జైపూర్ : బాధితులకు న్యాయం చేయాల్సింది పోయి తిరిగి వారికే శిక్ష విధించిన సంఘటన రాజస్థాన్‌లో చోటుచేసుకుంది. రాజస్థాన్ చిత్తోర్‌ఘడ్‌కు చెందిన ఓ యువతికి అదే గ్రామానికి చెందిన యువకుడు మత్తు మందు ఇచ్చి ఆమెను అసభ్యకర రీతిలో వీడియో తీసాడు. అనంతరం ఆ వీడియోలను బయటపెడతానంటూ బెదిరించి ఆమెపై అత్యాచారం చేశాడు. ఈ సంఘటన గురించి బాధుతురాలు ఆమె తల్లిదండ్రులకు చెప్పడంతో వారు నిందితునిపై పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
కేసు వాపసు తీసుకోవాలని బాధితురాలిని పంచాయతీ పెద్దలు వత్తిడి చేశారు. ఆమె నిరాకరించడంతో బాధితురాలి కుటుంబాన్ని ఊరు నుంచి బహిష్కరించారు. బాధితురాలి కుటుంబంతో ఎవరూ మాట్లడవద్దని, వారికి ఎటువంటి సహాయం చేయవద్దని కనీసం తిండి గింజలు కూడా ఇవ్వద్దని ఆదేశించారు. అంతేకాక పంచాయతీ తీర్పును పాటించనందుకు గాను బాధితురాలి కుటుంబానికి 11 వేల రూపాయల జరిమాన విధించారు. పంచాయతీ జారీ చేసిన ‘దిక్తిత్’ గురించి పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితురాలి కుటుంబం తమకు రక్షణ కల్పించాల్సిందిగా విన్నవించుకుంది. ఈ విషయంలో బాధితులకు రక్షణ కల్పించి, గ్రామస్తుల మీద కేసు నమోదు చేయాల్సిందిగా ఎస్పీని ఆదేశించినట్లు రాజస్థాన్ మహిళా కమిషన్ అధ్యక్షురాలు సుమన్ శర్మ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment