Vakola
-
దారుణం: కన్న తండ్రే కామాంధుడై..
ముంబై : మహానగరంలో దారుణం జరిగింది. కంటికి రెప్పలా కాపాడాల్సిన తండ్రే కన్న కూతుళ్లపై అత్యాచారానికి పాల్పడ్డాడు. వావివరసలు మరచి జంతువులూ ప్రవర్తించాడు. కన్నతండ్రి అనే పదానికే కళంకం తెచ్చిన ఆ దుర్మార్గుడిపై భార్య పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ముంబైలోని వకోల ప్రాంతానికి చెందిన 42 ఏళ్ల వ్యక్తి ఫ్యాషన్ డిజైనర్‌గా పని చేస్తున్నాడు. అతనికి ముగ్గురు కూతుళ్లు, ఒక కుమారుడు. 17 ఏళ్ల తన పెద్ద కూతురిపై గత రెండేళ్లుగా పలు మార్లు అత్యాచారం చేశాడు. గత ఏడాది నవంబర్‌లో రెండో కూతురు(13)పై కూడా అత్యాచార యత్నం చేశాడు. ఈ విషయాన్నిపెద్ద కూతురు గత వారం తల్లికి చెప్పడంతో ఆమె భర్తతో గొడవకు దిగింది. దీంతో భార్య, పిల్లలను ఇంటి నుంచి గెంటేశాడు. ఆదివారం ఈ మేరకు భార్య ముంబైలోని వకోల పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు నిందితుడిని సోమవారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. -
మొన్న బ్యాంక్.. ఇవ్వాళ ఏటీఎం..
-
మొన్న బ్యాంక్.. ఇవ్వాళ ఏటీఎం..
ముంబై: ‘గంటలు గంటలు క్యూలైన్లో నిల్చున్నా కరెన్సీ నోట్లు దొరకట్లేదు. నిన్న ఇదే సమయానికి వచ్చి సాయంత్రం దాకా లైన్ లో ఉన్నా. తీరా నా వంతు వచ్చేసరికి డబ్బులు అయిపోయాయి’ అని ఒక సోదరుడు.. ‘చేతిలో డబ్బుల్లేక ఇంట్లో వంట కూడా చేసుకోవట్లేద’ని మరో మహిళ.. ఇలా పలకరించిన అందరూ తమతమ బాధలు విన్నవించుకున్నారు కాంగ్రెస్ పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీకి. నోట్ల రద్దు విషయంలో ప్రధాని మోదీపై వరుస విమర్శనాస్త్రాలు సంధిస్తోన్న కాంగ్రెస్ ఉపాధ్యక్షడు రాహుల్ గాంధీ బుధవారం మరోసారి ప్రజల ‘నోటు’ పాట్లను తెలుసుకున్నారు. తన దగ్గరున్న పాత కరెన్సీని మార్చుకునేందుకు గత వారం ఢిల్లీలోని బ్యాంకుకు వెళ్లి సామాన్య ప్రజలతో కలిసి క్యూలైన్లో నిల్చున్న రాహుల్ మరోసారి ముంబై వకోలా ప్రాంతంలోని ఏటీఎం వద్దకు వచ్చి ప్రజలను పలకరించారు. ఈ సందర్భంగా పలకరించిన మీడియాతో రాహుల్ మాట్లాడారు. ఏటీఎంలు, బ్యాంకుల వద్ద ప్రజల ఇబ్బందులు కొంచెమైనా తగ్గించేలా కనీస వసతులు ఏర్పాటుచేయాలని సీఎం ఫడ్నవిస్ ను కోరుతున్నానన్నారు. అంతకుముందు పరునునష్టం కేసులో బీవండి కోర్టుకు హాజరైన రాహుల్ గాంధీకి వ్యక్తిగత పూచీకత్తుపై బెయిల్ లభించింది. తదుపరి విచారణ జనవరి 28కి వాయిదా పడింది. 'పెద్ద నోట్ల రద్దు భారీ కుంభకోణం?' అని రాహుల్ కేంద్ర ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు.