ఇద్దరు అబ్బాయిలకు పెళ్లి చేశారు
మంగుళూరు: వర్షాలు కురవడం లేదని.. వరుణ దేవుడి కరుణ కోసం ఇద్దరు అబ్బాయిలకు పెళ్లి చేశారు. ఈ ఘటన మంగుళూరుకు చేరువలోని మహదేశ్వర హిల్స్‌లో చోటు చేసుకుంది. మహాశివరాత్రి పర్వదన సందర్భంగా మహదేశ్వర హిల్స్ గ్రామంలో ఈ పెళ్లి జరిగింది. ఇద్దరు అబ్బాయిల్లో ఒకరిని అమ్మాయిలా అలంకరించి ఆచారాల ప్రకారం వివాహం జరిపించారు గ్రామస్ధులు. వివాహంపై మాట్లాడిన కొందరు గ్రామ పెద్దలు అలా చేయడం వల్ల వర్షాలు బాగా కురుస్తాయని తమ నమ్మకమని చెప్పారు.
పెళ్లి కోసం గ్రామంలోని ప్రతి ఇంటి నుంచి కొంత మొత్తం ఇచ్చినట్లు వెల్లడించారు. ఇద్దరు అబ్బాయిలు వివాహం చేసుకోవడం వల్ల వారికి ఉన్న సమస్యలు కూడా తగ్గుతాయని తమ నమ్మకమని చెప్పారు. వర్షాల కోసం కప్పలకు, గాడిదలకు కూడా పెళ్లిళ్లు చేసిన సంఘటనలు చాలానే ఉన్నాయి. బెంగుళూరు పరిసర ప్రాంతాల్లో గ్రామాల్లో ఇలాంటి ఆచారాలు సర్వసాధారణంగా మారాయి.