ప్రతీకాత్మక చిత్రం
గౌహతి : అసోంలోని ఓ పోలీసు స్టేషన్‌లో దారుణం చోటు చేసుకుంది. రక్షించాల్సిన రక్షక భటుడే ఓ మహిళపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. రామ్‌డియా పీఎస్‌లో విధులు నిర్వహిస్తున్న బినోద్ కుమార్ దాస్ ఈ కేసులో నిందితుడిగా ఉన్నాడు. దీంతో అతడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్టు పోలీస్ ఉన్నతాధికారులు వెల్లడించారు. బాధితురాలికి వైద్య పరీక్షలు నిర్వహించాల్సి ఉందన్నారు. దీనిపై లోతైన విచారణ చేపట్టినట్టు తెలిపారు.
ఈ ఘటనను అస్సాం మాజీ సీఎం తరుణ్ గగోయ్ తీవ్రంగా ఖండించారు. నిందితుడిగా ఉన్న పోలీసును కఠినంగా శిక్షించాలని కోరారు. పోలీసు నియామాకాలు జరిగేటప్పుడు అభ్యర్థులకు మానసిక పరీక్షలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. ప్రజలను కాపాడాల్సిన పోలీసులే ఇలాంటి చర్యలకు పాల్పడటం క్షమించరానిదని ఆయన వ్యాఖ్యానించారు.
Comments
Please login to add a commentAdd a comment