
సాక్షి, బెంగళూరు: కేంద్ర మాజీమంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జనార్ధన్ పూజారి భోరున విలపించారు. మంగళూరులో చర్చి, దేవాలయంలో ఆయన నిన్న కన్నీళ్లు పెట్టుకున్నారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ ఎంపీ ఆస్కార్ ఫెర్నాండేజ్ ఇటీవల అనారోగ్యంతో బాధపడుతున్నారంటూ వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. దీంతో ఆయన త్వరగా కోలుకోవాలంటూ మొదట గోకర్ణనాథేశ్వర స్వామి ఆలయంలో జనార్థన పూజారి పూజలు చేసి విలపించారు. తర్వాత రోసారియో చర్చికి వెళ్లి ప్రార్థన చేస్తుండగా అక్కడకు ఆస్కార్‌ఫెర్నాండేజ్ వచ్చారు. ఈ సందర్భంగా పూజారిని గట్టిగా హత్తుకుని, తనకు ఏమీ కాలేదని ఆరోగ్యంగా ఉన్నానని తెలిపారు. ఎవరో తప్పుడు సమాచారం ఇచ్చారంటూ ఫెర్నాండేజ్ చెప్పారు. అయితే ఈ తతంగం అంతా అక్కడున్నవారిని ఆశ్చర్యపరిచింది.
Comments
Please login to add a commentAdd a comment