Self styled Godman
-
ఆరో పెళ్లికి సిద్ధమైన బాబా.. ఐదో భార్య ఫిర్యాదుతో
లక్నో: రహస్యంగా ఒకరి తర్వాత ఒకరు చొప్పున ఐదుగురిని వివాహం చేసుకోవమే కాక వారికి విడాకులు ఇవ్వకుండానే ప్రస్తుతం ఆరో వివాహానికి సిద్ధపడ్డ దొంగ బాబాను కాన్పూర్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ వివరాలు.. ఉత్తరప్రదేశ్ షహనాజ్‌పూర్‌కు చెందిన అనూజ్ చేతన్ కథేరియా అనే వ్యక్తికి 2005లో మొదటి సారి వివాహం అయ్యింది. పెళ్లి తర్వాత భార్యను చిత్రహింసలకు గురి చేస్తుండటంతో ఆమె అతడి నుంచి విడిపోయి వేరుగా ఉంటుంది. ప్రస్తుతం వీరి విడాకులు కేసు ఇంకా కోర్టులోనే ఉంది. ఇదిలా ఉండగానే 2010లో అనూజ్ రెండో వివాహం చేసుకున్నాడు. కొద్ది కాలం తర్వాత ఆమె అనూజ్ వేధింపులు తట్టుకోలేక అతడి నుంచి విడిపోయింది. నాలుగేళ్ల తర్వాత అనూజ్ మూడో వివాహం చేసుకున్నాడు. ఆ తర్వాత కొద్ది రోజులకు మూడో భార్యకు తెలియకుండా ఆమె బంధువును నాలుగో వివాహం చేసుకున్నాడు. పెళ్లి తర్వాత అనూజ్ నిజ స్వరూపం తెలియడంతో అతడు నాలుగో వివాహం చేసుకున్న మహిళ ఆత్మహత్య చేసుకుని మరణించింది. ఈ క్రమంలో 2019లో అనూజ్ ఐదో సారి వివాహం చేసుకున్నాడు. కొద్ది రోజులు బాగానే ఉన్నప్పటికి ఆ తర్వాత ఐదో భార్యను వేధింపులకు గురి చేయడం ప్రారంభించాడు. దాంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ క్రమంలో అతడికి గతంలోనే నాలుగు సార్లు వివాహం అయినట్లు తెలిసింది. అప్పటి నుంచి ఐదో భార్య అనూజ్ నుంచి వేరుగా ఉండసాగింది. కొద్ది రోజుల క్రితం అనూజ్ 6వ సారి పెళ్లికి సిద్ధమయ్యాడు. ఈ విషయం కాస్త అతడి ఐదో భార్యకు తెలిసింది. వెంటనే కాన్పూర్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు అనూజ్‌ని అరెస్ట్ చేశారు. దర్యాప్తులో అనూజ్ మ్యాట్రిమోనియల్ సైట్ల ద్వారా తాను వీరందరిని మోసం చేశానని తెలిపాడు. లక్కీ పాండేగా పేరు మార్చుకుని.. తప్పుడు అడ్రెస్లు ఇస్తూ.. మహిళలను మోసం చేసేవాడనని వెల్లడించాడు. తనను తాను ప్రభుత్వ ఉద్యోగి, క్లర్క్, టీచర్, తంత్రగాడిగా పరిచయం చేసుకుని బాధితులను ఏమార్చి వారిని వివాహం చేసుకునే వాడినని తెలిపాడు. అలానే సమస్యలతో తన ఆశ్రమానికి వచ్చే మహిళలను ట్రాప్ చేసి లొంగదీసుకునేవాడినని పోలీసుల దర్యాప్తులో వెల్లడించాడు అనూజ్ . చదవండి: 4 రోజుల్లో పెళ్లి.. రోడ్డు పక్కన పెళ్లి కూతురు శవం -
చిక్కిన బాబా శివ శంకర్..
సాక్షి, చెన్నై: లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న, అవతార పురుషుడిగా చెప్పుకునే శివశంకర్ బాబ ఢిల్లీలో పోలీసులకు చిక్కాడు. బుధవారం అక్కడి ఖాజీయాబాద్లోని ఓ భక్తుడి ఇంట్లో సీబీసీఐడీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయనకు చెందిన సుశీల్ హరి ఇంటర్నేషనల్ పాఠశాలలో సోదాలు నిర్వహించారు. ఇలా బుక్కయ్యాడు... లైంగిక ఆరోపణలు రావడంతో శివశంకర్ బాబా ఆధ్యాత్మిక అదృశ్యం అయ్యాడు. జార్ఖండ్‌లోని డెహ్రాడూన్‌లో ఓ ఆస్పత్రిలో గుండెపోటు చికిత్స తీసుకుంటున్నట్లు గుర్తించిన సీబీసీఐడీ విచారణ ముమ్మరం చేశారు. విదేశాలకు పారిపోకుండా విమానాశ్రయాలకు లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారు. దీంతో బయటకు వెళ్లే మార్గం లేక ఢిల్లీలోని ఓ భక్తుడి వద్ద తలదాచుకునే ప్రయత్నం చేసి అడ్డంగా బుక్కైయ్యారు. భక్తుడి ఇంట్లో బస.. డెహ్రాడూన్‌లో ఓ భక్తురాలితో కలిసి ప్రత్యక్షమైన బాబా, ఆ తర్వాత పత్తా లేకుండా పోయినట్టు సీబీసీఐడీ బృందం విచారణలో తేలింది. అంతే కాకుండా సాధారణ రోజుల్లో ఢిల్లీ వెళ్లినప్పుడు ఓ భక్తుడి ఇంట్లో బస చేసే వాడని సమాచారం అందడంతో అతని ఇంటిపై నిఘా ఉంచారు. బుధవారం వేకువ జామున అక్కడికి ఈ బాబా రాగానే, ఢిల్లీ పోలీసుల సాయంతో అరెస్టు చేశారు. అక్కడి కోర్టులో హాజరు పరిచి, అనంతరం చెన్నైకి తరలించే ఏర్పాట్లు చేశారు. ముమ్మరంగా తనిఖీలు.. ఉండగా, కేలంబాక్కంలోని బాబుకు చెందిన సుశీల్ హరి ఇంటర్నేషనల్ స్కూల్లో సీబీసీఐడీ ఇన్స్పెక్టర్ నేతృత్వంలో ఏడు మందితో కూడిన బృందం సోదాలు నిర్వహించింది. 73 మంది టీచర్లు పని చేస్తున్నట్లు గుర్తించారు. వారిలో పలు కేసులను ఎదుర్కొంటున్న భారతి, దీపా అనే టీచర్ల వివరాలను సేకరించారు. బాబా లీలకు సంబంధించిన అనేక వీడియోలు, కంప్యూటర్ హార్డ్ డిస్కులు బయట పడినట్లు సమాచారం. ఈ పాఠశాలలను ప్రభుత్వం తన గుప్పెట్లోకి తీసుకోవాలని పిల్లల హక్కుల సంఘం డిమాండ్ చేసింది. మాజీ మంత్రికి నో బెయిల్.. నటి చాందిని ఇచ్చిన ఫిర్యాదుతో మాజీ మంత్రి మణికంఠన్‌పై విచారణ ముమ్మరంగా సాగుతోంది. ఆయన అధికారంలో ఉన్న సమయంలో ఆయనకు పీఏ, గన్‌మెన్‌గా వ్యవహరించిన వారందరిని పోలీసులు ఇప్పటికే విచారించారు. ఆయన అరెస్ట్‌కు దాదాపు రంగం సిద్ధమైనట్లు సమాచారం. దీంతో తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని మణి కంఠన్ మద్రాసు హైకోర్టును ఆశ్రయించాడు. విచారణ ప్రాథమిక దశలో ఉందని, బెయిల్ ఇస్తే, సాక్షుల్ని, ఫిర్యాదుదారులను ప్రభావితం చేసే అవకాశాలు ఉన్నాయని పోలీసు తరఫు న్యాయవాదుల వాదనతో ఏకీభవించిన న్యాయస్థానం బెయిల్ పిటిషన్‌ను తిరస్కరించింది. బాబ్జీ మదన్ కోసం వేట.. లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటూ జైళ్లో ఉన్న అథ్లెటిక్ అకాడమి శిక్షకుడు నాగరాజన్ మీద విదేశాల్లోని ఇద్దరు తమిళనాడు క్రీడాకారిణులు ఆన్లైన్ ద్వారా ఫిర్యాదులు చేశారు. అలాగే లైంగిక వేధింపుల కేసులో అరెస్టయిన జూడో అకాడమి మాస్టర్ ఏబీన్ రాజ్‌కు చెన్నై కోర్టు బెయిల్ నిరాకరించింది. దానితో పాటు యూట్యూబ్ ద్వారా మహిళలను అసభ్య పదజాలాలతో దూషించడం, ఆన్లైన్ ద్వారా నగదు వసూళ్లలో ఉన్న టాక్సిక్ మదన్ ఛానల్ నిర్వాహకుడు బాబ్జి మదన్ కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. ఆయన తండ్రి, భార్య కృతికనును బుధవారం విచారించారు. కృతికను అరెస్ట్ చేశారు. చదవండి: కీచక బాబాకు సాయం.. మహిళా టీచర్లపై పోక్సో చట్టం -
కీచక బాబాకు సాయం.. మహిళా టీచర్లపై పోక్సో చట్టం
సాక్షి, చెన్నై: కీచక బాబా కోసం విద్యార్థినులను మభ్యపెట్టినట్లు తేలడంతో ఇద్దరు మహిళా టీచర్లపై పోక్సో చట్టంతో పాటు తొమ్మిది సెక్షన్ల కింద మంగళవారం కేసులు నమోదు చేశారు. హాస్టల్లో ఉండే విద్యార్థినులను భారతి, దీప అనే టీచర్లు బలవంతంగా బాబా ఆశ్రమంలోని గదిలోకి తీసుకెళ్లే వారని విచారణలో తేలింది. మరికొందరు టీచర్ల హస్తం కూడా ఉందన్న సమాచారంతో విచారణ వేగం చేశారు. చెంగల్పట్టు జిల్లా కేలంబాక్కంలోని సుశీల్‌హరి ఇంటర్నేషనల్ స్కూల్ విద్యార్థినులను లైంగికంగా వేధించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న శివశంకర్ బాబా లీలలు ఒకొక్కటిగా బయటకు వస్తున్నాయి. ఆయనపై ఫిర్యాదులు హోరెత్తడంతో సీబీసీఐడీ విచారణను వేగవంతం చేసింది. ఆయన ఝార్కండ్ రాష్ట్రంలోని డెహ్రడూన్ ఆస్పత్రిలో చేరినట్లు సమాచారం రావడంతో డీఎస్పీ స్థాయి అధికారి నేతృత్వంలోని బృందం అక్కడికి వెళ్లి విచారించింది. బాబా జాడ కానరాలేదు. విదేశాలకు పారిపోవడానికి సిద్ధమవుతున్నట్టు సీబీసీఐడీ గుర్తించింది. ఆయన విమానాశ్రయాలకు మంగళవారం లుక్ అవుట్ నోటీసులను జారీ చేశారు. రూ. 700 కోట్ల ఆస్తులు బాబా వీడియో ఒకటి తాజాగా వైరల్ అయింది. అందులో తనకు రూ.700 కోట్ల మేర ఆస్తులు ఉన్నట్లు స్వయంగా శివశంకర్ బాబా మహిళలతో ముచ్చటించారు. బాలికలు, వితంతువులను కించపరిచేలా చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. చదవండి: తీర్పులాంటి ప్రశ్న ఇదేం ఆర్గ్యుమెంట్? -
అతడిని పట్టిస్తే రూ. 5 లక్షలు ఇస్తాం!
న్యూఢిల్లీ : తన ఆశ్రమంలో మహిళలు, బాలికలను బంధించి, అత్యాచారానికి పాల్పడ్డ దొంగ బాబా ఆచూకీ తెలిపిన వారికి నజరానా అందజేస్తామని సీబీఐ తెలిపింది. ఈ మేరకు అతడిని పట్టించిన వారికి రూ. 5 లక్షల భారీ రివార్డు ప్రకటించింది. వివరాలు.. తనను తాను భగవంతుడిగా చెప్పుకొనే వీరేందర్ దేవ్ దీక్షిత్(77) ఢిల్లీలోని రోహిణి సమీపంలో ఆశ్రమం నడిపించేవాడు. ఈ క్రమంలో ప్రవచనాలు వినేందుకు మహిళలు, బాలికలు అక్కడికి వచ్చేవారు. మాయమాటలు చెప్పి వీరిని బంధించిన వీరేందర్..ఆశ్రమంలోనే అకృత్యాలకు పాల్పడేవాడు. ఇతడి ఆగడాలను ఓ గమనించిన ఓ గుర్తు తెలియని వ్యక్తి 2017 డిసెంబరు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. దీంతో ఢిల్లీ హైకోర్టు ఈ కేసు విచారణను సీబీఐకి అప్పగించింది. దారుణంగా హింసించేవాడు... తన ఆశ్రమానికి వచ్చే బాలికలు, మహిళలనుదారుణంగా హింసించేవాడని సీబీఐ పేర్కొంది. జంతువుల్లా వాళ్లను పంజరాల్లో బంధించి అత్యాచారానికి పాల్పడే వాడని తెలిపింది. అయితే కేసు నమోదైన నాటి నుంచి అతడు పరారీలో ఉండటం.. నేపాల్‌కు పారిపోయాడనే సమాచారంతో గతేడాది జనవరి 22, ఫిబ్రవరి 22, 2019లో రెండుసార్లు లుక్ అవుట్ నోటీసులు జారీ చేసింది. అదే విధంగా ఇంటర్‌పోల్‌ను కూడా ఆశ్రయించింది. కానీ ఇంతవరకు అతడి ఆచూకీ మాత్రం తెలియరాలేదు. ఈ క్రమంలో తాజాగా వీరేందర్‌ను పట్టించిన వారికి ఐదు లక్షల రూపాయల బహుమానమిస్తామని ప్రకటించింది. -
లైంగిక దాడి ఆరోపణలపై స్వామీజీ అరెస్ట్
సాక్షి, న్యూఢిల్లీ : దేశ రాజధానిలో లైంగిక దాడి ఆరోపణలపై వివాదాస్పద స్వామీజీ ఆషు మహరాజ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. హజ్‌ఖాస్ ఆశ్రమంలో ఓ మహిళ, ఆమె మైనర్ కుమార్తెపై ఆషు మహరాజ్ లైంగిక దాడికి పాల్పడ్డారనే ఆరోపణలున్నాయి. ఇదే కేసులో ఆయన కుమారుడు సమర్ ఖాన్‌ను కూడా అదుపులోకి తీసుకున్నామని ఏసీపీ రాజీవ్ రంజన్ చెప్పారు. ఆషు మహరాజ్‌పై కీలక ఆధారాలు లభ్యం కావడంతో ఆయనను అరెస్ట్ చేశామని పోలీసులు చెప్పారు. కేసుకు సంబంధించి నిందితులిద్దరినీ ప్రశ్నించామన్నారు. కాగా 2008 నుంచి 2013 వరకూ స్వామీజీ, ఆయన స్నేహితులు, కుమారుడు తనపై లైంగిక దాడికి పాల్పడ్డారని, తర్వాత తన మైనర్ కుమార్తెపైనా లైంగిక దాడి జరిపారని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో బాధితురాలు ఆరోపించారు. సెప్టెంబర్ 10న హజ్‌ఖాస్ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదవగా, అనంతరం ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులకు బదలాయించారు. నిందితులపై పోక్సో చట్టం సహా పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. కాగా, మైనర్ బాలికను లైంగికంగా వేధించడంతో పాటు హతమారుస్తానని బెదిరించిన నకిలీ బాబా నబ్బేదాస్ను ఇటీవల ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. -
అతీంద్రియ శక్తుల కోసం వారితో..
సాక్షి, ముంబై : మహారాష్ట్రలో బురిడీ బాబా గుట్టు రట్టైంది. అతీంద్రియ శక్తులు సమకూరేందుకు అసహజ శృంగారంలో పాల్గొనాలని తన అనుచరులను ప్రేరేపించిన వివాదాస్పద స్వామీజీని పర్బానీ పోలీసులు అరెస్ట్ చేశారు. శిష్యులను అసహజ శృంగారంలో పాల్గొనాలని బాబా అసిఫ్ నూరి బలవంతపెడుతున్న వీడియోలను స్ధానికులు సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అవి వైరల్‌గా మారాయి. నూరిని పొరుగున ఉన్న బుల్ధానా జిల్లాలో అరెస్ట్ చేశామని పర్బానీ ఎస్పీ దిలీప్ జలాకే తెలిపారు. నిందితుడు కొత్తగా పెళ్లయిన వ్యక్తులను లక్ష్యంగా చేసుకుని వారి సమస్యలు తీరుస్తానని నమ్మబలుకుతాడని అనంతరం వారిని గదిలోకి తీసుకువెళ్లి ఒకరితో ఒకరు అసహజ పద్ధతుల్లో శృంగార కార్యకలాపాల్లో పాల్గొనాలని ఒత్తిడి చేస్తాడని చెప్పారు. అసహజ శృంగారాన్ని నిషేధించే ఐపీసీ సెక్షన్ నిబంధనలపై సుప్రీం కోర్టు తీర్పును రిజర్వ్‌లో ఉంచిన క్రమంలో ఈ ఘటన చోటుచేసుకుంది. -
అలాంటోడ్ని నడిరోడ్డులో ఉరితీయాలి
సాక్షి, న్యూఢిల్లీ: అత్యాచార ఆరోపణలు ఎదుర్కొంటున్న దాతి మహారాజ్ ఉదంతంపై యోగా గురు బాబా రాందేవ్ తీవ్రంగా స్పందించారు. అలాంటోడ్ని నడిరోడ్డుపై ఉరి తీయాలని ఆయన మీడియా ముందు రాందేవ్ వ్యాఖ్యాలు చేశారు. సోమవారం ఢిల్లీలో ఓ కార్యక్రమంలో పాల్గొన్న రాందేవ్‌ను మీడియా పలకరించింది. ఈ సందర్భంగా ‘దాతి వ్యవహారం’పై స్పందించాల్సిందిగా ఆయన్ని కోరింది. ‘కాషాయం ధరించినంత మాత్రాన సాధువులు అయిపోరు. సాధువుల గౌరవానికి, ప్రతిష్టకు మచ్చ తెచ్చేలా ఎవరు వ్యవహరించినా సరే వాళ్లు జైలుకు పోవాల్సిందే. భక్తి, ధ్యానం ముసుగులో ఓ మహిళపై అఘాయిత్యాలకు పాల్పడ్డాడు. వాడేం బాబా?.. అలాంటోడిని నడిరోడ్డులోకి లాక్కోచ్చి ప్రజలే ఉరి తీయాలి’ అని రాందేవ్ తీవ్రంగా స్పందించారు. ‘పవిత్రతను పాటించటం సాధువుల బాధ్యత. బాబా ముసుగులో నీచపు పనులకు పాల్పడితే శిక్ష అనుభవించాల్సిందే. సాధువులు కూడా శిష్యులకు హితబోధచేయాలి. నా వరకు నా శిష్యుల్లో ఇప్పటిదాకా అలాంటి వాళ్లెవరూ లేరు. అందుకు నేను గర్విస్తున్నా’అని రాందేవ్ తెలిపారు. ఇదిలా ఉంటే తప్పించుకుని తిరుగుతున్న దాతి మహారాజ్‌కు ఢిల్లీ పోలీసులు తాజాగా మరోసారి నోటీసులు జారీ చేశారు. బుధవారం తమ ఎదుట విచారణకు హాజరుకావాలని ఢిల్లీ పోలీసులు ఆదేశించారు. లైంగిక ఆరోపణలు.. దేశ రాజధాని శివారులో శ్రీ శనిధామ్ ట్రస్ట్ పేరిట దాతి మహారాజ్ ఆశ్రమం నిర్వహిస్తున్నాడు. తాజాగా అత్యాచారం కేసు నమోదు అయ్యింది. రెండేళ్ల క్రితం దాతి తనపై అత్యాచారం చేశాడని ఆరోపిస్తూ ఓ మాజీ శిష్యురాలు(25).. దక్షిణ ఢిల్లీలోని ఫతేపూర్ బేరీ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసుకున్న ఢిల్లీ పోలీసులు దాతి కోసం రాజస్థాన్, ఢిల్లీలోని ఆశ్రమాల్లో గాలింపు చేపట్టారు. అయితే దాతి మాత్రం పోలీసులకు చిక్కకుండా తప్పించుకుని తిరుగుతున్నాడు. పైగా ఓ వీడియో సందేశంలో ‘బాధితురాలు తన కూతురులాంటిదని, భక్తులంతా సహనంగా ఉండాలంటూ’ పిలుపునిచ్చాడు. అయితే దాతిని ఇప్పటిదాకా అరెస్ట్ చేయకపోవటంపై ఢిల్లీ మహిళా కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో ఢిల్లీ పోలీస్ కమిషనర్ రంగంలోకి దిగి ఈ కేసును పర్యవేక్షిస్తున్నారు. -
స్వామీజీ రాసలీలలు.. కొత్త కోణాలు
సాక్షి, బెంగళూర్ : రెండు రోజుల క్రితం కలకలం రేపిన గురునంజేశ్వర స్వామీజీ రాసలీలల పంచాయితీ శ్రీశైలం మఠాధిపతి శ్రీ చెన్నసిద్దరామ పండితారాధ్య స్వామీజీ వద్దకు చేరింది. మద్దవనవర జంగమ మఠం స్వామీజీ శివాచార్య స్వామీజీ కుమారుడు దయానంద అలియాస్ గురునంజేశ్వర స్వామీజీ ఓ యువతితో సన్నిహితంగా ఉన్న వీడియో ఒకటి సోషల్ మీడియా ద్వారా బయటకు పొక్కటం తెలిసిందే. దీంతో ఆ కుటుంబాన్ని ఆశ్రమం నుంచి బహిష్కరించాలని ట్రస్ట్ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే పూర్తి వివరాలు సేకరిస్తున్న శ్రీశైలం మఠాధిపతి.. తుది నిర్ణయం తీసుకుంటారని సమాచారం. మరోవైపు ఈ వీడియోలో ఉన్నదని కొన్ని కన్నడ మీడియా ఛానెళ్లు ప్రచారం చేస్తున్న హీరోయిన్ మీడియా ముందుకు వచ్చారు. శుక్రవారం సువర్ణ న్యూస్ ఛానెల్ తో మాట్లాడిన ఆమె ఆ వీడియోలో ఉంది తాను కాదంటూ స్పష్టం చేశారు. అసలు దయానంద్ ఎవరో తనకు తెలీదని.. దయచేసి తన పేరును ఈ వ్యవహారంలోకి లాగొద్దని ఆమె విజ్ఞప్తి చేశారు. మరో కోణం... అంతకు ముందు వెలువడ్డ కథనం ఏంటంటే... వీడియో అడ్డం పెట్టుకుని డబ్బు కోసం ఆ హీరోయిన్ బ్లాక్ మెయిల్ చేసిందని. కన్నడ మూవీలో నటించే ఆ నటి హనీ ట్రాప్‌లో స్వామీజీ చిక్కుకున్నాడని.. దయానంద్‌తో సన్నిహితంగా ఉన్న వీడియో చిత్రీకరించిందని.. అందుకు స్వామీజీ బంధువులు కూడా సహకరించారనే కథనాలు వెలువరించాయి. ఇదంతా రెండు నెలల క్రితమే జరిగిన వ్యవహారమని.. ఆసమయంలో ఓ పోలీస్ ఉన్నతాధికారి సమక్షంలోనే పంచాయతీ జరిగిందన్న ఆరోపణలు వినిపించాయి. అయితే పోలీస్ శాఖ మాత్రం ఆ ఆరోపణలను ఖండిస్తోంది. -
నోర్మూయండీ.. ఆవేశంగా లేచిన రాధేమా!
