న్యూఢిల్లీ: పునర్‌వ్యవస్థీకరణ ప్రక్రియలో భాగంగా విద్యుత్ వాహనాల తయారీ సంస్థ ఓలా ఎలక్ట్రిక్ తాజాగా దాదాపు 200 ఉద్యోగాల్లో కోత విధించనుంది. వీటిలో ఎక్కువ భాగం ఉద్యోగాలు సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ విభాగంలోనే ఉండనున్నాయి.
మరోవైపు, సాఫ్ట్‌వేర్‌యేతర ఇంజినీరింగ్ విభాగాలపై కంపెనీ మరింతగా దృష్టి పెడుతోంది. కొత్తగా సుమారు 3,000 మంది ఉద్యోగులను తీసుకోవాలని భావిస్తోంది. వాహనాలు, సెల్, బ్యాటరీలు, తయారీ, ఆటోమేషన్ మొదలైన విభాగాల్లో సామర్థ్యాలను పెంచుకోవడంపై మరింతగా దృష్టి పెడుతున్నట్లు ఓలా ఎలక్ట్రిక్ తెలిపింది.
ఈ నేపథ్యంలోనే కార్యకలాపాలను క్రమబద్ధీకరించుకుంటున్నట్లు వివరించింది. ప్రస్తుతం దాదాపు 2,000 మంది ఇంజినీర్లు ఉండగా ఈ ప్రక్రియతో సుమారు 10 శాతం ఉద్యోగాలపై ప్రభావం పడనుందని ఓలా ఎలక్ట్రిక్ తెలిపింది. 2024లో ఓలా ఎలక్ట్రిక్ తమ తొలి ఎలక్ట్రిక్ కారును ప్రవేశపెట్టే ప్రయత్నాల్లో ఉంది.
Comments
Please login to add a commentAdd a comment