ఢిల్లీ మహిళపై 23మంది దారుణం.. | 23 men allegedly rape Delhi woman in Rajasthan | Sakshi
Sakshi News home page

ఢిల్లీ మహిళపై 23మంది దారుణం..

Published Thu, Sep 28 2017 7:16 PM | Last Updated on Sat, Jul 28 2018 8:43 PM

23 men allegedly rape Delhi woman in Rajasthan - Sakshi

(ప్రతీకాత్మక చిత్రం)

సాక్షి,న్యూఢిల్లీ : బికనీర్‌లో దారుణం చోటుచేసుకుంది. తన ఫ్లాట్‌ను చూసేందుకు వెళ్లిన ఓ మహిళను కారులోకి ఈడ్చుకెళ్లి వివిధ ప్రాంతాల్లో తిప్పుతూ ఏకంగా 23మంది కొన్ని గంటలపాటు లైంగిక దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో పోలీసులు ఇద్దరిని అరెస్టు చేసి విచారణ ప్రారంభించారు. బాధితురాలు పోలీసులకు తెలిపిన వివరాల ప్రకారం ఈ నెల(సెప్టెంబర్‌) 25న ఢిల్లీకి చెందిన ఆమె రాజస్థాన్‌ బికనీర్‌లోని రిద్‌మల్సార్‌ పురోహితన్‌ ప్రాంతానికి వెళ్లింది. అక్కడ తనకు సొంత ఫ్లాట్‌ ఉండటంతో తనిఖీ చేసేందుకు వెళ్లి తిరిగొచ్చే క్రమంలో ఖాటు శ్యామ్‌ మందిర్‌ అనే ఓ ఆలయం వద్ద వాహనం కోసం ఎదురుచూస్తోంది.

అదే సమయంలో అటుగా వచ్చిన ఓ ఎస్‌యూవీ వాహనంలో నుంచి కొంతమంది వచ్చి ఆమెను వాహనంలోకి ఈడ్చుకెళ్లారు. ఆ తర్వాత కొన్ని గుట్టలు ఉన్న ప్రాంతానికి తీసుకెళ్లి లైంగికదాడికి పాల్పడ్డారు. తొలుత ఇద్దరు ఆ తర్వాత ఆరుగురు ఈ వికృతచర్యకు దిగారు. అటుపిమ్మట ఓ ప్రభుత్వ పవర్‌ సబ్‌ స్టేషన్‌ వద్దకు తీసుకెళ్లగా అక్కడకు మరికొంతమంది వచ్చి మరోసారి లైంగికదాడికి దిగారు. ఇలా మొత్తం 23మంది ఈ దమన చర్యకు పాల్పడినట్లు బాధితురాలు పోలీసులతో వాపోయింది. వారిలో ఇద్దరు తిరిగి తనను 26న ఉదయం 4గంటల ప్రాంతంలో అంతకుముందు ఆమె వాహనం కోసం ఎదురుచూసిన చోటే దింపేసి వెళ్లారు. ప్రస్తుతం బాధితురాలు ఇద్దరిని గుర్తించగా మరో 21మందిని పట్టుకోవాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement