
హైదరాబాద్: ప్రముఖ మొబైల్ రిటైలర్ బిగ్ ‘సి’ దీపావళి పండుగ సందర్భంగా కస్టమర్లకు బంపర్ ఆఫర్లను ప్రకటించింది. మొబైల్స్ కొనుగోళ్లపై 10 శాతం వరకు క్యాష్ బ్యాక్, వడ్డీ, డౌన్‌పేమెంట్ లేకుండా సులభ వాయిదాల పద్ధతిలో కొనుగోలు చేసే సౌకర్యాన్ని కల్పించింది. ప్రతి మొబైల్ కొనుగోలుపై కచ్చితమైన బహుమతిని అందించనుంది.
ఐఫోన్ కొనుగోలుపై రూ.6,000, సామ్‌సంగ్ మొబైల్ కొనుగోలుపై రూ.10,000, ఎంఐ మొబైల్ కొనుగోలుపై రూ.3,000, ఒప్పో మొబైల్ కొనుగోలుపై రూ.4000 వరకు క్యాష్ బ్యాక్ ఇస్తుంది. వివో మొబైల్ కొనుగోలుపై 10% క్యాష్ బ్యాక్ ఆఫర్‌ను ప్రకటించింది. స్మార్ట్ టీవీలు కొనుగోలుపై రూ.3500 వరకు క్యాష్ బ్యాక్‌ను ఇస్తోంది. ఏటీఎం కార్డుపై ఒక్క రూపాయి చెల్లించి వాయిదాల పద్ధతిలో మొబైల్ కొనుగోలు చేసే సదుపాయాన్ని కల్పించింది. బిగ్ సి అందిస్తున్న ఈ దీపావళీ పండుగ ఆఫర్లను కస్టమర్లంతా వినియోగించుకోవాలని కంపెనీ సీ.ఎం.డీ బాలు చౌదరి తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment