
బనశంకరి(కర్ణాటక): మాజీ ప్రియుడు తనపై అత్యాచారానికి పాల్పడ్డారని ఆరోపిస్తూ ఓ మోడల్ చంద్రాలేఔట్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. వివరాలు... చిక్కమంగళూరుకు చెందిన గౌతమ్ నగరంలోని ఓ రియల్‌ఎస్టేట్ సంస్థలో పనిచేస్తున్నాడు. ఇతనికి నగరానికి చెందిన ఓ మోడల్ పరిచయం కావడంతో ఇద్దరు ప్రేమించుకున్నారు. అతని ప్రవర్తన నచ్చకపోవడంతో కొంతకాలంగా ఆమె దూరంగా ఉంటోంది.
ఇటీవల ఒంటరిగా ఇంటిలో ఉండగా తనపై అత్యాచారానికి పాల్పడ్డాడని ఆమె ఆరోపించింది. బాధితురాలు ఫిర్యాదు మేరకు చంద్రాలేఔట్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.