
ముంబై : మహానగరంలో దారుణం జరిగింది. కంటికి రెప్పలా కాపాడాల్సిన తండ్రే కన్న కూతుళ్లపై అత్యాచారానికి పాల్పడ్డాడు. వావివరసలు మరచి జంతువులూ ప్రవర్తించాడు. కన్నతండ్రి అనే పదానికే కళంకం తెచ్చిన ఆ దుర్మార్గుడిపై భార్య పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.
ముంబైలోని వకోల ప్రాంతానికి చెందిన 42 ఏళ్ల వ్యక్తి ఫ్యాషన్ డిజైనర్‌గా పని చేస్తున్నాడు. అతనికి ముగ్గురు కూతుళ్లు, ఒక కుమారుడు. 17 ఏళ్ల తన పెద్ద కూతురిపై గత రెండేళ్లుగా పలు మార్లు అత్యాచారం చేశాడు. గత ఏడాది నవంబర్‌లో రెండో కూతురు(13)పై కూడా అత్యాచార యత్నం చేశాడు. ఈ విషయాన్నిపెద్ద కూతురు గత వారం తల్లికి చెప్పడంతో ఆమె భర్తతో గొడవకు దిగింది.
దీంతో భార్య, పిల్లలను ఇంటి నుంచి గెంటేశాడు. ఆదివారం ఈ మేరకు భార్య ముంబైలోని వకోల పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు నిందితుడిని సోమవారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment