
అనేక అంచనాల మధ్య గ్రోసరీస్ డెలివరీ బిజినెస్‌లోకి వచ్చిన ఓలా తన వ్యూహంలో మార్పులు చేసేందుకు రెడీ అయ్యింది. ఈ విభాగంలో ఉన్న ఇతర కంపెనీల నుంచి వస్తోన్న పోటీని తట్టుకుని సరికొత్త రూపంలో మార్కెట్‌లోకి రావాలని నిర్ణయించుకుంది.
ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ సృష్టించిన సంచలనం చల్లారకముందే 2021 నవంబరులో ఓలా స్టోర్స్ పేరుతో మార్కెట్‌లో సందండి మొదలైంది. న్యూఢిల్లీ, ముంబై, చెన్నై, పూనే బెంగళూరు హైదరాబాద్ నగరాల్లో సేవలు ప్రారంభించింది. కేవలం మూడు నెలల వ్యవధిలోనే రోజకు సగటున 6000 ఆర్డర్డు బుక్ అయ్యే స్థితికి చేరుకుంది. అయితే ఈ వేగం సరిపోదని ఓలా భావిస్తోంది.
ఆర్డర్ చేసిన 10 నిమిషాల్లోనే గ్రోసరీస్ మీ ఇంటికి చేరుస్తామంటూ బ్లింకిట్, జెప్టోలు మార్కెట్‌లో దూసుకుపోతున్నాయి. మరోవైపు త్వరలో టాటా, జియోలు సైతం గ్రోసరీస్ బిజినెస్‌లోరి రాబోతున్నారు. దీంతో తన మార్కెట్ స్ట్రాటజీలో మార్పులు చేర్పులో చేస్తోంది ఓలా. అందులో భాగంగా ముందుగా బ్రాండ్ నేమ్ చేంజ్ చేయాలని నిర్ణయించింది.
ప్రస్తుతం ఓలా స్టోర్స్ పేరుతో గ్రోసరీస్ డెలివరీ సర్వీస్ అందిస్తోంది. త్వరలో ఈ పేరును ఓలా డ్యాష్‌గా మార్చాలని నిర్ణయించినట్టుగా జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. గతంలో సైతం ఓలా సంస్థ వేగంగా తన స్ట్రాటజీల్లో మార్పులు చేర్పులు చేసిన ఉదంతాలు ఉన్నాయి.
చదవండి:సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోన్న ఓలా ఎలక్ట్రిక్ కారు..!
Comments
Please login to add a commentAdd a comment