న్యూఢిల్లీ: 2023 ఆర్థిక సంవత్సరంలో ఓలా బ్రాండ్ మాతృసంస్థ ఏఎన్‌ఐ టెక్నాలజీస్ నికర నష్టాలు (కన్సాలిడేటెడ్) రూ.772 కోట్లకు తగ్గాయి. అంతక్రితం 2022 ఆర్థిక సంవత్సరంలో ఇవి రూ. 1,522 కోట్లుగా నమోదయ్యాయి. మరోవైపు, ఆదాయం 48 శాతం పెరిగి రూ. 1,680 కోట్ల నుంచి రూ. 2,481 కోట్లకు చేరింది.
ఇక స్టాండెలోన్ ప్రాతిపదికన ఏఎన్‌ఐ టెక్నాలజీస్ నష్టం రూ. 3,082 కోట్ల నుంచి రూ. 1,083 కోట్లకు దిగివచి్చంది. ఆదాయం 58 శాతం వృద్ధి చెంది రూ. 1,350 కోట్ల నుంచి రూ. 2,135 కోట్లకు చేరింది. ఓలా మొబిలిటీ వ్యాపార విభాగం రూ. 250 కోట్ల నిర్వహణ లాభం నమోదు చేసింది. మొత్తం మీద గ్రూప్ స్థాయిలో ఏఎన్‌ఐ టెక్నాలజీస్ నష్టం రూ. 20,223 కోట్లకు చేరింది.
Comments
Please login to add a commentAdd a comment