అత్యాచారయత్నం నుంచి తప్పించుకున్న యువతి | Youth attempts to rape woman in new delhi | Sakshi
Sakshi News home page

అత్యాచారయత్నం నుంచి తప్పించుకున్న యువతి

Published Fri, Jun 6 2014 10:24 AM | Last Updated on Sat, Jul 28 2018 8:44 PM

అత్యాచారయత్నం నుంచి తప్పించుకున్న యువతి - Sakshi

అత్యాచారయత్నం నుంచి తప్పించుకున్న యువతి

తనపై అత్యాచారయత్నానికి ఒడిగట్టిన ముగ్గురు వ్యక్తులను ధైర్యంగా ఎదుర్కొని తప్పించుకున్న యువతి వైనమిది. ఈ ఘటన బుధవారం రాత్రి 8 గంటల ప్రాంతంలో దక్షిణ ఢిల్లీలోని ఫతేపూర్ బేరీ వద్ద జరిగింది. వివరాలిలా ఉన్నాయి. బుధవారం రాత్రి 8 గంటల సమయంలో యువతి(19) తన ఇంటి సమీపంలోని ట్యాప్ వద్ద నీటిని పట్టుకోవడానికి వెళ్లింది. ఆ సమయంలో అదే కాలనీకి చెందిన ముగ్గురు వ్యక్తులు, సదరు యువతిని బలవంతంగా ఎత్తుకుని సమీప అడవిలోకి తీసుకుపోయారు.

 

అక్కడ ఆమెపై అత్యాచారానికి యత్నించగా తీవ్రంగా ప్రతిఘటించి తప్పించుకుని వచ్చి తల్లిదండ్రులకు విషయం చెప్పింది. పెనుగులాటలో యువతి తలపై తీవ్ర గాయం కావడంతో ఆమెను చికిత్స నిమిత్తం ఎయిమ్స్‌కు తరలించారు. యువతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. నిందితులందరూ పరారీలో ఉన్నారని, త్వరలోనే వారిని పట్టుకుంటామని వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement