బాలిక గర్భస్రావానికి సుప్రీం అనుమతి | Supreme Court allows 13-year-old rape survivor to abort her 31-week-old foetus | Sakshi
Sakshi News home page

బాలిక గర్భస్రావానికి సుప్రీం అనుమతి

Published Wed, Sep 6 2017 4:11 PM | Last Updated on Sun, Sep 2 2018 5:24 PM

బాలిక గర్భస్రావానికి సుప్రీం అనుమతి - Sakshi

బాలిక గర్భస్రావానికి సుప్రీం అనుమతి

న్యూఢిల్లీ: లైంగిక దాడి బాధితురాలి గర్భస్రావానికి సుప్రీంకోర్టు అనుమతించింది. ప్రధాన న్యాయమూర్తి దీపక్‌ మిశ్రాతో కూడిన బెంచ్‌ ఈ మేరకు తీర్పు వెలువరించింది. ముంబైకి చెందిన బాలిక(13)పై అత్యాచారం జరగడంతో ఆమె గర్భం దాల్చింది. అయితే, ఆమె గర్భస్రావం కోసం తల్లిదండ్రులు కోర్టును ఆశ్రయించారు. ఇరవై వారాల  గర్భస్రావంపై నిషేధం ఉండటంతో ఈ కేసు సుప్రీంకోర్టు వరకు వెళ్లింది. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం నివేదిక ఇవ్వాల్సిందిగా ముంబై లోని జేజే ఆస్పత్రి వైద్య బృందాన్ని ఆదేశించింది.
 
బుధవారం ఈ నివేదిక అందుకున్న న్యాయస్థానం బాలిక అబార్షన్‌కు అంగీకరించింది. ప్రస్తుతం 32 వారాల గర్భవతి అయిన బాధితురాలికి ఈ నెల 8 వ తేదీన గర్భస్రావం చేయాలని, అంతకు ముందు రోజు ఆస్పత్రిలో జాయిన్‌ చేసుకోవాలని కోరింది. దీనిపై న్యాయస్థానం సొలిసిటర్‌ జనరల్‌ రంజిత్‌ కుమార్‌ అభిప్రాయాన్ని కూడా తీసు​కుని.. ఈ మేరకు తీర్పు వెల్లడించింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement