స్వామీజీ రాసలీలలు.. కొత్త కోణాలు | sexual acts of Karnataka godman’s son | Sakshi
Sakshi News home page

స్వామీజీ రాసలీలలు.. కొత్త కోణాలు

Published Sat, Oct 28 2017 6:09 PM | Last Updated on Mon, Jul 23 2018 8:49 PM

sexual acts of Karnataka godman’s son - Sakshi

సాక్షి, బెంగళూర్‌ : రెండు రోజుల క్రితం కలకలం రేపిన గురునంజేశ్వర స్వామీజీ రాసలీలల పంచాయితీ శ్రీశైలం మఠాధిపతి శ్రీ చెన్నసిద్దరామ పండితారాధ్య స్వామీజీ వద్దకు చేరింది. మద్దవనవర జంగమ మఠం స్వామీజీ శివాచార్య స్వామీజీ కుమారుడు దయానంద అలియాస్ గురునంజేశ్వర స్వామీజీ ఓ యువతితో సన్నిహితంగా ఉన్న వీడియో ఒకటి సోషల్ మీడియా ద్వారా బయటకు పొక్కటం తెలిసిందే. దీంతో ఆ కుటుంబాన్ని ఆశ్రమం నుంచి బహిష్కరించాలని ట్రస్ట్ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే పూర్తి వివరాలు సేకరిస్తున్న శ్రీశైలం మఠాధిపతి.. తుది నిర్ణయం తీసుకుంటారని సమాచారం. 

మరోవైపు ఈ వీడియోలో ఉన్నదని కొన్ని కన్నడ మీడియా ఛానెళ్లు ప్రచారం చేస్తున్న హీరోయిన్‌ మీడియా ముందుకు వచ్చారు. శుక్రవారం సువర్ణ న్యూస్‌ ఛానెల్‌ తో మాట్లాడిన ఆమె ఆ వీడియోలో ఉంది తాను కాదంటూ స్పష్టం చేశారు. అసలు దయానంద్ ఎవరో తనకు తెలీదని.. దయచేసి తన పేరును ఈ వ్యవహారంలోకి లాగొద్దని ఆమె విజ్ఞప్తి చేశారు. 

మరో కోణం... 

అంతకు ముందు వెలువడ్డ కథనం ఏంటంటే... వీడియో అడ్డం పెట్టుకుని డబ్బు కోసం ఆ హీరోయిన్ బ్లాక్ మెయిల్ చేసిందని. కన్నడ మూవీలో నటించే ఆ నటి హనీ ట్రాప్‌లో స్వామీజీ చిక్కుకున్నాడని.. దయానంద్‌తో సన్నిహితంగా ఉన్న వీడియో చిత్రీకరించిందని.. అందుకు స్వామీజీ బంధువులు కూడా సహకరించారనే కథనాలు వెలువరించాయి.  ఇదంతా రెండు నెలల క్రితమే జరిగిన వ్యవహారమని..  ఆసమయంలో ఓ పోలీస్‌ ఉన్నతాధికారి సమక్షంలోనే పంచాయతీ జరిగిందన్న ఆరోపణలు వినిపించాయి. అయితే పోలీస్‌ శాఖ మాత్రం ఆ ఆరోపణలను ఖండిస్తోంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement