విశాఖపట్నం: దువ్వాడ వీపీఈజెడ్‌లో ఉద్యోగినిపై లైంగిక దాడి జరిగింది. మూడు రోజుల క్రితం ఈ సంఘటన జరగగా బాధితురాలైన బాలిక మంగళవారం ఫిర్యాదు చేసింది. బస్సు డ్రైవర్ విశ్వనాథ్ బస్సులోనే ఆమెపై లైంగిక దాడికి పాల్పడాడ్డు. విషయం వెలుగులోకి రాకుండా ఆమె కుటుంబంతో నిందితుడి తరపు వారు మంతనాలు జరిపి రూ.1.50 లక్షలకు బేరం కుదుర్చుకున్నారు. అయితే విషయం బయటకు పొక్కడంతో పోలీసులు సుమోటోగా కేసు నమోదు చేశారు. అతనితోపాటు మరో ఇద్దరిని కూడా అదుపులోకి తీసుకున్నారు.