International terrorist organization
-
హైదరాబాద్‌లో మోస్ట్ వాంటెడ్!
సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ ఐసిస్ టెర్రరిస్ట్ రిజ్వాన్ అలీ.. యువతను ‘ఉగ్ర’బాట పట్టించడంలో దిట్ట.. పరారీలో ఉన్న అతడిపై జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) రూ.3 లక్షల రివార్డు కూడా ప్రకటించింది. ఇన్నాళ్లూ తప్పించుకు తిరిగిన రిజ్వాన్‌ను.. గత శుక్రవారం ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు అక్కడి ఫరీదాబాద్ సరిహద్దుల్లో పట్టుకున్నారు. అతడిని ప్రశ్నించినప్పుడు బయటికొచి్చన రెండు అంశాలు కలకలం రేపుతున్నాయి.రిజ్వాన్ కొన్నాళ్లు హైదరాబాద్‌లో తలదాచుకున్నాడనేది ఒకటైతే.. సుదీర్ఘకాలం నుంచి పరారీలో ఉన్న గజ ఉగ్రవాది, హైదరాబాద్‌కే చెందిన ఫర్హాతుల్లా ఘోరీతో నిత్యం సంప్రదింపులు జరుపుతూ ఉన్నాడనేది రెండో అంశం. రాష్ట్ర నిఘా విభాగానికి చెంప పెట్టులాంటి ఈ రెండు అంశాలు తెలిసిన వెంటనే ఇక్కడి నుంచి ఓ ప్రత్యేక బృందం హుటాహుటిన ఢిల్లీ వెళ్లింది.6 నెలలు హైదరాబాద్‌లోనే..ఢిల్లీకి చెందిన రిజ్వాన్ అలీ డిగ్రీ పూర్తి చేసిన తర్వాత 2015–16లో ఆన్లైన్ ద్వారా ప్రేరణ పొంది ఐసిస్ బాటపట్టాడు. జార్ఖండ్ నుంచి వచ్చి ఢిల్లీలోని షహీన్‌బాగ్‌లో స్థిరపడిన షానవాజ్‌తో కలసి ఉగ్రవాద కార్యకలాపాలు ప్రారంభించాడు. ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, జార్ఖండ్, మహారాష్ట్రల్లో ఐసిస్ మాడ్యూల్ విస్తరణతోపాటు నిధుల సమీకరణకు పనిచేశాడు. చాలా మంది యువతను ఆన్లైన్ ద్వారా ఆకర్షించి ఉగ్రవాద బాటపట్టించాడు. 2023 జూన్‌లో పుణే అధికారులు షానవాజ్ నేతృత్వంలోని ఈ మాడ్యూల్ గుట్టురట్టు చేసి.. పలువురిని అరెస్టు చేశారు.దీంతో రిజ్వాన్ అజ్ఞాతంలోకి వెళ్లి ఉత్తరప్రదేశ్‌లోని సంభాల్ ప్రాంతంలో తలదాచుకున్నాడు. అతడిని మోస్ట్ వాంటెడ్‌గా గుర్తించిన ఎన్ఐఏ.. పట్టిస్తే రూ.3 లక్షల రివార్డు ఇస్తామని కూడా ప్రకటించింది. ఈ ఏడాది జనవరిలో రిజ్వాన్ కదలికలను గుర్తించిన ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు.. సంభాల్‌లోని ఓ స్థావరంపై దాడి చేశారు. కానీ తృటిలో తప్పించుకున్న రిజ్వాన్.. హైదరాబాద్‌కు మకాం మార్చాడు. మారుపేరుతో సికింద్రాబాద్ ప్రాంతంలో దాదాపు ఆరు నెలల పాటు నివసించాడు. తర్వాత కేరళ వెళ్లాడు. స్వాతంత్య్ర దిన వేడుకల నేపథ్యంలో విధ్వంసాలకు పథకం వేసి ఢిల్లీ వెళ్లాడు. ఈ క్రమంలోనే ఢిల్లీ–ఫరీదాబాద్ సరిహద్దుల్లో స్పెషల్ సెల్ పోలీసులకు దొరికిపోయాడు. వారు అతడి నుంచి తుపాకీ, తూటాలు స్వా«దీనం చేసుకున్నారు.విచారణలో బయటపడిన కీలక అంశాలురిజ్వాన్ను విచారించిన సమయంలో ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు కీలక అంశాలను గుర్తించారు. హైదరాబాద్‌లోని కూర్మగూడ ప్రాంతానికి చెందిన గజ ఉగ్రవాది ఫర్హాతుల్లా ఘోరీతో రిజ్వాన్ క్రమం తప్పకుండా సంప్రదింపులు జరిపినట్టు తేల్చారు. ఘోరీ తాజా ఫొటోను సైతం రిజ్వాన్ ఫోన్ నుంచి స్వాధీనం చేసుకున్నారు. పేలుడు పదార్థాల తయారీలో నిపుణుడైన రిజ్వాన్ దేశంలోని వివిధ నగరాలను టార్గెట్‌గా చేసుకున్నట్టు గుర్తించారు. ఫర్హాతుల్లా ఘోరీతో సంప్రదింపులు, హైదరాబాద్‌లో ఆరు నెలల పాటు ఉండటం నేపథ్యంలో.. ఘోరీ ద్వారానే ఇక్కడ ఆశ్రయం పొందినట్టు భావిస్తున్నారు. రిజ్వాన్‌ను విచారించేందుకు.. రిజ్వాన్‌ను విచారిస్తే హైదరాబాద్‌లో ఎవరి ద్వారా, ఎప్పుడు ఆశ్రయం పొందాడో, ఎవరెవరిని కలిశాడో తెలుస్తుందని.. ప్రస్తుతం ఘోరీ కోసం పనిచేస్తున్న వారిని గుర్తించేందుకు ఆస్కారం ఉంటుందని రాష్ట్ర పోలీసులు భావిస్తున్నారు. ఈ మేరకు రిజ్వాన్‌ను విచారించడంతోపాటు ఢిల్లీ స్పెషల్ సెల్ నుంచి సమాచారం తీసుకోవడం కోసం రాష్ట్రం నుంచి ఓ ప్రత్యేక బృందం ఢిల్లీ వెళ్లింది. ఇక ఈ కేసు దర్యాప్తులో భాగంగా ఢిల్లీ పోలీసులు త్వరలో హైదరాబాద్ రానున్నట్లు తెలిసింది.మరికొన్ని అరెస్టులు చోటు చేసుకునే అవకాశం ఉందని సమాచారం. ఆరు నెలల పాటు నగరంలో తలదాచుకున్న మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది కదలికలను రాష్ట్ర నిఘా విభాగాలు కనిపెట్టలేకపోవడం వైఫల్యంగానే ఉన్నతాధికారులు పరిగణిస్తున్నట్టు తెలిసింది. ఈ అంశంపై లోతుగా అంతర్గత సమీక్ష చేపట్టినట్టు సమాచారం. -
అనుమానిత ఉగ్రవాది బెంగళూరులో అరెస్టు
సాక్షి, బెంగళూరు: అంతర్జాతీయ ఉగ్ర సంస్థలతో సంబంధం ఉన్న ఓ వ్యక్తి బెంగళూరులో అరెస్టయ్యాడు. జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ), బెంగళూరు పోలీసులు కలిసి చేపట్టిన ఆపరేషన్‌లో ఉత్తరప్రదేశ్‌లోని అలీగఢ్‌కు చెందిన మహ్మద్ ఆరీఫ్ అనే వ్యక్తి పట్టుబడ్డాడు. శనివారం తెల్లవారుజామున 4 గంటల సమయంలో థణిసంద్రలోని ఓఇంట్లో ఉన్న ఇతడిని అరెస్ట్ చేశారు. ప్రైవేటు కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా పని చేస్తున్న అరీఫ్‌కు భార్య, ఇద్దరు పిల్లలున్నారు. రెండేళ్లుగా ఉగ్ర సంస్థ అల్‌ఖైదాతో టెలీగ్రాం, డార్క్‌నెట్ ద్వారా సంబంధాలు నెరుపుతున్నట్లు తెలిసింది. ఇతడి కదలికలపై ఎన్ఐఏ కొన్ని రోజులుగా నిఘా ఉంచింది. సిరియా వెళ్లే ప్రయత్నాల్లో ఉన్న ఆరీఫ్‌ను పట్టుకుని, ఒక లాప్టాప్, రెండు హార్డ్ డిస్కులను స్వాధీనం చేసుకుంది. ఈ నెల 13న బెంగళూరులోని ఇంటిని ఖాళీ చేసి యూపీకి వెళ్తున్నట్టు ఇతడు ఇంటి యజమానికి చెప్పాడని పోలీసులు వివరించారు. గత నవంబర్‌లో శివమొగ్గలో ఐఎస్ ప్రేరేపిత ఉగ్ర మాడ్యూల్‌ను పోలీసులు పట్టుకున్న విషయం తెలిసిందే. -
ఐసిస్ స్లీపర్ సెల్ యువకుడి అరెస్టు
సాక్షి,హైదరాబాద్: అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ ఐసిస్‌కు ఆన్లైన్ ద్వారా ఆకర్షితుడై, విదేశంలో ఉన్న హ్యాండ్లర్ ఆదేశాల మేరకు అమెరికా, ఇజ్రాయెల్ రాయబార కార్యాలయాలపై ఉగ్రదాడులకు సిద్ధమైన ఓ స్లీపర్ సెల్‌ను హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు శుక్రవారం పట్టుకుని రిమాండ్‌కు తరలించారు. సీసీఎస్ పోలీసుల కథనం ప్రకారం..సైదాబాద్ ప్రాంతానికి చెందిన మహ్మద్ బిన్ సులేమాన్ (19) తండ్రి చాలాకాలం యూఏఈలో ఉద్యోగం చేశారు. అక్కడే పుట్టిన సులేమాన్ కుటుంబంతో పాటు నగరానికి తిరిగి వచ్చి పహాడీషరీఫ్ ప్రాంతంలో స్థిరపడ్డారు. ఇతడు స్థానికంగా ఉన్న ఓ కళాశాలలో ఇంటర్మీడియెట్ వరకు చదివాడు. 2020లో ఇంటర్ చదువుతున్నప్పుడే ఆన్లైన్ క్లాసుల కోసం తల్లిదండ్రులిచ్చిన ఫోన్ ద్వారా సోషల్ మీడియా ఖాతాలకు అలవాటుపడి చదువును నిర్లక్ష్యం చేశాడు. ఈ క్రమంలోనే సోషల్ మీడియాలోని వచ్చిన వీడియోల ద్వారా ఉగ్రవాదం వైపు ఆకర్షితుడయ్యాడు. ఆన్లైన్లో ప్రసంగాలు విని.. ఆన్లైన్లో పరిచయమైన ఉజ్బెకిస్థాన్‌లో ఉన్న ఐసిస్ హ్యాండ్లర్ ఆదేశాల ప్రకారం తన ఫోన్లో ఇన్స్ట్రా గామ్, టెలిగ్రామ్ యాప్స్‌ను డౌన్లోడ్ చేసుకుని ఆ యాప్స్‌లోని గ్రూపుల్లో ఉన్న ఉగ్రవాద సంబంధిత వీడియోల ద్వారా ప్రసంగాలు, చర్చల్లో సైతం పాల్గొన్నాడు. హ్యాండ్లర్ సూచనల మేరకు ఉగ్రదా డులు చేయడానికి సిద్ధమై, అందుకు సంబంధించిన ఆదేశాలు వచ్చే వరకు స్లీపర్ సెల్ మాదిరిగా నగరంలోనే ఉంటున్నాడు. హ్యాండ్లర్ పంపిన లింకు వీడియోల ద్వారా బాంబుల తయారీ, ఉగ్రవాద దాడులు చేయడం వంటి అంశాల్లో శిక్షణ పొందాడు. దీంతోపాటుగా నగరానికి చెందిన మరికొందరు యువకులను కూడా ఉగ్రవాదం వైపు మళ్లించడానికి ప్రయత్నాలు చేశాడు. నిఘాపెట్టిన కేంద్ర వర్గాలు.. ఇతడి వ్యవహారాన్ని గుర్తించిన కేంద్ర నిఘా వర్గాలు కొన్నాళ్లుగా సాంకేతిక నిఘా ఉంచాయి. ఈ క్రమంలో హైదరాబాద్‌తో పాటు దేశంలోని ఏ ప్రాంతంలోనైనా, అమెరికా, ఇజ్రాయెల్ రా యబార కార్యాలయాలపై దాడులు చేస్తానంటూ ఇన్‌స్ట్రాగామ్, టెలిగ్రాం గ్రూపుల్లో పోస్టులు పెట్టా డు. దీనిపై హైదరాబాద్ సెంట్రల్ క్రైమ్ స్టేషన్ (సీసీఎస్) ఆధీనంలోని సైబర్ క్రైమ్ పోలీసులకు సమాచారం ఇచ్చాయి. ఇంటర్నెట్ ఐపీ అడ్రస్ ఆధారంగా సైబర్ క్రైమ్ పోలీసులు పహాడీషరీఫ్ లోని సులేమాన్ ఇంటిని కనిపెట్టి అతడిని అరెస్టు చేశారు. అతడిపై ఐటీ యాక్ట్‌తో పాటు ఐపీసీలో ని వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి జ్యూడీషి యల్ రిమాండ్‌కు తరలించారు. సమగ్ర దర్యాప్తు కోసం స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (సిట్)కు బదిలీ చేయనున్నట్లు సీసీఎస్ అధికారి వివరించారు. -
అల్ కాయిదా నంబర్ 2 హతం
వాషింగ్టన్: అంతర్జాతీయ ఉగ్ర సంస్థ అల్‌కాయిదాను అమెరికా, ఇజ్రాయెల్ కలిసి చావుదెబ్బ కొట్టాయి. అల్‌కాయిదాలో నంబర్–2గా చెలామణి అవుతున్న అబూ మొహమ్మద్ అల్–మాస్రీని ఈ ఏడాది ఆగస్టులో హతమార్చాయి. రహస్యంగా జరిగిన ఈ జాయింట్ ఆపరేషన్ వివరాలను తాజాగా నలుగురు అమెరికా అధికారులు వెల్లడించారు. ఇరాన్ రాజధాని టెహ్రాన్‌లో దాక్కున్న అల్–మాస్రీ జాడను తొలుత అమెరికా కనిపెట్టింది. ఈ సమాచారాన్ని ఇజ్రాయెల్‌కు చేరవేసింది. దీంతో ఇజ్రాయెల్ నిఘా సంస్థకు చెందిన కిడోన్ దళం రంగంలోకి దిగింది. టెహ్రాన్‌లో నక్కిన అల్ మాస్రీని విజయవంతంగా మట్టుబెట్టింది. ఆగస్టు 7న పూర్తయిన ఈ ఆపరేషన్‌లో మాస్రీ కూతురు మరియం కూడా చనిపోయింది. మరియం మరెవరో కాదు బిన్ లాడెన్ కుమారుడు హమ్జా బిన్‌లాడెన్ భార్యే. హమ్జాను అమెరికా దళాలు పాక్–అఫ్గానిస్తాన్ సరిహద్దుల్లో ఉండగా గత ఏడాది హతమార్చాయి. 1998లో కెన్యా, టాంజానియాలోని అమెరికా రాయబార కార్యాలయాలపై జరిగిన బాంబు దాడుల్లో అల్–మాస్రీ కీలకపాత్ర పోషించాడు. అప్పటినుంచి అమెరికా నిఘా సంస్థ ఎఫ్‌బీఐ అతడిని మోస్ట్‌వాంటెడ్ జాబితాలో చేర్చింది. ఇప్పటికే అల్‌కాయిదా చీఫ్ అల్ జవహరీ జాడ గత కొన్ని నెలలుగా తెలియడం లేదు. -
‘జునూద్’ మాడ్యుల్లో మరో అరెస్టు
పశ్చిమ బెంగాల్లో పట్టుబడిన ఆషిఖ్ అహ్మద్ సిటీలో చిక్కిన నఫీజ్ ఖాన్‌కు అనుచరుడు తృణమూల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే హత్యకు కుట్ర సిటీబ్యూరో: అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ ఐసిస్‌కు అనుబంధంగా ఏర్పడి, దేశ వ్యాప్తంగా విధ్వంసాలకు కుట్రపన్నిన ‘జునూద్ అల్ ఖలీఫా ఏ హింద్’ మాడ్యుల్‌కు చెందిన మరో ఉగ్రవాది చిక్కాడు. పశ్చిమ బెంగాల్‌కు చెంది డిప్లమో విద్యార్థి ఆషిఖ్ అహ్మద్‌ను జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) అధికారులు గురువారం అరెస్టు చేశారు. హైదరాబాద్‌లో పట్టుబడిన ‘జునూద్’ ఫైనాన్స్ చీఫ్ మహ్మద్ నఫీజ్ ఖాన్‌కు ఇతడు ప్రధాన అనుచరుడని అధికారులు చెప్తున్నారు. ఈ ఏడాది జనవరి 22-23 తేదీల్లో దేశంలోని ఐదు రాష్ట్రాల్లో వరుస దాడులు చేసిన ఎన్ఐఏ బృందాలు 12 మందిని, ఆపై మరో ఇద్దరిని అరెస్టు చేశాయి. వీరిలో నఫీజ్ ఖాన్‌తో పాటు ఒబేదుల్లా ఖాన్, మహ్మద్ షరీఫ్ మొహియుద్దీన్, అబు అన్స్ సిటీలోనే చిక్కారు. నఫీజ్ ఖాన్ ఈ మాడ్యుల్‌కు ఫైనాన్స్ చీఫ్‌గా ఉన్నాడు. ‘జునూద్ఋ’లోకి రిక్రూట్మెంట్, ఆయుధాలు, పేలుడు పదార్థాల శిక్షణ కోసం షఫీ ఆర్మర్ నుంచి ముంబైకి చెందిన ‘జునూద్’ మాడ్యుల్ చీఫ్ ముదబ్బీర్‌కు రూ.8 లక్షల హవాలా రూపంలో అందాయి. వీటి నుంచి రూ.2 లక్షల్ని హైదరాబాద్‌లో ఉన్న నఫీజ్‌కు పంపాడు. పేలుళ్ల ద్వారా విధ్వంసాలు సృష్టించడంతో పాటు టార్గెట్ చేసుకున్న ప్రముఖుల్నీ కాల్చి చంపడం ద్వారా టై క్రియేట్ చేయడానికి ‘జునూద్’ మాడ్యుల్ సిద్ధమైంది. దీని కోసం తుపాకులు, తూటాలను పశ్చిమ బెంగాల్లో ఖరీదు చేయాలని భావించింది. ఈ బాధ్యతల్ని స్వీకరించిన నఫీస్‌ఖాన్ పలుమార్లు పశ్చిమ బెంగాల్‌కు వెళ్లి వచ్చాడు. ఈ క్రవుంలో పశ్చిమ బెంగాల్‌లోని హూగ్లీ జిల్లా మజీర్‌పుర ప్రాంతానికి చెందిన ఆషిఖ్ అహ్మద్ ఇతనికి ఫేస్బుక్ ద్వారా పరిచయమయ్యాడు. నఫీజ్ ఖాన్ పలుమార్లు దుర్గాపూర్ వెళ్లి ఆషిఖ్‌ను కలిశాడు. జునూద్ అల్ ఖలీఫా ఏ హింద్ బెంగాల్ యూనిట్‌కు నేతృత్వం వహించాల్సిందిగా సూచించాడు. మరికొందరు ఉగ్రవాదులతో కలిసి ఆ ప్రాంతంలో జరిగిన ఓ సమావేశంలోనూ నఫీజ్, ఆషిఖ్ పాల్గొన్నారు. ‘జునూద్’ మాడ్యుల్‌కు అవసరమైన ఆయుధాలు సమకూర్చడం, కొందరు యువతను ఉగ్రవాదం వైపు మళ్లించేందుకు అంగీకరించాడు. ఈ మాడ్యుల్ టార్గెట్ చేసిన వారిలో పశ్చిమ బెంగాల్‌కు చెందిన తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే సైతం ఉన్నారని, దానికి సంబంధించిన రెక్కీ బాధ్యతల్ని ఆషిఖ్ చేపట్టాడని అధికారులు చెప్తున్నారు. ఇదిలాఉండగా న ఫీజ్ఖాన్ విచారణ చేసిన సవుయుంలో ఆషిఖ్ వివరాలను సేకరించారు. ఫిబ్రవరి 26న అదుపులోని తీసుకుని ప్రశ్నించి విడిచి పెట్టారు ఎన్ఐఏ అధికారులు విడిచిపెట్టారు. ఆ తర్వాత అతని తండ్రిని, అతనిని పలువూర్లు విచారించారు. ఆషిఖ్ ‘జునూద్’కు సహకరించడంతో పాటు పశ్చిమ బెంగాల్‌కు చెందిన మరో ఐదుగురిని ఆ మాడ్యుల్లో చేర్చడానికి ప్రయత్నించినట్లు ఆధారాలు లభించాయి. దీంతో గురువారం నిందితుడిని అరెస్టు చేసిన ఎన్ఐఏ అధికారులు ఢిల్లీ తరలించి అక్కడి పటియాల హౌస్‌లో ఉన్న ఎన్ఐఏ స్పెషల్ కోర్టులో హాజరుపరిచారు. తదుపరి విచారణ నిమిత్తం కస్టడీకి కోరడంతో న్యాయస్థానం ఐదు రోజులకు అప్పగించింది. -
నెట్ వేసి ఉచ్చులోకి!
సోషల్‌మీడియా కేంద్రంగా ఐఎస్ రిక్రూట్మెంట్ సిరియా నుంచి కథ నడుపుతున్న షఫీ ఆర్మర్ ‘ఓపెన్’తో ప్రారంభించి, ‘యాప్స్’ వరకు హ్యాకర్ల ద్వారా సైబర్ వార్‌కు కుట్రపన్నిన వైనం అగ్రరాజ్యంగా భావించే అమెరికాను సైతం గడగడలాడిస్తున్న అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్) సోషల్‌మీడియా కేంద్రంగా రిక్రూట్మెంట్స్ చేసుకుంటోంది. ఉద్రేక భావాలున్న యువతకు వల వేసి... ఉచ్చులోకి లాగుతోంది. గత ఏడాది వరకు దేశంతో పాటు నగరంలో ఉన్న యువతను ఆకర్షిస్తూ సిరియా దారి పట్టించింది. గత నెలలో దేశ వ్యాప్తంగా గుట్టురట్టైన ‘జునూద్ అల్ ఖలీఫా ఎ హింద్’ మాడ్యుల్‌తో ‘స్థానికంగా’ ఉన్న నగరాలతో పాటు ప్రముఖులు, విదేశీయుల్నీ టార్గెట్ చేసినట్లు స్పష్టమైంది. ఈ ఆపరేషన్ల కోసమే ‘జునూద్’ను ఏర్పాటు చేసుకుని విస్తరిస్తున్నట్లూ స్పష్టమైంది. దేశంలోని 12 నగరాల్లో అరెస్ట్ అయిన 16 మంది ఉగ్రవాదుల్లో హైదరాబాద్‌కు చెందిన నలుగురు ఉన్నారు. ఈ నేపథ్యంలో ‘ఐఎస్’ రిక్రూట్మెంట్ మొదలు ఇం‘టై’నెట్ వరకు కార్యకలాపాలపై ‘సాక్షి’ ఫోకస్... సిటీబ్యూరో: కర్ణాకటలోని ఉత్తర కన్నడ జిల్లా భత్కల్ ప్రాంతానికి చెందిన మహ్మద్ షఫీ ఆర్మర్ భారత్‌లో ఐఎస్ కార్యకలాపాలకు ఇన్చార్జ్గా ఉన్నాడు. కొన్నేళ్ల క్రితం తన అన్న సుల్తాన్ ఆర్మర్‌తో కలిసి దేశం దాటేశాడు. ఐఎస్‌కు అనుబంధంగా ‘అన్సార్ ఉల్ తౌహిద్’ పేరుతో ఐఎస్‌కు అనుబంధంగా ఓ సంస్థను ఏర్పాటు చేశాడు. సిరియాలో అమెరికా సేనలు చేసిన దాడుల్లో సుల్తాన్ చనిపోగా... షఫీ మాత్రం భారత్ టార్గెట్‌గా ఐఎస్‌ను విస్తరించే పనిలో పడ్డాడు. దీనికోసమే స్థానికంగా ఉన్న వారిని ఆకర్షిస్తూ విధ్వంసాలు సృష్టించడానికి ‘జునూద్’ సంస్థను ఏర్పాటు చేయించాడు. ఐఎస్ నుంచి వచ్చిన నిధులతో పాటు వివిధ మార్గాల్లో నగదు సమీకరిస్తూ భారత్‌లో ఉగ్రవాద కార్యకలాపాలు నిర్వహించడానికి హవాలా తదితర మార్గాల్లో ఇక్కడ ఎంపిక చేసుకున్న వాళ్లకు పంపిస్తున్నాడు. వివిధ రకాలైన పేర్లతో ఇంటర్నెట్ కేంద్రంగా యువతను ఆకర్షిస్తున్న షఫీ వయస్సు ప్రస్తుతం 27 ఏళ్లే అని నిఘా వర్గాలు చెప్తున్నాయి. కొంతకాలం ఆఫ్ఘనిస్థాన్ కేంద్రంగా అల్ కాయిదాతో సంబంధాలు ఏర్పాటు చేసుకున్న షఫీ... 2014 జూన్ నుంచి సిరియాలో మకాం పెట్టి కార్యకలాపాలను సాగిస్తున్నాడని స్పష్టం చేస్తున్నాయి. ఫోరమ్... పేజ్... యాప్స్... షఫీ ఆర్మర్ తనకు ‘అనువైన వారిని’ గుర్తించడానికి పక్కా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నట్లు నిఘా వర్గాలు గుర్తించాయి. అనేక పేర్లతో వందల సంఖ్యలో అకౌంట్లు నిర్వహిస్తున్న షఫీ ప్రాథమికంగా ఫేస్బుక్, ట్విటర్ వంటి మాధ్యమాల్లోని ‘ఓపెన్ ఫోరమ్స్’లో ఓ వర్గానికి అనుకూలంగా, మరో వర్గానికి/దేశాలకు వ్యతిరేకంగా వ్యాఖ్యల్ని పోస్ట్ చేస్తాడు. వీటికి ఆకర్షితులైన అనేక మంది స్పందిస్తుంటారు. ఈ స్పందనల్ని క్షుణ్ణంగా పరిశీలించే షఫీ... ఉద్రేకపూరిత, విపరీతమైన వ్యాఖ్యలు చేసిన వారిని ఎంపిక చేసుకుంటాడు. వారిని వ్యక్తిగతమైన ‘పేజ్’ల్లోకి ఆహ్వానిస్తూ భావజాల వ్యాప్తిని కొనసాగిస్తాడు. పూర్తిగా వలలో పడిన వారిని ఎంపిక చేసుకుని... వివిధ రకాలైన ‘వాట్సాప్’, ‘హైక్’, ‘సిగ్నల్’, ‘ట్రిలియన్’, ‘స్కైప్’ సహా వివిధ రకాలైన యాప్స్ ద్వారా సంప్రదింపులు జరుపుతూ పూర్తిగా ఉచ్చులోకి లాగేస్తాడు. ఇలా ఆకర్షించడం ద్వారా దేశం దాటి సిరియా వచ్చేలా చేయడమో, దేశంలోనే విధ్వంసాలు సృష్టించేలా ప్రేరేపించడమో చేస్తుంటాడు. పక్కాగా టాలెంట్ స్కౌటింగ్ టీమ్... సోషల్ మీడియా ద్వారా ఆకర్షణ, రిక్రూట్మెంట్, సంప్రదింపులు జరపడానికి షఫీ ఆర్మర్ సిరియా కేంద్రంగా ‘టాలెంట్ స్కౌంటింగ్ టీమ్’ పేరుతో ఓ బృందాన్ని ఏర్పాటు చేసినట్లు వెల్లడైంది. దీనికోసం సాంకేతిక పరిజ్ఞానంలో పట్టున్న వారిని ఎంపిక చేసుకోవడంతో పాటు కొంత శిక్షణ సైతం ఇప్పించాడని నిందితులు వెల్లడించారు. సోషల్ మీడియాల్లో ఐఎస్‌కు సంబంధించిన వాటితో పాటు పలు రకాలైన ఉద్రేకపూరితమైన పోస్టులు పెట్టడం నుంచి ‘లైక్స్’, ‘కామెంట్స్’ను విశ్లేషించడం, ‘అనువైన వారిని’ గుర్తించడం వరకు ఈ బృందాలే పని చేస్తాయని చెప్తున్నారు. ఆ తర్వాత మాత్రమే నేరుగా రంగంలోకి దిగే ఆర్మర్... మారు పేర్లతో ‘యాప్స్’ ద్వారా సంప్రదింపులు జరుపుతాడని నిఘా వర్గాలు గుర్తించాయి. ఇంటర్నెట్ అనేది సెల్ఫోన్లలోకి అందుబాటులోకి వచ్చాక ‘ఆన్లైన్ టై’ పెరిగిందని నిఘా వర్గాలు చెప్తున్నాయి. దీనికితోడు రిక్రూట్మెంట్స్ కోసం షఫీ ఆర్మర్ కొందరు ఏజెంట్లను ఏర్పాటు చేసుకున్నాడు. గత ఏడాది దుబాయ్ నుంచి డిపోర్టేషన్‌పై తీసుకువచ్చిన నగర యువతి ఆఫ్తా జబీన్ అలియాస్ నిక్కీ జోసఫ్ సిటీకే చెందిన సల్మాన్ మెయినుద్దీన్‌ను ఫేస్బుక్ ద్వారా ఆకర్షించి సిరియా వెళ్లేలా ప్రేరేపించింది. ఇతడిని 2014లో శంషాబాద్ విమానాశ్రయంలో అరెస్టు చేశారు. ఈ కేసులోనే నిక్కీని డిపోర్టేషన్‌పై తీసుకువచ్చారు. ఈమె నిఘా వర్గాల విచారణలో ఓ వ్యక్తిని ఐఎస్‌కు రిక్రూట్ చేస్తే తనకు ‘హ్యాండ్లర్’ నుంచి రూ.50 వేల వరకు అందేవని వెల్లడించింది. హ్యాకర్లకు భారీగా ఎర.. విధ్వంసాలకు కుట్ర చేయడం ద్వారా ప్రత్యక్ష ‘యుద్ధాన్ని’ ప్రకటించిన షఫీ ఆర్మర్... మరోపక్క సైబర్ వార్‌కూ పథకం వేశాడు. దేశంలోని వివిధ ప్రభుత్వ విభాగాలకు చెందిన, రక్షణ శాఖ వెబ్సైట్లకు హ్యాకింగ్ చేయించాలని ఆర్మర్ కుట్రపన్నిట్లు పట్టుబడిన నిందితులు వెల్లడించాడు. దీనికోసం సోషల్‌మీడియా ద్వారానే కొందరు హ్యాకర్లను ఆకర్షించడానికి ప్రయత్నాలు చేసినట్లూ బయటపెట్టారు. ఈ హ్యాకర్లకు నెలకు పదివేల డాలర్లు చెల్లించడానికీ షఫీ సిద్ధమైనట్లు నిందితుడు స్పష్టం చేశారు. అయితే ఈ కుట్ర అమలులోకి రాకముందే ‘జునూద్’ మాడ్యుల్ అరెస్టు కావడంతో బ్రేక్ పడిందని, అయితే దీన్ని కేవలం తాత్కాలిక విరామంగానే పరిగణించాలని నిఘా వర్గాలు చెప్తున్నాయి. షఫీ ప్రభుత్వ విభాగాలకు చెందిన వెబ్సైట్లపై కన్నేశాడంటే... వాటిలోకి సున్నిత సమాచారం తస్కరించడంతో పాటు బ్లాక్ చేయడానికి హ్యాకర్ల ద్వారా ప్రయత్నించే ప్రమాదం ఉందని స్పష్టం చేస్తున్నాయి. భావజాల ‘ప్రచారానికి’ పెద్దపీట... షఫీ ఆర్మర్ తన భావజాల వ్యాప్తి కోసం ప్రచారానికీ పెద్ద పీట వేస్తున్నాడని నిఘా వర్గాలు చెప్తున్నాయి. దీనికోసం ఇంటర్నెట్, సోషల్ మీడియాలతో పాటు ‘దాబిఖ్’ను విస్తృతంగా వాడుతున్నట్లు స్పష్టం చేస్తున్నాయి. ఒసామా బిన్ లాడెన్ నేతృత్వంలో ఏర్పాటైన అల్ కాయిదా సంస్థ ‘ఇన్స్పైర్’ పేరుతో ఓ పత్రికను నిర్వహించేది. దీన్నే స్ఫూర్తిగా తీసుకున్న ఐఎస్ సైతం ‘దాబిఖ్’ పేరుతో ఈ-మ్యాగ్జిన్‌ను నిర్వహిస్తోంది. ఇటీవలే 13వ ఎడిషన్ విడుదలైంది. దీన్ని సైతం షఫీ ఆర్మర్ దేశంలోని అనుచరగణానికి పంపుతున్నట్లు అధికారులు చెప్తున్నారు. పట్టుబడిన నిందితుల ఈ-మెయిల్స్ తదితరాలను తనిఖీ చేసినప్పుడు ఈ విషయం వెలుగులోకి వచ్చిందని వివరిస్తున్నారు. పేర్లు మార్చి... ఏమార్చి... భారత్‌ను టార్గెట్‌గా చేసుకుని సుదీర్ఘకాలంగా కార్యకలాపాలు సాగిస్తున్న షఫీ ఆర్మర్... ఏ సందర్భంలోనూ తన ‘నిజ స్వరూపాన్ని’ బయపెట్టాలేదు. ఒక్కో మాడ్యుల్‌ను సంప్రదించేప్పుడు ఒక్కో పేరు వాడినట్లు అధికారులు చెప్తున్నారు. దేశ వ్యాప్తంగా జరిగిన విధ్వంసాలకు సంబంధించి ఉగ్రవాద సంస్థ ఇండియన్ ముజాహిదీన్‌పై జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) దాఖలు చేసిన చార్జ్‌షీట్‌లో షఫీ ఆర్మర్ పేరు ఉంది. ఇతడిపై ఇంటర్‌పోల్ రెడ్‌కార్నర్ నోటీసు సైతం జారీ చేసింది.2013లో రాజస్థాన్‌కు చెందిన వ్యక్తుల్ని ఐఎస్ వైపు నడిపించడానికి మహ్మద్ అట్టా పేరుతో సంప్రదింపులు జరిపాడు. 2014లో హైదరాబాద్‌కు చెందిన బాసిత్, మాజ్ హుస్సేన్‌లతో పాటు మరో ఇద్దరినీ ఐఎస్ వైపు ఆకర్షించడానికి సమీర్ ఖాన్‌గా మారాడు. 2015లో మధ్యప్రదేశ్‌లోని రత్లంలో ఏర్పాటు చేసుకున్న మాడ్యుల్‌కు యూసుఫ్‌గా పరిచయమయ్యాడు.ఈసారి ‘జునూద్’ మాడ్యుల్లోని సభ్యులతో యూసుఫ్ అల్ హింద్‌గా కథ నడిపాడు. ఒక్కో ప్రాంతంలో ఒక్కొక్కరు చీఫ్... ఒకే సమయంలో దేశ వ్యాప్తంగా పలు నగరాల్లో నెట్వర్క్ ఏర్పాటు చేసుకుంటున్న షఫీ ఆర్మర్ ‘తన దారి’లోకి వచ్చిన వారిలో ‘ఉత్తముల్ని’ ఎంపిక చేసుకుంటున్నాడు. నగరాలు, ప్రాంతాల వారిగా ఇలా అమీర్లను ఏర్పాటు చేసి... ఆ ప్రాంతంలో ఉన్న ఇతర అనుచరుల్ని సోషల్‌మీడియా ద్వారానే అతడికి పరిచయం చేస్తాడు. వీరికి నేతృత్వం వహించే బాధ్యతల్ని అప్పగించడంతో పాటు అవసరమైన ‘వనరులు’, ‘ఇతర సహకారాలు’ సైతం కల్పిస్తాడు. ‘జునూద్’ మాడ్యుల్‌కు ముంబైకి చెందిన ముదబ్బీర్ను చీఫ్‌గా చేసిన షఫీ... హైదరాబాద్‌కు చెందిన నఫీస్ఖాన్ను ఫైనాన్స్ చీఫ్‌గా చేయడంతో పాటు మిగిలిన ముగ్గురైన ఒబేదుల్లా ఖాన్, షరీఫ్ మెయినుద్దీన్, అబు అన్స్లకు నేతృత్వం వహించే బాధ్యతల్ని అప్పగించాడు. ‘చీఫ్’లుగా ఉన్న అందరితోనూ నిత్యం సోషల్‌మీడియా ద్వారా సంప్రదింపులు జరుగుతూ రెక్కీలు, టార్గెట్ల ఎంపిక, విధ్వంసాలకు అవసరమైన పేలుడు పదార్థాల సమీకరణ, ఐఈడీ బాంబుల తయారీ తదితర అంశాలను నేరుగా పర్యవేక్షించే వాడు. 1. సల్మాన్ మొహియుద్దీన్ (బజార్‌ఘాట్) నిక్కీ జోసెఫ్ అనుచరుడు 2. సయ్యద్ ఒమర్ ఫారూఖ్ హుస్సేనీ (చాంద్రాయణగుట్ట) 3. మాజ్ హసన్ ఫారూఖ్ (హుమాయున్‌నగర్) 4. అబ్దుల్లా బాసిత్ (చాంద్రాయణగుట్ట) ఈ ముగ్గురూ కాశ్మీర్ వెళ్లే ప్రయత్నాల్లో నాగ్‌పూర్‌లో చిక్కారు. 7. మహ్మద్ నఫీజ్ ఖాన్ (అమీన్కాలనీ, షేక్‌పేట్) 8. మహ్మద్ షరీఫ్ మెయినుద్దీన్ ఖాన్ (రాఘవకాలనీ, టోలిచౌకి) 9. అబు అన్స్ (మాదాపూర్‌లో స్థిరపడిన రాజస్థాన్ వాసి) 10. మహ్మద్ ఒబేదుల్లా ఖాన్ (మొతిదర్వాజ, గోల్కొండ) హైదరాబాద్‌లో చిక్కిన ‘జునూద్’ మాడ్యుల్ సభ్యులు 11. ముదబ్బీర్ ముస్తాఖ్ ( ముంబైలో అరెస్టు అయిన ‘జునూద్’ సంస్థ చీఫ్) -
సహరన్‌పూర్‌లో తొలి ‘ఉగ్ర’ సమావేశం!
‘జునూద్’ ఏర్పడ్డాక ఇదే మొదటి మీటింగ్ గతేడాది జనవరిలో నిర్వహించిన ముదబ్బీర్ హైదరాబాద్ నుంచి వెళ్లి పాల్గొన్న నఫీస్ ఖాన్ సమాచార మార్పిడికి రెండు యాప్స్ వినియోగం సిటీబ్యూరో: అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ ఐసిస్‌కు అనుబంధంగా ఏర్పడిన ‘జునూద్ అల్ ఖలీఫా ఏ హింద్’ తొలి సమావేశం ఉత్తరప్రదేశ్‌లోని సహరన్‌పూర్‌లో జరిగినట్లు వెలుగులోకి వచ్చింది. ఈ మాడ్యుల్‌కు సంబంధించి హైదరాబాద్‌లో అరెస్టయిన నలుగురినీ జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) ఢిల్లీ యూనిట్ కస్టడీలోకి తీసుకుని ప్రశ్నించింది. ఈ నేపథ్యంలోనే ఆసక్తికర అంశాలు వెలుగులోకి వచ్చాయి. సిటీలో చిక్కిన నలుగురిలో నఫీస్ ఖాన్ అత్యంత కీలకమైన ఉగ్రవాదిగా అధికారులు నిర్థారించారు. సిరియా కేంద్రంగా అన్సార్ ఉల్ తౌహిద్ సంస్థను ఏర్పాటు చేసి, ఐసిస్ వ్యవహారాలు పర్యవేక్షిస్తున్న షఫీ ఆర్మర్ అలియాస్ యూసుఫ్ హింద్ (కర్ణాటకలోని భత్కల్ వాసి) ఆదేశాలతోనే ఈ మాడ్యుల్ పని చేస్తున్నట్లు ఆధారాలు సేకరించారు. ఫేస్బుక్ ద్వారా ఇతడికి పరిచయమైన ముంబై వాసి ముదబ్బిర్ ముస్తాఖ్ షేక్, ఉత్తరప్రదేశ్‌కు చెందిన రిజ్వాన్ అలియాస్ ఖాలిద్‌లకు ‘జునూద్’ విస్తరణ బాధ్యతల్ని అప్పగించాడు. సహరన్‌పూర్‌లో మీటింగ్... ఈ మాడ్యుల్‌కు చీఫ్‌గా వ్యవహరించిన ముదబ్బీర్ ఆన్లైన్ ద్వారానే ‘జునూద్’ను విస్తరించాడు. ఇందులో భాగంగానే హైదరాబాద్‌కు చెందిన నఫీస్ ఖాన్‌తో 2014లో పరిచయం ఏర్పడింది. అబు జరార్ పేరుతో మాడ్యుల్లో చేరి, చాకచక్యంగా వ్యవహరిస్తున్న నఫీజ్ ఖాన్‌ను ఈ మాడ్యుల్ ఆర్థిక లావాదేవీలు పర్యవేక్షించే ఫైనాన్స్ చీఫ్‌గా ముదబ్బీర్ నియమించాడు. మాడ్యుల్‌ను దేశవ్యాప్తంగా విస్తరించాలనే ఉద్దేశంతో ముదబ్బీర్ గతేడాది జనవరిలో యూపీలోని సహరన్‌పూర్‌లో తొలి సమావేశం ఏర్పాటు చేశాడు. అప్పట్లో అక్కడ మత ఘర్షణలు జరిగిన నేపథ్యంలో ఆ ప్రాంతాన్ని మీటింగ్ కోసం ఎంచుకున్నారు. ఇందులో పాల్గొన్న ఐదుగురిలో నఫీస్ ఖాన్ అలియాస్ అబు జరార్ కూడా ఉన్నాడు. వాస్తవానికి ఈ సమావేశంలోనే మాడ్యుల్లోని ప్రతి ఒక్కరికీ ప్రాంతాల వారీగా ‘ఉగ్రబాధ్యతలు’ అప్పగించాలని భావించారు. అయితే షఫీ ఆర్మర్ ఆదేశాల మేరకు ఆ ప్రక్రియను వాయిదా వేసుకున్నారు. ఈ సమావేశం నుంచి తిరిగి వచ్చిన తర్వాతే నఫీస్ నగరానికి చెందిన ఒబేదుల్లా ఖాన్, మహ్మద్ షరీఫ్ మొహియుద్దీన్, అబు అన్స్‌లను ఉగ్రవాదబాట పట్టించాడు. ఈ మాడ్యుల్ సహరన్‌పూర్‌తో పాటు హైదరాబాద్, లక్నో, టమ్కూర్‌లో పలుమార్లు సమావేశమైందని, క్యాడర్‌కు ఆయుధాల వినియోగం, పేలుడు పదార్థాల తయారీకి సంబంధించి బెంగళూరు, టమ్కూరు, లక్నోల్లోని అటవీ ప్రాంతాల్లో శిక్షణ శిబిరాలు ఏర్పాటు చేసేందుకు కుట్రపన్నిందని ఎన్ఐఏ గుర్తించింది. నిఘాకు దొరకని యాప్స్‌తో... ముష్కరమూకల వినియోగం పెరిగిన నేపథ్యంలో నిఘా వర్గాలు ఫేస్బుక్, వాట్సాప్ తదితర సోషల్‌మీడియాలపై కన్నేసి ఉంచుతున్నాయి. దీన్ని పసిగట్టిన ‘జునూద్’ మాడ్యుల్ సమాచార మార్పిడికి కొత్త యాప్స్‌ను వినియోగించింది. అంతగా ప్రాచుర్యంలోకి రాని ఆడ్రాయిడ్ యాప్స్ ‘ట్రిలియన్’, ‘సురిస్పోట్’లను తమ సెల్ఫోన్లలోకి డౌన్లోడ్ చేసుకుని వ్యవహారాలు కొనసాగించామని ఎన్ఐఏ అధికారులకు ఉగ్రవాదులు వెల్లడించారు. ‘జునూద్’ కార్యకలాపాలను విస్తరించే ప్రయత్నాల్లో ఉన్న ముదబ్బీర్ ముంబైతో పాటు ఢిల్లీ, గుజరాత్, బీహార్, పశ్చిమ బెంగాల్, అలహాబాద్, ఉత్తరాఖండ్, ఆజామ్ఘర్ ప్రాంతాల్లో మీడియా వింగ్స్ ఏర్పాటుకు నిర్ణయించారు. దీనికోసం ఆయా ప్రాంతాల్లో విద్యాధికుల్ని, సాంకేతిక పరిజ్ఞానం ఉన్న వారిని ఎంచుకునే పనిలో ఉండగానే ఈ మాడ్యుల్ గుట్టురట్టయింది. -
‘ఆన్లైనే’ ఆధారం!
♦ కీలక ఆధారాలుగా మారిన సోషల్‌మీడియా అకౌంట్స్ ♦ ‘ఏయూటీ’ మాడ్యుల్‌ను తొలుత గుర్తించిన అమెరికా సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్(ఐసిస్) ఏ ఆన్‌లైన్‌ను వినియోగించుకుని విస్తరిస్తోందో.. దానికి అనుబంధంగా ఏర్పడిన జునూద్-అల్-ఖలీఫా-ఏ-హింద్ గుట్టు ఆ ఆన్లైన్ ద్వారానే వెలుగులోకి వచ్చింది. భారత్‌లో విస్తరిస్తున్న ఈ నెట్‌వర్క్‌ను తొలుత అమెరికా నిఘా సంస్థ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ(సీఐఏ) గుర్తించింది. అక్కడ నుంచి వచ్చిన అధికారిక సమాచారంతో రంగంలోకి దిగిన జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ).. ఏయూటీ మాడ్యుల్ గుట్టురట్టు చేయడమేకాక ఇప్పటి వరకు 12 మందిని అరెస్టు చేసింది. శుక్ర-శనివారాల్లో హైదరాబాద్‌లో పట్టుబడిన మహ్మద్ నఫీస్ ఖాన్, మహ్మద్ షరీఫ్ మొయినుద్దీన్ ఖాన్, మహ్మద్ ఒబేదుల్లా ఖాన్, అబు అన్స్ ఈ మాడ్యుల్‌కు చెందినవారే. ప్రత్యేక నిఘా పారిస్ ఉగ్రదాడుల నేపథ్యంలో సీఐఏ సాంకేతిక నిఘాను పెంచి, కొన్ని ప్రత్యేక చర్యలు తీసుకుంది. సిరియా, ఇరాక్‌లో ఐసిస్ ఉగ్రవాదులు, అనుమానితుల కంప్యూటర్లు, స్మార్ట్ఫోన్లకు చెందిన ఐపీ అడ్రస్‌లు సేకరించింది. కర్ణాటకలోని భత్కల్ నుంచి వెళ్లి ప్రస్తుతం యూసుఫ్ పేరుతో సిరియా కేంద్రంగా ఐసిస్‌కు అనుబంధంగా పని చేస్తున్న షఫీ ఆర్మర్.. అన్సార్ ఉల్ తవ్హిద్ ఫి బిలాద్ అల్ హింద్(ఏయూటీ) పేరుతో ఓసంస్థను ఏర్పాటు చేశాడు. ఇతడే ముంబైకి చెందిన ముదాబిర్ ముస్తాఖ్ షేక్‌ను ఆన్లైన్ ద్వారా ఉగ్రబాట పట్టించాడు. భారత్‌లో విధ్వంసాల కోసం జునూద్-అల్-ఖలీఫా-ఏ-హింద్ పేరుతో సంస్థను ఏర్పాటు చేశాడు. కోడ్స్‌ను డీకోడ్ చేయడంతో.. భారత్‌కు మోస్ట్‌వాంటెడ్‌గా ఉన్న షఫీ ఆర్మర్.. ముదాబిర్‌తో సోషల్‌మీడియాలో చాటింగ్ చేస్తున్న విషయం గత ఏడాది గుర్తించిన సీఐఏ లోతుగా ఆరా తీసింది. ఫలితంగా వీరిద్దరూ ఉగ్రదాడులకు కుట్ర పన్నుతున్నారని గుర్తించిన సీఐఏ అప్పటి నుంచి నిశితంగా గమనిస్తూ వచ్చింది. నవంబర్‌లో వీరి మధ్య జరిగిన చాటింగ్‌తో వాతావరణం వేడెక్కుతోం దని, విధ్వంసాలకు రంగంలోకి దిగుతున్నారని గుర్తించింది. ముదాబిర్‌తో షఫీ వాట్సాప్ ద్వారా జరిగిన చాటింగ్‌లో ‘సాత్ కలాష్ రఖ్ దో’ అంటూ ఆదేశాలు ఇవ్వడంతో ఈ కోడ్‌ను డీకోడ్ చేయడంతో సీఐఏ సఫలీ కృతమైంది. దేశంలోని ఏడు ప్రాంతాల్లో విధ్వంసాలకు రెక్కీ సహా అన్ని ఏర్పాట్లు చేయాలన్నది దాని అర్థంగా తేల్చింది. మరికొన్ని కోడ్స్‌ను డీకోడ్ చేసిన తర్వాత సమగ్ర వివరాలతో డిసెంబర్లో కేంద్ర హోం శాఖకు లేఖ రాసింది. -
అస్సాంలో ప్రవేశానికి అల్‌కాయిదా యత్నాలు
ఉల్ఫాతో అవగాహన: సీఎం గొగోయ్ గువాహటి: ఈశాన్య రాష్ట్రం అస్సాంలో ప్రవేశించేందుకు అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ అల్‌కాయిదా తీవ్రంగా ప్రయత్నిస్తోందని ఆ రాష్ట్ర సీఎం తరుణ్ గొగోయ్ వెల్లడించారు. రాష్ట్రంలో స్థావరం ఏర్పాటుకు అల్‌కాయిదా ప్రయత్నాలు చేస్తోందని, నిషేధిత ఉగ్రవాద సంస్థ ఉల్ఫాతో ఓ రహస్య అవగాహనకు వచ్చిందని శనివారమిక్కడ విలేకర్లతో అన్నారు. భారత్‌లో ఉగ్రవాద కార్యకలాపాలను విస్తృతం చేస్తామని కొద్దిరోజుల క్రితం అల్‌కాయిదా పేరిట ఒక వీడియో ఆన్లైన్లో ప్రత్యక్షమైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో గొగోయ్ ప్రకటన ప్రాధాన్యం సంతరించుకుంది. అల్ కాయిదా ప్రయత్నాలను తిప్పికొట్టేందుకు అన్ని చర్యలు తీసుకున్నామన్నారు.