పెరుగుతున్న ఇంధన అవసరాల దృష్ట్యా గ్రీన్‌హౌస్ వాయు ఉద్గారాలను తగ్గించడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. శిలాజ ఇంధన దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించేందుకు ఎలక్ట్రిక్ వాహనాల ఉత్పత్తిని ప్రోత్సహించడానికి ప్రయత్నిస్తోంది. అందులో భాగంగానే ఎలక్ట్రిక్ వాహనాల్లోని బ్యాటరీల్లో వినియోగించే లిథియం అయాన్ బ్లాక్‌లను వేలం వేసేందుకు నిర్ణయించింది.
ప్రభుత్వం చేపడుతున్న క్రిటికల్ మినరల్స్ ఆక్షన్‌లో ఓలా ఎలక్ట్రిక్ పాల్గొనాలని చూస్తున్నట్లు కంపెనీ వర్గాలు తెలిపాయి. లిథియం అయాన్ బ్లాక్‌లను వేలంలో దక్కించుకోవాలని యోచిస్తున్నట్లు తెలిసింది. లిథియం వంటి కీలక మినరల్స్ సరఫరా పెంచేందుకు ప్రభుత్వం కిందటేడాది చివరి నుంచి ఆక్షన్ చేపడుతోంది. ఎనిమిది రాష్ట్రాల్లోని 20 బ్లాక్‌లను వేలం వేస్తోంది.
ఇదీ చదవండి: ఎడ్‌టెక్ కంపెనీకు నోటీసులు.. ఎందుకో తెలుసా..
ఈ ప్రక్రియ ద్వారా ప్రభుత్వం రూ.45 వేలకోట్లు సేకరించనుందని అంచనా. పెట్రోల్, డీజిల్ వాడకాన్ని తగ్గించేందుకు ఎలక్ట్రిక్ వెహికల్స్‌ను ప్రమోట్ చేస్తున్న విషయం తెలిసిందే. కిందటి ఆర్థిక సంవత్సరంలో అమ్ముడైన మొత్తం 39 లక్షల వెహికల్స్‌లో ఈవీల వాటా 2 శాతం ఉంది. ఇది 2030 నాటికి 30 శాతానికి పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ ఆక్షన్‌కు సంబంధించి ఓలా సంస్థ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.
Comments
Please login to add a commentAdd a comment