సంభాల్: వివాదాస్పద ఆధ్యాత్మిక వేత్త రాధేమా(52) (అలియాస్ సుఖ్విందర్ కౌర్) సహనం కోల్పోయింది. విలేకరులు అడిగిన ప్రశ్నలతో ఆమె ఒక్కసారిగా ఆవేశంతో ఊగిపోయింది. కల్కిమహోత్సవ్‌లో పాల్గొనేందుకు ఇక్కడికి వచ్చిన ఆమెను మీడియా ప్రతినిధులు పలు ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరిచేశారు. దీంతో ఆమె సహనం కోల్పోయిన తన సీట్లోంచి లేచారు. నాపై ఎలాంటి ఆరోపణలు లేవు. అలాంటి ప్రశ్నలు నన్నెందుకు అడుగుతున్నారు? అంటూ విరుచుకుపడ్డారు. పక్కనే ఉన్న శిష్యగణం ఆమెను శాంతపరిచి తిరిగి సీట్లో కూర్చోబెట్టాల్సి వచ్చింది. తూర్పు ఢిల్లీలోని వివేక్ విహార్ పోలీస్‌స్టేషన్‌కు ఇటీవల వచ్చిన రాధేమా స్టేషన్ అధికారి సీట్లో కూర్చోవటం పెను వివాదానికి దారి తీసిన విషయం విదితమే. అలాగే, తన శిష్యగణంలో ఒకరి కోడలిపై వరకట్నం వేధింపుల కేసులోనూ రాధేమా ప్రమేయం ఉందంటూ బాధితురాలి కుటుంబీకులు కేసు పెట్టారు. ఈ అంశాలపైనే విలేకరులు ఆమెను ప్రశ్నించగా మీరేమైనా పూలు కడిగిన ముత్యాలా? అలాంటి ప్రశ్నలను నన్నెందుకు అడుగుతున్నారు? నోళ్లు ముయ్యండంటూ వారికి రాధేమా ఎదురు తిరిగింది. కూర్చోలోంచి లేచి వెళ్లే ప్రయత్నం చేయగా ఆమె అనుచరులు శాంతపరిచారు. దీంతో కార్యక్రమం సజావుగా సాగిపోయింది. -
భక్తురాలి సాయంతో ఆ బాబా ఏం చేశాడంటే...
సాక్షి, లక్నో : మరో కీచక బాబా ఉదంతం ఉత్తరప్రదేశ్‌లో వెలుగు చూసింది. ఓ యువతిపై 8 నెలలుగా అత్యాచారం చేస్తున్నాడన్న ఆరోపణలపై సీతాపూర్ బాబాను ఎట్టకేలకు పోలీసులు అరెస్ట్ చేశారు. ఇందుకు ఆయనగారి పరమ భక్తురాలే సాయం చేయటం గమనార్హం. పలు విద్యాసంస్థలను నడుపుతున్న సీతాపూర్ బాబా అలియస్ సియారామ్ దాస్‌పై లక్నో, బారాబంకి, ఆగ్రా చుట్టుపక్కల బోలెడు అక్రమాస్తులు కూడబెట్టాడన్న ఆరోపణలు ఉన్నాయి. ఇదిలా ఉంటే 21 ఏళ్ల దళిత యువతిని ఆమె బంధవు ఒకరు, బాబా పరమ భక్తురాలు రింటూ సింగ్‌కు యువతిని అమ్మేసి వెళ్లిపోయాడు. ఆపై ఆమె యువతిని సియారామ్ దగ్గరకు తీసుకెళ్లి అప్పగించింది. ఇక అప్పటి నుంచి 8 నెలలపాటు తన ఆశ్రమంలో సియారామ్ యువతిపై అత్యాచారానికి పాల్పడుతూ వస్తున్నాడు. ఇదిలా ఉండగా సోమవారం రాత్రి కంట్రోల్ రూమ్‌కి యువతి సమాచారం అందించటంతో వ్యవహారం వెలుగు చూసింది. బాబా దగ్గరికి వచ్చిన మరికొందరు కూడా తనపై అత్యాచారానికి పాల్పడినట్లు యువతి ఆరోపించింది. ఆగ్రాలో ఓ స్థల వివాదంలో సెటిల్మెంట్కు వెళ్లిన సియారామ్‌ను మాటు వేసి సీతాపూర్ పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. గతంలోనూ పలువురు అమ్మాయిలను బాబా వద్దకు పంపించినట్లు రింటూ సింగ్ అంగీకరించింది. తనకు చెందిన ఓ కాలేజీలోనూ బెడ్ రూం ఏర్పాటు చేసుకుని సియారామ్ వ్యవహారాన్ని నడిపినట్లు పోలీసులు చెబుతున్నారు. -
సంతానం కోసం వస్తే.. భక్తురాలితో స్వామి పరార్!
సాక్షి, చెన్నై: సంతాన కోసం పూజలు చేద్దామని వచ్చిన భక్తురాలితో స్వామీజీ పరారైన ఘటన తమిళనాడులో జరిగింది. భర్త ఫిర్యాదు చేయడంతో విషయం సోమవారం వెలుగులోకి వచ్చింది. ఆ వివరాలిలా ఉన్నాయి. తంజావూరు జిల్లా తిరువైయ్యారులోని ఇటుకల బట్టీ సమీపంలో బాలమురుగన్ అలియాస్ బాలసిద్దర్ (45) అనే వ్యక్తి 2014 నుంచి స్వామీజీగా చెలామణి అవుతున్నాడు. అమావాస్య రోజుల్లో అగ్నిగుండం వేసి పూజలు చేసేవాడు. ఈ మూడేళ్ల కాలంలో క్రమేణా ఆయన వద్దకు వచ్చే భక్తులు పెరిగారు. వీరిలో 11 మంది శిష్యులుగా మారారు. కొందరు పోలీసు అధికారులు సైతం ఆయనను దర్శించుకుంటూ మఠానికి వసతి సౌకర్యాలు కల్పించేవారు. దేవుళ్ల శిలా విగ్రహాలను ప్రతిష్టించి స్వామికి సమర్పించారు. ఇదిలా ఉండగా, సంతాన లేమితో బాధపడుతున్న పల్లి అగ్రహారానికి చెందిన విజయకుమార్ అనే రైతు, ఆయన రెండో భార్య పునీత (41) తరచూ బాలసిద్ధర్ వద్దకు వచ్చేవారు. ప్రతిసారీ భర్తతో కలిసి వెళ్లే పునీత ఈనెల 21న ఒంటరిగా వెళ్లి స్వామిని దర్శించుకుంది. అయితే ఆ తరువాత ఇంటికి తిరిగి రాకపోవడంతో భార్యను వెతుక్కుంటూ విజయకుమార్ మఠానికి రాగా.. స్వామి కూడా కనిపించలేదు. తన భార్యను స్వామి కిడ్నాప్ చేశాడంటూ పోలీసులకు ఆయన ఫిర్యాదు చేశాడు. బాలసిద్దర్ హిమాలయాలకు వెళ్లాడని, నవంబరు 2వ తేదీన మఠానికి చేరుకుంటాడని శిష్యులు పోలీసులకు చెప్పారు. పునీతతోపాటు పరారైన బాలసిద్దర్ నాగపట్నం వాసి. బీసీఏ చదివి బెంగళూరులోని ఒక ఐటీ సంస్థలో కొన్నాళ్లు పనిచేశాడు. వివాహం అనంతరం ఓ కుమారుడు పుట్టిన కొంత కాలానికి సంసార జీవితంపై విరక్తిపుట్టిందని, దేవుడు తనను పిలుస్తున్నాడంటూ ఇంటి నుంచి వెళ్లిపోయినట్లు పోలీసుల విచారణలో తెలిసింది. బాలసిద్ధర్, పునీత ఆచూకీ కోసం గాలిస్తున్నట్లు పోలీసులు వివరించారు. -
ద్యావుడా..?
-
గుర్మీత్ ఔట్.. తెరపైకి స్వామి నిత్యానంద..
ఆశ్రమంలో మైండ్ సెట్ మార్చి ఆపై దారుణాలు మహిళలు, వారి కుటుంబంపై వేధింపుల పర్వం ఫిర్యాదు చేస్తే పసిగట్టి.. బాధితురాళ్లపై తప్పుడు కేసులు సాక్షి, బెంగళూరు : అత్యాచారం కేసులో డేరా సచ్ఛా సౌదా చీఫ్ గుర్మీత్ రాంరహీమ్ సింగ్ కు 20 ఏళ్లు (ఒక్కో కేసులో పదేళ్లు) శిక్ష పడిన నేపథ్యంలో మరో వివాదాస్పద ఆధ్యాత్మిక గురువు నిత్యానంద ధ్యాన పీఠాధిపతి నిత్యానంద స్వామి వ్యవహరం మరోసారి వెలుగుచూసింది. ఆశ్రమంలో సేవకురాలిగా ఉన్న తనపై నిత్యానంద అత్యాచారానికి పాల్పడ్డాడని ఏడేళ్ల కిందట రామ్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు ఓ బాధితురాలు తెలిపారు. ఐదేళ్ల పాటు తనపై శారీరక వేధింపులకు పాల్పడ్డాడని అమెరికాకు చెందిన మహిళ గతంలో ఫిర్యాదు చేయగా, అప్పటి కర్ణాటక సీఎం సదానంద గౌడ తీవ్రంగా స్పందించి.. నిత్యానందను అరెస్ట్ చేయాలంటూ ఆదేశించడంతో పోలీసులు రంగంలోకి దిగిన విషయం తెలిసిందే. నిత్యానంద ఆస్తులతో బాధితులకు న్యాయం చేయాలి తనను శారీరకంగా, మానసికంగా, లైంగికంగా ఎన్నో రకాలుగు వేధింపులకు గురిచేశాడని 2010 నవంబర్ లో తాను ఫిర్యాదు చేయగా, అందుకు ప్రతీకారంతో ఆ మరుసటి నెలలో తనపై తప్పుడు కేసులు బనాయించారని తాజాగా ఓ బాధితురాలు వాపోయారు. ఎవరైనా తనపై ఫిర్యాదు చేస్తే, ఆ స్టేట్ మెంట్ చదివి ఫిర్యాదు చేసిన వ్యక్తిని గుర్తించి చిత్ర హింసలకు గురిచేయడం నిత్యానందకు అలవాటేనని బాధితురాలు ఆరోపించారు. రేపిస్ట్, డేరా చీఫ్ గుర్మీత్ ఆస్తులను ప్రభుత్వం స్వాధీనం చేసుకున్నట్లుగా, నిత్యానంద ఆస్తుల విషయంలోనూ వ్యవహరించి బాధిత మహిళలకు సాయం చేయాలని ఆమె విజ్ఞప్తి చేశారు. బాధిత మహిళలు కలిసికట్టుగా పోరాటం చేస్తే నిత్యానంద బెయిల్ రద్దవుతుందని ఆమె ధీమా వ్యక్తం చేశారు. గతంలో నటి రంజితతో నిత్యానంద ఎంతో చనువుగా ఉన్నప్పటి వీడియోలు దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. లైంగిక వేధింపులు, అత్యాచారాలకు పాల్పడే స్వామి నిత్యానంద హాయిగా తన ఆశ్రయాలు, పీఠాలలో కూర్చుని వ్యాపార, వినోదాత్మక, ఇతరత్రా కార్యర్రమాలు నిర్వహిస్తూ మరికొంత మంది అమాయకులను మోసం చేస్తున్నాడని చెప్పారు. ఆశ్రమంలో తన సేవకులుగా తీసుకున్నాక మహిళలతో పాటు వారి తల్లిదండ్రులను ఎన్నో రకాలుగా భయభ్రాంతులకు గురిచేయడం ఆయనకు అలవాటు. బెంగళూరులోనే కాదు దేశంలోని ఇతర అన్ని ఆశ్రమాలలోనూ ఇదే విధంగా నిత్యానంద వేధింపులకు పాల్పడేవారని ఆమె వివరించారు. మైండ్ సెట్ మార్చేస్తారు ‘నిత్యానంద ఆశ్రయంలో చేరిన వాళ్లు తమ సొంత గుర్తింపును వదులుకుంటారు. కేవలం నిత్యానంద శిష్యులుగా మాత్రమే చెప్పుకుంటారు. ఆ విధంగా వారి మైండ్ సెట్ అప్ చేస్తారు. దీంతో నిత్యానంద చెప్పిన విధంగా అక్కడివారు నడుచుకుంటారు. ఈ క్రమంలోనే కొన్నిసార్లు లైంగిక దాడులు జరుగుతుంటాయి. దారుణాన్ని గుర్తించి ఫిర్యాదు చేస్తే.. బాధితులపై తప్పుడు కేసులు బనాయిస్తారు. వారి కుటుంబాన్ని జైలుపాలు చేస్తామని వేధింపులకు గురిచేస్తారని’ నిత్యానంద దగ్గర అశ్రయం పొందిన ఆ బాధిత మహిళ తెలిపారు.