
న్యూఢిల్లీ : అమెజాన్ మరోసారి గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ ప్రారంభించిన అనంతరం దేశీయ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ కూడా 'ఫెస్టివ్ ధమాకా డేస్' సేల్‌కు తెరతీసింది. నేటి నుంచి ప్రారంభమైన ఈ సేల్‌ను అక్టోబర్ 8 వరకు ఫ్లిప్‌కార్ట్ నిర్వహించనుంది. ఈ సేల్‌లో భాగంగా స్మార్ట్‌ఫోన్లు, మొబైళ్లు, టీవీలు, గృహోపకరణాలు, ఎలక్ట్రానిక్స్, ఫర్మీచర్ వంటి వాటిపై ఫ్లిప్‌కార్ట్ బ్లాక్‌బస్టర్ డీల్స్‌ను ఆఫర్ చేస్తోంది. మధ్యాహ్నం 1 గంట నుంచి రాత్రి 10 వరకు ఈ డీల్స్ ఫ్లిప్‌కార్ట్ కొనసాగించనుంది. అంతేకాక యాక్సిస్ బ్యాంకు క్రెడిట్, డెబిట్ కార్డులపై అదనంగా 10 శాతం క్యాష్‌బ్యాక్‌ను అందిస్తోంది.
టాప్ బ్రాండులపై 70 శాతం వరకు డిస్కౌంట్, ఎక్స్చేంజ్ ఆఫర్లు, నో కాస్ట్ ఈఎంఐలు కూడా అందుబాటులో ఉన్నాయి. ల్యాప్‌టాప్స్, కెమెరా, యాక్ససరీస్‌లపై 60 శాతం తగ్గింపును, ఎంపికచేసిన ఉత్పత్తులపై బైబ్యాక్ గ్యారెంటీని కూడా ఫ్లిప్‌కార్ట్ ఆఫర్ చేస్తోంది. ఐఫోన్ 8, ఐఫోన్ 8 ప్లస్ స్మార్ట్‌ఫోన్లపై భారీ డిస్కౌంట్లను అందించనున్నట్టు ఫ్లిప్‌కార్ట్ తెలిపింది. అయితే ఎంతమొత్తంలో అందించనుందో ఇంకా రివీల్ చేయలేదు. వన్‌ప్లస్ 3టీ, మోటో జీ5 ప్లస్ స్మార్ట్‌ఫోన్లపై కూడా భారీ మొత్తంలో డిస్కౌంట్లు ఉన్నాయి. ఫ్యాషన్ ప్రొడక్ట్‌లతో పాటు ఫర్నీచర్ ఉత్పత్తులపై 80 శాతం తగ్గింపును ఫ్లిప్‌కార్ట్ అదనంగా ఆఫర్ చేయనుంది.
Comments
Please login to add a commentAdd a comment