భక్తురాలి సాయంతో ఆ బాబా ఏం చేశాడంటే... | UP Godman Arrested for rapes girl for 8 months | Sakshi
Sakshi News home page

యూపీలో మరో కీచక బాబా అరెస్ట్‌

Published Wed, Sep 27 2017 10:44 AM | Last Updated on Sat, Jul 28 2018 8:40 PM

UP Godman Arrested for rapes girl for 8 months - Sakshi

సాక్షి, లక్నో : మరో కీచక బాబా ఉదంతం ఉత్తరప్రదేశ్‌లో వెలుగు చూసింది. ఓ యువతిపై 8 నెలలుగా అత్యాచారం చేస్తున్నాడన్న ఆరోపణలపై సీతాపూర్‌ బాబాను ఎట్టకేలకు పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఇందుకు ఆయనగారి పరమ భక్తురాలే సాయం చేయటం గమనార్హం.

పలు విద్యాసంస్థలను నడుపుతున్న సీతాపూర్‌ బాబా అలియస్‌ సియారామ్‌ దాస్‌పై లక్నో, బారాబంకి, ఆగ్రా చుట్టుపక్కల బోలెడు అక్రమాస్తులు కూడబెట్టాడన్న ఆరోపణలు ఉన్నాయి. ఇదిలా ఉంటే 21 ఏళ్ల దళిత యువతిని ఆమె బంధవు ఒకరు, బాబా పరమ భక్తురాలు రింటూ సింగ్‌కు యువతిని అమ్మేసి వెళ్లిపోయాడు. ఆపై ఆమె యువతిని సియారామ్‌ దగ్గరకు తీసుకెళ్లి అప్పగించింది. ఇక అప్పటి నుంచి 8 నెలలపాటు తన ఆశ్రమంలో సియారామ్‌ యువతిపై అత్యాచారానికి పాల్పడుతూ వస్తున్నాడు. 

ఇదిలా ఉండగా సోమవారం రాత్రి కంట్రోల్‌ రూమ్‌కి యువతి సమాచారం అందించటంతో వ్యవహారం వెలుగు చూసింది. బాబా దగ్గరికి వచ్చిన మరికొందరు కూడా తనపై అత్యాచారానికి పాల్పడినట్లు యువతి ఆరోపించింది. ఆగ్రాలో ఓ స్థల వివాదంలో సెటిల్‌మెంట్‌కు వెళ్లిన సియారామ్‌ను మాటు వేసి సీతాపూర్‌ పోలీసులు మంగళవారం అరెస్ట్‌ చేశారు. గతంలోనూ పలువురు అమ్మాయిలను బాబా వద్దకు పంపించినట్లు రింటూ సింగ్‌ అంగీకరించింది. తనకు చెందిన ఓ కాలేజీలోనూ బెడ్‌ రూం ఏర్పాటు చేసుకుని సియారామ్‌ వ్యవహారాన్ని నడిపినట్లు పోలీసులు చెబుతున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement