ఆరేళ్ల బాలికపై లైంగిక దాడి | Rape Attampt On Six Years Old Girl | Sakshi
Sakshi News home page

ఆరేళ్ల బాలికపై లైంగిక దాడి

Published Mon, Apr 16 2018 1:36 AM | Last Updated on Tue, Nov 6 2018 4:56 PM

Rape Attampt On Six Years Old Girl - Sakshi

భీమారం: వరంగల్‌ అర్బన్‌ జిల్లాలో ఆరేళ్ల బాలిక లైంగిక దాడికి గురైంది. స్థానిక అమరావతినగర్‌ కాలనీలో చోటు చేసుకున్న ఈ సంఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. పెద్దనాన్న కుమారులే బాలికపై అఘాయిత్యానికి ఒడిగట్టారు. విషయం ఎవరికైనా చెబితే చంపుతా మని బెదిరించారు. అమరావతినగర్‌కు చెంది న ఓ దంపతుల కూతురు(6) అదే ప్రాంతం లోని పాఠశాలలో ఒకటో తరగతి చదువుతోం ది. ఆ సమీపంలోనే బాలిక పెద్దనాన్న కుటుంబం నివాసముంటోంది.

ఈ క్రమంలో వరుసకు సోదరులైన ఇద్దరు ఆమెతో అసభ్యకరంగా ప్రవర్తించడంతోపాటు లైంగిక దాడికి పాల్పడ్డారు. వారం కిందట బాలిక అనారోగ్యానికి గురి కావడంతో తల్లిదండ్రులు ఆమెను భీమారంలోని ఓప్రైవేట్‌ ఆస్పత్రికి తీసుకొచ్చారు. ఈ విషయమై కూతురును అడగ్గా జరిగిన విషయాన్ని తెలిపినట్లు బాధితురాలి తల్లి పేర్కొంది. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో బాలికను వైద్య పరీక్షలకోసం ఆస్పత్రికి తరలించారు. నిందితులపై నిర్భయ చట్టంకింద కేసు నమోదు చేసినట్లు ఆదివారం హన్మకొండ ఏసీపీ రాజేంద్రపసాద్‌ తెలిపారు.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement