Independence Day: AirAsia India Announced India Fares Begin At RS.1475 - Sakshi
Sakshi News home page

అదిరిపోయే బంఫర్‌ ఆఫర్‌.. రూ.1475కే విమాన ప్రయాణం!

Published Thu, Aug 11 2022 10:15 PM | Last Updated on Sat, Aug 13 2022 10:17 AM

Air Asia India Launches Independence Sale Starting Fare At Rs 1475 - Sakshi

భారతదేశం ఈ ఏడాది 75వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను జరుపుకుంటుంది. ఈ సందర్భంగా దేశంలో అతి పెద్ద విమానయాన సంస్థ ఎయిర్‌ ఏషియా( AirAsia) తన కస్టమర్ల కోసం అదిరిపోయే ఆఫర్‌ను తీసుకువచ్చింది. కేవలం రూ.1475కే తమ కంపెనీ విమానంలో ప్రయాణించే అవకాశాన్ని ప్రయాణికులకు కల్పిస్తోంది.  ఢిల్లీ-లక్నో వంటి రూట్లతో పాటు సంస్థ నెట్‌వర్క్ అంతటా ఇదే విధమైన ఆఫర్లు ఉంటాయని తెలిపింది. ఈ ఆఫర్ ఆగస్టు 10 నుంచి 13 వరకు ఎయిర్ ఏషియా విమానాలను బుక్ చేసుకున్న ప్యాసింజర్‌ అర్హులుగా పేర్కొంది.

వీటితో పాటు మీ బుకింగ్‌ టికెట్‌ ప్రయాణం 25 ఆగస్టు 2022 నుంచి 31 మార్చి 2023 మధ్య ఉండేలా చూసుకోవాలి. మరొక విషయం ఏంటంటే ఈ ఆఫర్‌ అంతర్జాతీయ విమానాలకు వర్తించదు. కంపెనీ పేర్కొన్న తేదీలో బుక్‌ చేసుకుంటే తక్కువ ధరకే ఎంచక్కా గాల్లో ఎగరవచ్చు. ఈ మేరకు ట్వీట్ చేస్తూ స్వాతంత్య్ర దినోత్సవ ఆఫర్‌ను ప్రకటించింది. ఈ ప్రయోజనాన్ని పొందడానికి, వీలైనంత త్వరగా బుక్ చేసుకోండి. ఆగస్టు 5 నుంచి ఈ ఎయిర్‌లైన్స్‌ లక్నో నుంచి బెంగళూరు, గోవా, న్యూఢిల్లీకి  రోజువారీ డైరెక్ట్ విమానాలను నడుపుతోంది. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) నివేదించిన ప్రకారం, ఈ ఎయిర్‌లైన్ భారతదేశంలో అత్యంత సమయపాలన కలిగిన విమానయాన సంస్థగా కొనసాగుతోంది.

చదవండి: Oppo Launch K9x Smart Tv:ఒప్పో 50 ఇంచెస్‌ స్మార్ట్‌ టీవీ వచ్చేసింది.. రూ.15వేలకే మైండ్‌ బ్లోయింగ్‌ ఫీచర్లు!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement