వాషింగ్టన్ : గ్లోబల్ వార్మింగ్ మూలంగా ధ్రువాలలోని మంచు ఫలకాలు కరిగిపోయి తీర ప్రాంతాలు ముంపునకు గురయ్యే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నాసా పరిశోధనలో తేలిన సంచలన విషయం ఏంటంటే... ఆ ప్రభావం ఎక్కువగా చూపించబోయేది మన నగరంపైనేనంటా.
గ్రెడియంట్ ఫింగర్‌ప్రింట్ మ్యాపింగ్(జీఎఫ్‌ఎం) పేరిట ఈ మధ్యే నాసా ఓ కొత్త పరికరాన్ని కనిపెట్టింది. దాని ద్వారా ఏయే ప్రాంతాల్లో ముంపు ప్రభావం ఎక్కువగా ఉండబోతుందని అంచనా వేస్తోంది. గ్రీన్‌లాండ్, అంటార్కిటికాలో మంచు శిలలు కరిగిపోతే న్యూయార్క్, లండన్, ముంబై లాంటి మహానగరాల వాటిల్లే ముప్పు కంటే మంగళూర్‌కే ముంపు తీవ్రత ఎక్కువగా పొంచి ఉందంట. సుమారు 293 పోర్టు పట్ణణాలను పరిశోధించిన నాసా ఈ నివేదికను విడుదల చేసింది.
గ్రీన్ లాండ్ ఉత్తరాది, తూర్పు వైపున ఉన్న మంచుపొరలు కరిగిపోయి న్యూయార్క్ పట్టణానికి ఏర్పడే ప్రమాదం కన్నా... మంగళూరుకు ఏర్పడే ముప్పు ఎక్కువగా ఉందని తేలింది. వీటితోపాటు కరాచీ, చిట్టాగాంగ్, కొలంబో పట్టణాలకు కూడా మునిగిపోయే ప్రమాదం ఉందని నాసా హెచ్చరిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment