సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో విమాన ప్రయాణికుల రాకపోకలకు ప్రభుత్వం నిబంధనలు విడుదల చేసింది. కరోనా నేపథ్యంలో కేంద్రం సూచనలకు అనుగుణంగా మార్గదర్శకాలు రూపొందించింది. డొమెస్టిక్ విమానాల రాకపోకలు ప్రారంభించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. విమాన ప్రయాణికులు స్పందన వెబ్‌సైట్‌లో సమాచారం పొందుపరచాలని, స్పందనలో ప్రభుత్వం అనుమతి ఇచ్చాకే ఎయిర్‌లైన్స్ టికెట్లను అమ్మాలని ప్రభుత్వం తెలిపింది.
లక్షణాలున్న వారిని పరీక్షించి 7 రోజులు క్వారంటైన్‌లో ఉంచాలని, ఆ తర్వాత నెగిటివ్ వస్తే మరో 7 రోజులు హోంక్వారంటైన్‌కు పంపాలని ఆదేశించింది. హైరిస్క్ ప్రాంతాలైన చెన్నై, ముంబై, గుజరాత్, ఢిల్లీ, మహారాష్ట్ర, రాజస్థాన్ నుంచి వచ్చేవారిని క్వారంటైన్ సెంటర్లకు పంపాలని ప్రభుత్వ ఆదేశాలు జారీ చేసింది.ఇతర ప్రాంతాల నుంచి వస్తే 14 రోజులు హోం క్వారంటైన్‌కు పంపాలని ప్రభుత్వం పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment