![UP Man Rapes 35-Yr-Old Daughter Along With Friends - Sakshi](/styles/webp/s3/article_images/2018/04/19/rape.jpg.webp?itok=QH4hXPxM)
ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, సీతాపూర్ (యూపీ) : మహిళలపై లైంగిక దాడుల పరంపర కొనసాగుతూనే ఉంది. యూపీలోని సీతాపూర్‌లో కన్నతండ్రే తన 35 ఏళ్ల కుమార్తెపై మరో ఇద్దరు స్నేహితులతో కలిసి లైంగిక దాడికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. ఈనెల 15న కమ్లాపూర్ ప్రాంతంలో ఈ దారుణం చోటుచేసుకుందని..ఆ మరుసటి రోజే బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేశారని అదనపు ఎస్‌పీ మార్తాండ్ ప్రకాష్ సింగ్ తెలిపారు. నిందితుల్లో ఒకరిని పోలీసులు అరెస్ట్ చేశారని, బాధితురాలి తండ్రి, మరో నిందితుడి కోసం గాలిస్తున్నామని చెప్పారు. బాధిత మహిళకు పెళ్లయి 20 సంవత్సరాలైందని, ఆమెకు ఓ కుమారుడు ఉన్నాడని తెలిపారు.
బాధితురాలు భర్త నుంచి వేరుపడి తల్లితండ్రుల వద్ద నివసిస్తోంది. ఈనెల 15న బాధితురాలి తండ్రి తన కుమార్తెను కమ్లాపూర్‌లో ఓ ప్రదర్శనకు తీసుకువెళ్లి అక్కడి నుంచి స్నేహితుడు మీరజ్ ఇంటికి తీసుకెళ్లి గదిలో నిర్భందించారు. అక్కడే తన తండ్రి మరో ఇద్దరితో కలిసి తనపై లైంగికదాడికి పాల్పడ్డారని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment