలతో... ఏకంగా విమానాన్ని తయరు చేశాడు!!

Published Mon, Dec 13 2021 8:25 AM | Last Updated on Mon, Dec 13 2021 11:17 AM

Brazil Men Helicopter Made From Discarded Car Parts Goes Viral On Social Media - Sakshi

Helicopter Made From Discarded Car Parts: చాలా మంది తాము జీవితంలో ఎప్పటికైన విమానంలో ప్రయాణించాలి అని అనుకుంటుంటారు. బాగా చదువుకుని మంచి స్థాయికి వచ్చినప్పుడో లేక బాగా డబ్బులు సంపాదించినప్పుడో విమానంలో ప్రయాణించడం చేస్తుంటారు. అయితే ఇక్కడొక వ్యక్తి అందుకు భిన్నంగా తాను ఏవిధంగానైనా విమానంలో ప్రయాణించాలి, పైగా తనకొక ప్రత్యేక విమానం ఉండాలనే కోరికతో ఏం చేశాడో చూడండి!.

(చదవండి: వామ్మో!... రూ. 7 లక్షలు టిప్పా!!... షాక్‌కి గురైన వెయిటర్‌!)

మాములుగా పూర్తి స్థాయిలో విమానాన్ని తయారు చేయాలంటే చాలా ఎక్కువ పరికరాలు తోపాటు కాస్త ఖర్చుతో కూడిన పని. కానీ బ్రెజిల్‌లోని జోయో డయాస్ నగరానికి చెందిన విమానయన నిపుణుడు జెనెసిస్ గోమ్స్ కేవలం మోటార్‌సైకిళ్లు, ట్రక్కులు, కార్లు, సైకిళ్లకు సంబంధించిన విడిభాగాలతో విమానాన్ని తయారు చేశాడు. అంతేకాదు పాత వాహనాలను కొనుగోలు చేసే షాపు నుంచి ఈ విడిభాగాలను కొనుగోలు చేసి ఈ విమానాన్ని తయారు చేశాడు.

అంతేకాదు గోమ్స్‌ పరైబా నగరంలో జరుగుతున్న ఏవియేషన్ ఈవెంట్ సందర్భంగా తాను తయారు చేసిన విమానంలో తన స్నేహితుడితో కలిసి ట్రైల్‌ నిర్వహించాడు. ఈ మేరకు ఈ విమానాన్ని చూసేందుకు జోయో డయాస్ నగరవాసులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. తనకు విమానం ఎక్కే అవకాశం రాకపోడంతోనే తనకంటూ ఒక విమానం ఉండాలని నిర్ణయించుకునే ఈ విమానాన్ని రూపొందించానని చెప్పాడు. అంతేకాదు ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట తెగ వైరల్‌ అవుతుంది. మీరు కూడా ఓ లుక్‌ వేయండి.

(చదవండి:  క్రిస్మస్‌ చెట్టుని అలకరించాలనుకుంటున్నారా!.... తస్మాత్‌ జాగ్రత్తా!!)

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement