అస్సాంలో ప్రవేశానికి అల్‌కాయిదా యత్నాలు | uch as the introduction of Assam alkayida | Sakshi
Sakshi News home page

అస్సాంలో ప్రవేశానికి అల్‌కాయిదా యత్నాలు

Published Sun, Sep 21 2014 1:41 AM | Last Updated on Mon, Apr 8 2019 8:07 PM

uch as the introduction of Assam alkayida

ఉల్ఫాతో అవగాహన: సీఎం గొగోయ్

గువాహటి: ఈశాన్య రాష్ట్రం అస్సాంలో ప్రవేశించేందుకు అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ అల్‌కాయిదా తీవ్రంగా ప్రయత్నిస్తోందని ఆ రాష్ట్ర సీఎం తరుణ్ గొగోయ్ వెల్లడించారు. రాష్ట్రంలో స్థావరం ఏర్పాటుకు అల్‌కాయిదా ప్రయత్నాలు చేస్తోందని, నిషేధిత ఉగ్రవాద సంస్థ ఉల్ఫాతో ఓ రహస్య అవగాహనకు వచ్చిందని శనివారమిక్కడ విలేకర్లతో అన్నారు.   భారత్‌లో ఉగ్రవాద కార్యకలాపాలను విస్తృతం చేస్తామని కొద్దిరోజుల క్రితం అల్‌కాయిదా పేరిట ఒక వీడియో ఆన్‌లైన్‌లో ప్రత్యక్షమైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో  గొగోయ్ ప్రకటన ప్రాధాన్యం సంతరించుకుంది. అల్ కాయిదా ప్రయత్నాలను తిప్పికొట్టేందుకు అన్ని చర్యలు తీసుకున్నామన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement