‘ఆ జీన్స్‌ వేస్తే.. రేప్‌ చేయడం జాతీయ బాధ్యత’ | Egyptian lawyer says it is national DUTY to harass and rape girls wearing ripped jeans | Sakshi
Sakshi News home page

‘ఆ జీన్స్‌ వేస్తే.. రేప్‌ చేయడం జాతీయ బాధ్యత’

Nov 2 2017 11:48 AM | Updated on Jul 28 2018 8:43 PM

Egyptian lawyer says it is national DUTY to harass and rape girls wearing ripped jeans - Sakshi

కైరో : అల్‌ అస్సీమా ఈజిప్ట్‌కు చెందిన జాతీయ చానెల్‌. వ్యభిచారంపై చట్టాన్ని చేయడంపై చర్చించేందుకు కొందరు నిపుణులను షోకు ఆహ్వానించింది. చర్చకు వచ్చిన వారిలో నబీ అల్‌ వాల్ష్‌ అనే కన్జర్వేటివ్‌ న్యాయవాది కూడా ఉన్నారు. చర్చలో పాల్గొన్న ఓ మహిళతో నబీకి వాగ్వాదం జరిగింది. ఈ సందర్భంగా నబీ చేసిన వ్యాఖ్యలు ప్రపంచ వ్యాప్తంగా దుమారం రేపాయి.

రిప్డ్‌ జీన్స్‌ వేసుకునే ప్రతి అమ్మాయిని సెక్సువల్‌గా హరస్‌ చేయోచ్చని, అలాంటి వారిని రేప్‌ చేయడం ‘జాతీయ బాధ్యత’గా నబీ అభివర్ణించారు. ఈజిప్టు మహిళా కమిషన్‌ న్యాయవాది నబీ, సదరు టీవీ చానెల్‌పై ఫిర్యాదు చేసేందుకు సిద్ధమవుతున్నట్లు చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement