ప్రముఖ దేశీయ క్యాబ్ సర్వీస్ దిగ్గజం ఓలా..మైక్రోసాఫ్ట్ మైక్రోసాఫ్ట్ క్లౌడ్ సర్వీస్ అజ్యూర్‌కు స్వస్తి పలికిన విషయం తెలిసిందే. ఓలా తీసుకున్న ఈ నిర్ణయం కారణంగా మైక్రోసాఫ్ట్ ఇండియాకు దాదాపూ రూ.100 కోట్ల మేర నష్టం వాటిల్లే అవకాశం ఉందనే అంచనాలు నెలకొన్నాయి.
ఇటీవల ఓలా సీఈవో భవీష్ అగర్వాల్ మైక్రోసాఫ్ట్‌కు చెందిన లింక్డిన్ ఏఐలో బాట్‌లో తన గురించి తెలుసుకునే ప్రయత్నం చేశారు. భవీష్ అగర్వాల్ ఎవరు? అని సెర్చ్ చేశారు. దీనికి బాట్ అతడు/ ఆయన ఉండాల్సిన చోటు వారు/ వాళ్లు ఉండడం చూసి.. అనే సమాధానం ఇచ్చింది. అంతే ఈ సమాధానాలపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ భవిష్ లింక్డిన్‌లో ఓ పోస్ట్ పెట్టారు. తమ నిబంధనలకు విరుద్దం అంటూ ఆ పోస్ట్‌ను లింక్డిన్ డిలీట్ చేసింది.
లింక్డిన్ పోస్ట్ తన పోస్ట్ డిలీట్ చేయడంతో లింక్డిన్ మాతృ సంస్థ మైక్రోసాఫ్ట్‌పై భవిష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వచ్చే వారంలోగా మైక్రోసాఫ్ట్ అజ్యూర్ క్లౌట్ కంప్యూటింగ్ సేవలకు స్వస్తి పలకాలని తమ కంపెనీ నిర్ణయించినట్లు తెలిపారు. మైక్రోసాఫ్ట్ యాజమాన్యంలోని లింక్డిన్ తీరు కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. ఫలితంగా మైక్రోసాఫ్ట్ వందల కోట్లలో నష్టం వాటిల్లనుందని పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి.
Comments
Please login to add a commentAdd a comment