లక్నో : తనకు న్యాయం చేయాలంటూ ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఓ రేప్ బాధితురాలు దేశ ప్రధాని నరేంద్రమోదీకి రక్తంతో లేఖ రాసింది. తనపై అత్యాచారం చేసిన నిందితులు రాజకీయ పలుకుబడితో కేసును వెనక్కుతీసుకోవాలని ఒత్తిడి తేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. పోలీసులు సైతం వారికే సహకరిస్తున్నారని ఆరోపించింది. నిందితులను కఠినంగా శిక్షించి తనకు తగు న్యాయం చేయాలని లేఖ ద్వారా పీఎం మోదీ, యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్‌ను వేడుకోంది. లేకుంటే ఆత్మహత్య చేసుకుంటానని వాపోయింది.
తీవ్ర చర్చనీయాంశమైన ఈ లేఖపై పోలీస్ అధికారులను వివరణ కోరగా.. గతేడాది మార్చి 24న తన కూతురిపై అత్యాచారం జరిపి బ్లాక్‌మెయిల్‌కు పాల్పడుతున్నారని బాధితురాలి తండ్రి ఫిర్యాదు మేరకు దివ్యాపాండే, అంకిత్ వర్మలపై కేసు నమోదు చేశామన్నారు. అలాగే మరో గుర్తు తెలియని వ్యకి నకిలీ ఫేస్‌బుక్ ఖాతాలో బాధితురాలి అశ్లీల చిత్రాలు పోస్ట్ చేసినట్లు గుర్తించి కేసు నమోదు చేశామని పేర్కొన్నారు. కేసు దర్యాప్తు జరుగుతుందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment