Global warming effect
-
డేంజర్ జోన్లో భారత్, తీవ్రవైన కరువు దేశంగా..
భూతాపం కారణంగా తీవ్రమైన కరువును ఎదుర్కోవాల్సిన దేశాలలో భారత్ కూడా ఉంది.రాబోయే 30 ఏళ్ళల్లో ఈ తీష్ణత మరింతగా పెరుగుతూ ఉంటుందని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు.భారతదేశంలోని 50 శాతం మందిపై కరువు బరువు పడే సూచనలు కనిపిస్తున్నాయి.భూతాపం 3డిగ్రీల సెల్సియస్ పెరిగితే చాలు భారీ మూల్యాన్ని చెల్లించుకోవాల్సి వస్తుందని నివేదికలు చెబుతున్నాయి. 1.5 డిగ్రీల సెల్సియస్ పెరిగినా పరిణామాలు తీవ్రంగానే ఉండనున్నాయి.ముఖ్యంగా వ్యవసాయభూమి దాదాపు సగానికి పైగా కరువుక్షేత్రంగా మారిపోతుందని పరిశోధకులు చెబుతుంటే ఒళ్ళు గగుర్పొడుస్తోంది. ప్యారిస్ ఒప్పందంలో చెప్పినట్లుగా ఉష్ణోగ్రతలను పారిశ్రామిక యుగం నాటికి తీసుకురాగలిగితే చాలా వరకూ ముప్పును తప్పించుకో గలుగుతాం. ఆచరణలో అది జరిగేపనేనా? అన్నది పెద్దప్రశ్న. భూమి వేడిక్కిపోతోందిరా! బాబూ అంటూ శాస్త్రవేత్తలు నెత్తినోరు మొత్తుకుంటూనే ఉన్నారు. పర్యావరణ పరిరక్షణకై ఎప్పటి నుంచో ఎన్నో ఉద్యమాలు జరుగుతున్నాయి. అంతర్జాతీయ వేదికలపై దేశాధినేతలు కలుసుకున్నప్పుడల్లా చర్చించే అంశాల్లో ఇదొకటి.ఉపన్యాసాలు, ఒప్పందాలు, నినాదాలు తప్ప అంతటా ఆచరణ శూన్యం. భూమి వేడిక్కిపోతున్న ప్రభావంతో శీతోష్ణస్థితుల్లో తీవ్రమైన మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఈ ఉష్ణోగ్రతలను కొలవడం ద్వారా దుష్ప్రభావాలను ఎప్పటికప్పుడు అంచనా వేస్తున్నారు. ఆ వివరాలను సంబంధిత విభాగాలు ప్రపంచానికి తెలియజేస్తూనే ఉన్నాయి.వాతావరణంలో మార్పులు చేర్పులు అన్నది అనాదిగా జరిగే పరిణామం. శీతోష్ణస్థితుల ప్రభావం ప్రపంచంపై, మానవుల మనుగడపై ఎంతో శక్తివంతంగా పనిచేస్తూ ఉంటుంది. ముఖ్యంగా, 20వ శతాబ్దం మధ్యకాలం నుంచీ ఉష్ణోగ్రతల్లో పెరుగుదల అసాధారణ స్థితికి చేరిపోయింది.ఈ ప్రభావంతో రుతువుల ప్రయాణం కూడా గతితప్పింది. అకాల వర్షాలు, ప్రకృతి భీభత్సాలు, కరువుకాటకాలు, వింత వింత జబ్బులు అన్నింటికీ భూమి వేడెక్కిపోవడమే ప్రధాన కారణం. పారిశ్రామికం వెర్రితలలు వేసి,ఆర్ధిక స్వార్థం ప్రబలి, హరిత చైతన్యం అడుగంటడం వల్ల అనర్ధాలు జరుగుతున్నాయి.ఆరోగ్యకరమైన అభివృద్ధికి అవరోధాలు పెరుగుతున్నాయి.కార్బన్ డై ఆక్సైడ్, మీథేన్, నైట్రస్ ఆక్సైడ్ వంటి గ్రీన్ హౌస్ వాయువుల ఉద్గారమే కొంప ముంచుతోంది. భూమి వేడెక్కిపోవడం వల్ల ఏర్పడుతున్న పరిణామాలు విస్తృతంగా ఉంటాయి.సముద్ర మట్టాలు పెరిగిపోవడం, మహా సముద్రాల ఆమ్లీకరణం,అడవులు మండిపోవడం, అనేక జాతులు అంతరించిపోవడం, పంటల దిగుబడి తగ్గిపోవడం, ఆహారకొరత చుట్టుముట్టడం మొదలైన ఎన్నో దుష్పరిణామాలు సంభవిస్తున్నాయి. సముద్ర తీర ప్రాంత వాసులు ఖాళీ చేసి వేరే ప్రాంతాలకు కూడా తరలిపోవాల్సి వస్తుంది.భూతాపాన్ని అడ్డుకోవడం అందరి సమిష్టి బాధ్యత. ప్రభుత్వాలు, పారిశ్రామిక వర్గాలు, ప్రజలు అందరూ కలిసి రంగంలోకి దిగాలి. ఒక్కమాటలో చెప్పాలంటే ఈ దుస్థితికి కారణం మనిషి. మనిషిలోని స్వార్ధ చింతన, బాధ్యతా రాహిత్యం, రేపటి పట్ల ఏ మాత్రం స్పృహ లేకపోవడం ఈ దుస్థితికి చేర్చాయి. ఐక్య రాజ్య సమితి ఇటీవల నిర్వహించిన సమావేశంలోనూ ఈ అంశం బలంగా చర్చకు వచ్చింది. ఉద్గారాలను పెద్దఎత్తున తగ్గించాలి.భూతాపాన్ని 2 డిగ్రీల సెల్సియస్ కన్నా తక్కువకు పరిమితం చేయాలని 2016లో పారిస్ లో ఒప్పందం జరిగింది. ఈ ఆరేడేళ్లలో అది తగ్గకపోగా మరింత పెరిగింది.భూమిని, వనరులను వాడుకొనే విధానంలో పెను అనారోగ్యకరమైన విధానాలు వచ్చాయి. నివాసయోగ్య భూమి -అటవీ భూమి మధ్య ఉన్న నిష్పత్తులు మారిపోయాయి. వ్యవసాయభూమిని వాడుకోవడంలోనూ మార్పులు వచ్చాయి. వ్యవసాయం కంటే మిగిలిన వాటికి ఆ భూమిని వాడే సంస్కృతి పెరిగిపోయింది. పర్యవసానంగా అటవీ భూమి, వ్యవసాయ భూమి తగ్గిపోయింది. కొన్ని రసాయనాల సమ్మేళనం మేఘాలను కూడా ప్రభావితం చేస్తున్నాయి.భూమికి చేరే సూర్యకాంతి పరిమాణంలో కూడా తగ్గుదల మొదలైంది. దీనిని 'గ్లోబల్ డిమ్మింగ్ ' అంటారు. భూమికి సూర్యుడే ప్రధానమైన శక్తి.ఆ వనరులు తగ్గిపోవడం అత్యంత ప్రమాదకరం.ఇప్పటికైనా మేలుకోవాలి. గ్రీన్ వాయివులను తగ్గించుకోవాలి. సౌరశక్తి, పవన శక్తిని ఎక్కువగా సద్వినియోగం చేసుకోవాలి. కార్బన్ వాడకాన్ని తగ్గించడం ఎంత ముఖ్యమో,అడవులను పెంచడం అంతకంటే ముఖ్యం. పబ్లిక్ రవాణా విధానంలో చాలా మార్పులు రావాలి.కార్లు మొదలైన వాహనాల వాడకం తగ్గించి, నడక, సైకిళ్ల వాడకం పెంచమని నిపుణులు సూచిస్తున్నారు.భూతాపం వల్ల 2030 నాటికి మరో 12 కోట్ల మందికి పైగా ప్రజలు పేదరికంలోకి వెళ్ళనున్నారని నివేదికలు చెబుతున్నాయి.వాతావరణాన్ని మనకు అనుకూలంగా మలుచుకోవడంలో ఆరోగ్యకరమైన విధానాలను పాటిస్తే ఉధృతి తీవ్రత తగ్గుముఖం పడుతుంది. ప్రకృతిని గౌరవిస్తే, అది మనల్ని కాపాడుతుంది. -మాశర్మ, సీనియర్ జర్నలిస్ట్ -
గడ్డకట్టే మంచులో జాంబీ వైరస్లు!
గ్లోబల్ వార్మింగ్‌తో మానవాళికి ముమ్మాటికీ ముప్పే!. అతిశీతోష్ణ స్థితి ప్రాంతాల్లో.. వాతావరణ మార్పుల ప్రభావం పెను ముప్పుకు దారి తీయొచ్చని శాస్త్రవేత్తలు గత కొన్నేళ్లుగా హెచ్చరిస్తూ వస్తున్నారు. వాతావరణం వేడెక్కడం వల్ల మంచు కరిగిపోవడం.. అందులో అప్పటికే చిక్కుకున్న మీథేన్ వంటి గ్రీన్‌హౌజ్ వాయువులు విడుదల కావడం, తద్వారా పరిస్థితి మరింత దిగజారుతుందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. అయితే.. గడ్డ కట్టుకుపోయే స్థితిలో ఉన్న మంచులో సైతం.. ప్రమాదకరమైన వైరస్ల ఉనికి ఉంటుందని, ఒకవేళ ఇవి గనుక విజృంభిస్తే .. మానవాళికి ముప్పు ఊహించని రీతిలో ఉండొచ్చని తాజాగా సైంటిస్టులు తమ అభిప్రాయం వ్యక్తం చేశారు. కరోనాతో ప్రపంచ మానవాళి ఎంత ఇబ్బంది పడిందో కళ్లారా చూశాం. అలాగే.. కనుమరుగు అయ్యాయనుకునే వైరస్ల జాడ.. మంచు ప్రాంతాల్లో సజీవంగా తరచూ బయటపడుతుంటుంది కూడా. కానీ, వాటి ప్రభావం ప్రపంచంపై ఏమేర ఉంటుందనే దానిపై ఓ స్పష్టత అంటూ లేకుండా పోయింది. తాజాగా.. రష్యాలోని సైబీరియా రీజియన్‌లో సుమారు 48 వేల సంవత్సరాల వయసున్న వైరస్ల ఉనికిని.. గడ్డకట్టుకుపోయిన ఓ సరస్సు అడుగు భాగం సేకరించారు యూరోపియన్ సైంటిస్టులు. మంచు ప్రాంతాల్లో తమ పరిశోధనల్లో భాగంగా.. మొత్తం పదమూడు రకాల వ్యాధికారకాలను గుర్తించి.. ‘జాంబీ వైరస్’లుగా వాటిని వ్యవహరిస్తున్నారు. అయితే ఆశ్చర్యంగా.. ఇంతకాలం గడ్డకట్టిన స్థితిలో ఉన్నా కూడా అంటువ్యాధులు ప్రబళించే సామర్థ్యంతో అవి ఉన్నట్లు చెప్తున్నారు. రష్యా, జర్మనీ, ఫ్రాన్స్‌కు చెందిన సైంటిస్టులు ఈ వైరస్లు తిరిగి విజృంభిస్తే.. ఏమేర ప్రభావం చూపుతాయి అనే అంశంపై పరిశోధనలు ముమ్మరం చేశారు. వీటి వయసు ఎంత? అంటువ్యాధులను ఎలా వ్యాప్తి చెందిస్తాయి? బయటకు వచ్చాక వాటి ప్రభావం ఎలా ఉంటుంది?.. మనిషి/జంతువుల్లో వాటి ప్రభావం ఏమేర ఉంటుంది?.. తదితర అంశాలపై ఇప్పుడే ఓ అంచనాకి రాలేమని, మరికొంత సమయం పడుతుందని రీసెర్చర్లు చెప్తున్నారు. ఇదీ చదవండి: మంకీపాక్స్ పేరు మారింది! -
భారత్‌లో 2 నిమిషాలకు ఒకరు దుర్మరణం.. మేల్కోపోతే వినాశనమే!
కరోనా మహమ్మారి కారణంగా ప్రపంచవ్యాప్తంగా లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. వైరస్ కారణంగా ఏర్పడిన ఆర్థిక సంక్షోభంతోనూ చాలా దేశాల్లో తిండి దొరకని పరిస్థితులు తెలెత్తాయి. అయితే, అంతుకు మించిన విపత్తు మనకు తెలియకుండానే ప్రాణాలను హరిస్తోంది. మనం చేసుకుంటున్న కర్మకు ఫలితేమేనంటూ శాస్త్రవేత్తలు బల్ల గుద్ది చెబుతున్నారు. పెరుగుతున్న కాలుష్యం కారణంగా భూతాపం(గ్లోబల్ వార్మింగ్) పెరిగిపోయి.. లక్షల మంది ప్రాణాలు కోల్పోతున్నారు. బొగ్గు, చమురు, గ్యాస్‌కు ప్రస్తుతం విపరీతమైన డిమాండ్ పెరిగి.. విచ్చలవిడిగా వాడేస్తున్నారు. ఈ క్రమంలో విస్తుపోయే విషయాలను వెలుగులోకి తీసుకొచ్చింది ఓ పరిశోధన. శిలాజ ఇంధనాల వాడకం వల్ల ఒక్క భారత్‌లోనే 2 నిమిషాలకు ఒకరు ప్రాణాలు కోల్పోతున్నారని తాజాగా నివేదిక ‘ద లాన్సెట్ కౌంట్‌డౌన్ ఆన్ హెల్త్ అండ్ క్లైమేట్ చేంజ్’ హెచ్చరించింది. ఈ నివేదికను ప్రపంచ ఆరోగ్య సంస్థ, ప్రపంచ వాతావరణ సంస్థ వంటి 50 సంస్థలకు చెందిన 99 మంది నిపుణులు రూపొందించారు. శిలాజ ఇంధనాల వాడకాన్ని తగ్గిస్తూ ఆరోగ్య కార్యక్రమాలపై దృష్టిపెట్టాలని ప్రపంచ దేశాల ప్రభుత్వాలకు సూచించారు. శిలాజ ఇంధనాలకు రాయితీలు ఇస్తూ.. వాటికి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తే.. ఆహార భద్రత, అంటు వ్యాధుల వ్యాప్తి, ఉష్ణోగ్రత వల్ల కలిగే వ్యాధులు, విద్యుత్తు సంక్షోభం, గాలి కాలుష్యం వల్ల మరణాలు వంటివి పెరిగిపోయి మహా విపత్తు తలెత్తుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రపంచ దేశాలు తక్షణం చర్యలు చేపట్టకపోతే జరిగేది వినాశనమేనని హెచ్చరించారు. ► శిలాజ ఇంధనాల వాడకంతో ఏర్పడే కాలుష్యం కారణంగా భారత్‌లో గత ఏడాది 2020లో ఏకంగా 3,30,000 మంది ప్రాణాలు కోల్పోయారని నివేదిక వెల్లడించింది. అది ప్రతి 2 నిమిషాలకు 1.2 మంది చనిపోయినట్లు తెలుస్తోంది. మరోవైపు.. చైనాలో 3,80,000 మరణాలు సంభవించగా, ఐరోపాలో 1,17,000 మంది ప్రాణాలు కోల్పోయారు. అమెరికాలో 32 వేల మంది మరణించారు. ► ప్రస్తుతం ప్రపంచ దేశాలు అవలంభిస్తున్న తీరుతో ఈ శతాబ్దం చివరి నాటికి భూతాపం 2.7 డిగ్రీల సెల్సియస్ పెరగనుంది. ప్రస్తుతం 1.1 డిగ్రీ సెల్సియస్ పెరిగినందుకే వడగాలులు, వరదలు, తుపాన్లతో ప్రపంచం అతలాకుతలమవుతోంది. మరి ఆ స్థాయి ఉష్ణోగ్రతకు చేరుకుంటే పరిస్థితి దారుణంగా ఉండనుంది. ► వాతావరణ మార్పులు, గాలి కాలుష్యం కారణంగా ఎక్కువ నష్టం జరుగుతోందని నివేదిక వెల్లడించింది. శిలాజ ఇంధానలను వాడటం వల్ల గ్రీన్‌హౌజ్ గ్యాస్ గాల్లో కలిసి ప్రాణాలను హరించివేస్తోందని పేర్కొంది. గాలి కాలుష్యం కారణంగా శరీరంలోని ప్రతి అవయవం దెబ్బతింటున్నట్లు స్పష్టం చేసింది. గాలి నాణ్యత పీఎం 2.5గా ఉన్న అమెరికాలోనే గత ఏడాది 32వేల మంది మరణించారని ఆందోళన వ్యక్తం చేసింది. ► ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాలు శిలాజ ఇంధనాలకు రాయితీలు ఇస్తున్నాయి. అందులో కొన్ని దేశాల్లో ఆరోగ్య రంగానికి మించి శిలాజ ఇంధానల కోసం ఖర్చు చేస్తున్నాయి. 2019లో 69 దేశాలు 400 బిలియన్ డాలర్లు ఖర్చు చేశాయి. భారత్ 43 బిలియన్ డాలర్లు, చైనా 35 బిలియన్ డాలర్లు, ఐరోపాలోని 15 దేశాలు ఒక్కో దేశానికి ఒక్కో బిలియన్ డాలర్ల చొప్పును రాయితీలు కల్పిస్తున్నాయి. అమెరికా 20 బిలియన్ డాలర్లు వెచ్చిస్తోంది. దీంతో శిలాజ ఇంధనాల వాడకం పెరిగిపోతోంది. దీంతో కాలుష్యం పెరగటం, పర్యావరణ మార్పులు చోటు చేసుకుని వినాశనాన్ని కొనితెచ్చుకుంటున్నామని నిపుణులు ఆందోళన వ్యక్తం చేశారు. ఇదీ చదవండి: షాకింగ్.. బతికున్న మహిళను మింగిన 22 అడుగుల భారీ కొండచిలువ -
సమీపంలో మహా సంక్షోభం
ఉత్తరాదిన భానుడి చండప్రతాపం 50 డిగ్రీల సెంటీగ్రేడ్. అంటే గడచిన 122 ఏళ్ళలో ఎన్నడూ లేనంతగా ఈ మార్చి, ఏప్రిల్‌లలో ఉష్ణోగ్రత. దక్షిణాదిన బెంగుళూరులో గంటల వ్యవధిలో ఒక్కపెట్టున కురిసిన వర్షంతో తిప్పలు. అస్సామ్ సహా ఈశాన్య రాష్ట్రాల్లో వరదలు, భూపతనాలు. ఎండ, వాన, చలి – అన్నీ అతిగానే! ఏదైనా అకాలమే!! ఈ శతాబ్దంలో భారత్ ఎదుర్కొంటున్న పెను ముప్పు వాతావరణ సంక్షోభం అని శాస్త్రవేత్తలు మొత్తుకుంటున్నది అందుకే! ప్రపంచ వ్యాప్తం గానూ ప్రధాన సమస్యలు – వాతావరణ మార్పులు, కాలుష్యమే. ఐక్యరాజ్య సమితి (ఐరాస) తాజా నివేదికలు ఆ మాటే చెబుతున్నాయి. వాతావరణ మార్పునకు ప్రధాన సూచికలైన నాలుగూ (గ్రీన్హౌస్ వాయువుల సాంద్రత, సముద్ర మట్టంలో పెరుగుదల, మహాసముద్రాల వేడిమి, ఆమ్లీకరణ) గత ఏడాది రికార్డు స్థాయిలో పెరిగాయి. మానవాళి మహా సంక్షోభం దిశగా వెళుతోంద నడానికి ఇదే సాక్ష్యమంటూ ఐరాస ప్రమాద ఘంటిక మోగిస్తోంది. ఒక రకంగా ఐరాస విడుదల చేసిన వాతావరణ రిపోర్ట్ కార్డు ఇది. దీన్ని బట్టి చూస్తే, ఉష్ణోగ్రతను పెంచే గ్రీన్హౌస్ వాయువుల స్థాయి ప్రపంచమంతటా 2020లోనూ, ఆ వెంటనే 2021లోనూ పెరుగుతూ పోయింది. పారిశ్రామికీకరణ ముందు రోజులతో పోలిస్తే ఇప్పుడు వాతావరణంలో కార్బన్ డయాక్సైడ్ సాంద్రత ఏకంగా 149 శాతం హెచ్చింది. ఇక, సముద్రమట్టం ఏటా సగటున 4.5 మి.మీ. వంతున పెరుగుతోంది. మహా సముద్రాల ఉష్ణోగ్రత, ఆమ్లీకరణ సైతం ఎక్కువవుతూ వస్తోంది. దీని వల్ల పగడాల దిబ్బలలాంటి నీటిలోని జీవావరణ వ్యవస్థలు, ప్రాణికోటి నాశనమవుతాయి. కాలుష్యం సంగతికొస్తే – వాయు, జల, రసాయన తదితర కారణాలతో ఒక్క 2019లోనే ప్రపంచవ్యాప్తంగా 90 లక్షల మంది మరణించారు. ‘లాన్సెట్ ప్లానెటరీ హెల్త్’ బుధవారం బయటపెట్టిన ఈ లెక్క ప్రకారం ప్రతి 6 మరణాల్లో ఒకటి కాలుష్య మరణమే. ఈ మొత్తంలో దాదాపు 24 లక్షల చావులు భారత్‌లో సంభవించినవే. ప్రపంచ కాలుష్య మరణాల్లో 66.7 లక్షల ప్రధాన వాటా వాయు కాలుష్యానిది. మన దేశంలోనూ కాలుష్య కోరలకు బలైన 24 లక్షల మందిలో... 16.7 లక్షల మంది పీల్చే గాలే ప్రాణాంతకమైనవారు. ఆ లెక్కన భారత్‌లో వాయు కాలుష్య మరణాల సంఖ్య ప్రపంచంలోని ఏ దేశంలోనూ లేనంత ఎక్కువ. భారత్‌లోనే కాదు... ప్రపంచమంతటా ఉగ్ర ఉష్ణపవనాలు, తుపానులు, అకాల వర్షాలు, కొన్నిచోట్ల అనావృష్టి, సముద్రమట్టాల పెరుగుదల ఊహించని రీతిలో తరచుగా సంభవిస్తున్నాయి. వీటికి కాలుష్యం, పర్యావరణ మార్పులే కారణమన్నది శాస్త్రవేత్తల విశ్లేషణ. దేశంలో ఇవాళ 63.8 కోట్ల జనాభాకు ఆవాసమైన 75 శాతానికి పైగా జిల్లాలు ఈ విపరీత వాతావరణ మార్పులకు కేంద్రాలట. ఇలాంటి వాతావరణ వైపరీత్యాలు 1970 నుంచి 2019 మధ్య 50 ఏళ్ళలో 20 రెట్లకు పైగా పెరిగాయి. భారతీయ మేధావుల బృందమైన ‘కౌన్సిల్ ఆన్ ఎనర్జీ, ఎన్విరాన్మెంట్ అండ్ వాటర్’ (సీఈఈడబ్లు్య) తన అధ్యయనంలో ఈ సంగతి తేల్చింది. ఇది పైకి కనిపించకుండా శ్రామికశక్తినీ, ఆర్థిక వ్యవస్థనూ కూడా దెబ్బతీస్తున్న విషవలయం. ఏ ఏటికాయేడు పెరుగుతున్న వైపరీత్యాలతో ఇటు పట్నాల్లో, అటు పల్లెల్లో ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటోంది. జీవనోపాధి పోతోంది. స్వయంకృతాపరాధమైన వాతావరణ వైపరీత్యాలతో భారీ సామాజిక ఆర్థిక మూల్యం చెల్లిం చాల్సి వస్తోంది. పెరుగుతున్న వేడిమి వల్ల వ్యావసాయిక ఉత్పత్తి క్షీణిస్తోంది. ఏటా 2.5 నుంచి 4.5 శాతం స్థూల జాతీయోత్పత్తిని నష్టపోయే ప్రమాదం ఉంది. అంతర్జాతీయ శ్రామిక సంస్థ (ఐఎల్ఓ) లెక్క ప్రకారం ఉష్ణతాపంతో తీవ్రంగా దెబ్బతింటున్న దేశాల్లో భారత్ ఒకటి. వేడిమి వల్ల 1995లో దేశంలో 4.3 శాతం పని గంటలు వృథా అయ్యాయి. వచ్చే 2030 నాటికి ఆ వృథా 5.8 శాతానికి చేరుతుందని అంచనా. దేశంలో గోధుమల ధర పెరగడానికీ పరోక్షంగా వాతావరణ మార్పులే కారణం. ఈ వేసవిలో ఉష్ణపవనాలతో 10 నుంచి 15 శాతం గోధుమ పంట నష్టపోయాం. అదే సమ యంలో ప్రపంచ గోధుమల ఎగుమతిలో ప్రధాన పాత్రధారి ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధంతో సరఫరా చిక్కుల్లో పడింది. గో«ధుమ పిండి ఖరీదైపోయి, సామాన్యుల చపాతీలపై దెబ్బ పడింది. ఇలాంటి ఉదాహరణలు అనేకం. పెరుగుతున్న ఉష్ణోగ్రతలు నీటి భద్రత పైనా ప్రభావం చూపనున్నాయి. మరి, నీటి లభ్యతను కాపాడుకోవడంలో, నిల్వ చేసుకోవడంలో ఎలాంటి చర్యలు చేపడుతున్నాం? తాత్కాలిక పరిష్కారాలతో సమస్య తీరేది కాదు. కాలుష్య నివారణ, పర్యావరణ పరిరక్షణకు విధానపరమైన మార్పులు తప్పనిసరి. పునర్వినియోగ ఇంధనం దిశగా మళ్ళాలి. వేడిని పెంచే ఏసీలు, కార్ల బదులు గాలి – వెలుతురు ధారాళంగా వచ్చే ఇళ్ళు, చల్లటి మిద్దెలు, హరితవనాల పెంపకం, అనువైన పౌర రవాణా వ్యవస్థలను ఆశ్రయించాలి. వివిధ ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయం కీలకం. నిజానికి ప్రతి రాష్ట్రంలో వాతావరణ మార్పును పర్యవేక్షించే సెల్ ఉంది. వాటన్నిటికీ పెద్దగా ప్రధాన మంత్రికి వాతావరణ మార్పుపై సలహాలిచ్చే కౌన్సిల్ కూడా ఉంది. కానీ, 2015 జనవరిలో తొలి సమావేశం తర్వాత మళ్ళీ ఇప్పటి దాకా సదరు కౌన్సిల్ కలిస్తే ఒట్టు. అలాగే, అన్ని రాష్ట్రాల్లోని సెల్స్‌ను కూడా పట్టించుకుంటున్న పాపాన పోలేదు. ప్రకృతి పెనుకేక పెడుతోంది. చెవి ఒగ్గకపోతే ముప్పు మనకీ, మన పిల్లలకే! -
‘మెకానికల్ చెట్లు’ ఊపిరిపోసుకుంటున్నాయి!
భూమిపై రోజురోజుకూ కార్బన్డయాక్సైడ్ పెరిగిపోతోంది. దాన్ని తగ్గించాలంటే చెట్లు కావాలి. అసలే అడవులు వేగంగా తరిగిపోతున్నాయి. మరెలా? ఈ ఆలోచన నుంచే ‘మెకానికల్ చెట్లు’ఊపిరిపోసుకుంటున్నాయి. నిరంతరం కార్బన్ డయాక్సైడ్ను పీల్చుకుంటూ.. గాలిని శుభ్రం చేసే ఈ చెట్లను ప్రపంచవ్యాప్తంగా ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనలు వస్తున్నాయి. మరి ఈ కృత్రిమ చెట్ల వివరాలేమిటో తెలుసుకుందామా.. – సాక్షి సెంట్రల్ డెస్క్ వాహనాలు, పరిశ్రమలు, థర్మల్ విద్యుత్ కేంద్రాలు.. ఇలా అన్ని ఇన్ని కాదు.. మనుషులకు కావాల్సిన కీలక అవసరాలన్నీ కాలుష్యాన్ని వదిలేవే. అందు లోనూ కార్బన్‌డయాక్సైడ్‌తో పెద్ద తలనొప్పి. రోజురోజుకు భూమి వేడెక్కి వాతావరణం తీవ్రమార్పులకు లోనవడానికి కారణాల్లో ఇదీ ఒకటి. భూమిపై కార్బన్డయాక్సైడ్ పరిమితి దాటిపోయిందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికిప్పుడు వాహనాలు, పరిశ్రమలు వంటివి ఆపేసినా సరిపోదని.. వాతావరణం నుంచి కార్బన్‌డయాక్సైడ్‌ను తగ్గించే చర్యలు అత్యవసరమని స్పష్టం చేస్తున్నారు. ఈ క్రమంలోనే అమెరికాకు చెందిన అరిజోనా స్టేట్ వర్సిటీ శాస్త్రవేత్త క్లౌస్ లాక్నర్ కృత్రిమ ‘యంత్రపు చెట్ల (మెకానికల్ ట్రీస్)’కు రూపకల్పన చేశారు. ఎలా పనిచేస్తాయి? వీలైనంత తక్కువ స్థలంలో, ఎక్కువ కార్బన్ డయాక్సైడ్ను పీల్చుకొనేలా ‘మెకానికల్’ చెట్లను రూపొందించారు. ఒక్కోటీ ఐదు అడుగుల వెడల్పు, 32 అడుగుల ఎత్తుతో గుండ్రంగా, ఎత్తైన టవర్లలా ఉండే ఈ చెట్లలో.. వందలకొద్దీ గుండ్రని డిస్కులు ఒకదానిపై మరొకటి పేర్చి ఉంటాయి. వాటిపై ప్రత్యేకమైన రసాయన పదార్థపు పూత ఉంటుంది. ఈ డిస్కుల మీదుగా గాలి వీచినప్పుడు అందులోని కార్బన్‌డయాక్సైడ్‌ను.. ఈ రసాయనం పీల్చుకుంటుంది. డిస్కులు కార్బన్‌డయాక్సైడ్‌తో నిండాక.. దిగువన ఉన్న బ్యారెల్లోకి జారిపోతాయి. అక్కడ వేడి నీటి ఆవిరిని పంపడం ద్వారా.. డిస్కులపై ఉన్న కార్బన్‌డయాక్సైడ్‌ను వేరుచేస్తారు. తర్వాత డిస్కులను మళ్లీ పైకి జరుపుతారు. అవి య«థావిధిగా కార్బన్‌డయాక్సైడ్‌ను పీల్చుకుంటూ ఉంటాయి. ప్రతి 20–30 నిమిషాలకోసారి ఈ ప్రక్రియ జరుగుతుంది. ఒక్కోటీ వేల చెట్లతో సమానం కొన్నివేల మామూలు చెట్లన్నీ కలిసి పీల్చుకునేంత ఆక్సిజన్‌ను ఒక్క మెకానికల్ చెట్టు సంగ్రహిస్తుందని శాస్త్రవేత్త క్లౌస్ లాక్నర్ తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా మెకానికల్ చెట్లను ఏర్పాటు చేయడం ద్వారా గ్లోబల్ వార్మింగ్‌ను తగ్గించేందుకు వీలుంటుందని స్పష్టం చేశారు. ఇలా గాల్లోంచి తొలగించిన కార్బన్‌డయాక్సైడ్‌ను భూమి పొరల్లో నిక్షిప్తం చేయడంగానీ.. పెట్రోల్, డీజిల్ వంటివాటిని కృత్రిమంగా తయారు చేయడానికి గానీ వీలుంటుందని వెల్లడించారు. ప్రస్తుతం అరిజోనాలో రోజుకు వెయ్యి టన్నుల కార్బన్‌డయాక్సైడ్‌ను పీల్చుకునే స్థాయిలో.. ‘మెకానికల్ చెట్ల తోట’ను ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నట్టు తెలిపారు. -
వందేళ్లలో కరిగిపోయిన కొండ
గ్లోబల్ వార్మింగ్‌తో ప్రళయం ముంచుకొస్తోందంటూ నలువైపుల నుంచి హెచ్చరికలు వినిపిస్తున్నా మనిషిలో మార్పు రావడం లేదు. క్రమంగా పెరుగుతున్న భూతాపంతో మంచు కొండలు వేగంగా అంతరించిపోతున్నాయి. ఉష్ణోగ్రతల ధాటికి గ్లేసియర్లు కరిగిపోతున్నాయి. వందేళ్లలో ఓ పెద్ద గ్లేసియర్‌లో చోటు చేసుకున్న మార్పులను తెలియజేస్తూ ఐఎఫ్ఎస్ అధికారి సుధా రామన్ ట్విట్టర్లో పోస్టు చేసిన ఫోటో వైరల్‌గా మారింది. రష్యాలోని స్వాల్బార్డ్లోని మంచు కొండల దగ్గర 103 ఏళ్ల గ్యాప్‌లో తీసిన రెండు ఫోటోలను పోస్ట్ చేశారు సుధా రామన్. మొదటి ఫోటోలో ఎత్తైన మంచు కొండలు ఉండగా... తర్వాత తీసిన ఫోటోలో మంచు కొండలు దాదాపుగా కరిగిపోయిన ఉన్నాయి. Two photos taken at the same spot with a 103 years difference. What do you see here? pic.twitter.com/rcSCnEgrj0 — Sudha Ramen IFS 🇮🇳 (@SudhaRamenIFS) June 16, 2021 చదవండి : Apps: గోప్యత, భద్రతపై యూజర్లలో ఆందోళన -
64% వర్షాన్ని పీల్చుకుంటున్న భూమి!
ఎక్కువ వర్షం పడినప్పుడు సాధారణంగా ఎక్కువ నీరు చెరువులు, నీటి ప్రాజెక్టుల్లోకి చేరటం రివాజు. కానీ, ఇటీవల కాలంలో అలా జరగడం లేదని, పెరుగుతున్న భూతాపం వల్ల భూమాత దాహం అంతకంతకూ పెరిగిపోవడమే ఇందుకు మూలకారణమని ఒక అధ్యయనంలో తేలింది. కుండపోత వర్షం కురిసినప్పుడు కూడా గతంలో మాదిరిగా వాగులు, వంకలు, నదుల్లోకి వరద నీరు ఎక్కువగా చేరటం లేదని యూనివర్సిటీ ఆఫ్ న్యూ సౌత్ వేల్స్ బృందం అధ్యయనంలో వెల్లడైంది. 160 దేశాల్లో 5,300 నదీ పరీవాహక ప్రాంతాల్లో పరిశీలన కేంద్రాలు, 43 వేల వర్షపాత నమోదు కేంద్రాల నుంచి సేకరించిన సమాచారాన్ని విశ్లేషిస్తే ఇదే అర్థమవుతోందని యూనివర్సిటీ ఆఫ్ న్యూ సౌత్ వేల్స్ ప్రతినిధి శర్మ ఇటీవల వెల్లడించారు. మనం ఇప్పటి వరకు అనుకుంటున్న దానికన్నా భూదాహం ఎక్కువగా ఉందన్నారు. వంద వాన చుక్కలు నేల మీద పడితే అందులో నుంచి 36 చుక్కలు మాత్రమే సరస్సులు, నదులు, భూగర్భ జలాల్లో కలుస్తున్నాయి. మనుషులకు అందుబాటులో ఉండే (ఈ నీటినే సాంకేతిక పరిభాషలో ‘బ్లూ వాటర్’ అంటారు) ఇదే. మిగతా మూడింట రెండొంతుల వర్షపు నీరు కురిసినప్పుడే మట్టిలోకి ఇంకిపోతున్నాయని (ఈ నీటినే సాంకేతిక పరిభాషలో ‘గ్రీన్ వాటర్’ అంటారు) ఈ అధ్యయనంలో తేలింది.వాతావరణ మార్పుల వల్ల కుండపోత వర్షాల సంఖ్య పెరిగినా నదులు, రిజర్వాయర్లలోకి వరద నీరు గతంలో మాదిరిగా పోటెత్తకపోవడానికి నేల ఉష్ణోగ్రత గతంలో కన్నా పెరిగి, ఆవిరైపోయే నీటి శాతం పెరిగింది. అందువల్లే వర్షపు నీటిని భూమి ఎక్కువ మొత్తంలో తాగేస్తోంది. సాధారణ వర్షాలకు నీరు పారి తరచూ రిజర్వాయర్లలోకి నీరు చేరుతుంటేనే రిజర్వాయర్లలో నీరు ఉంటుంది. భారీ వర్షపాతం నమోదైన అరుదైన సందర్భాల్లో మాత్రమే నదులు, రిజర్వాయర్లలోకి నీరు వస్తున్నదని ఈ అధ్యయనం తేల్చి చెబుతోంది. అంటే, గతంలో కన్నా భూమి త్వరగా బెట్టకు వస్తున్న సంగతిని రైతులు గుర్తించాలి. కందకాల ద్వారా ఎక్కువ నీటిని భూమిలోకి ఇంకింపజేసుకుంటేనే పంటలు, ముఖ్యంగా ఉద్యాన తోటలు బాగుంటాయని గుర్తించమని ఈ అధ్యయనం చెబుతోంది. -
గొంతెండిన కేప్‌టౌన్
గుక్కెడు మంచినీటి కోసం మున్ముందు ప్రపంచ ప్రజానీకం పడబోయే కష్టాలెలా ఉంటాయో దక్షిణాఫ్రికా నగరం కేప్‌టౌన్ శాంపిల్‌గా చవిచూపిస్తోంది. అభివృద్ధి పేరిట నేల విడిచి ఆకాశం వైపు దూసుకెళ్తున్న నగరాలకు భవిష్యత్తులో ఇలాగే చుక్కలు కనబడటం ఖాయమని ఆ నగర పౌరులు పడుతున్న ఆప సోపాలు చూస్తే అర్ధమవుతుంది. ఇప్పటికే నగరంలో రేషన్ మొదలైంది. మనిషికి 50 లీటర్ల చొప్పున ఇచ్చే నీటితో కాలక్షేపం చేస్తున్న నగర పౌరులు మరో మూడు నెలల్లో మరిన్ని ఇబ్బందులు పడకతప్పదని అధికారులు చెబుతున్నారు. మే 11ను వారు ‘జీరో డే’గా ప్రకటించారు. ఆ రోజు మొదలుకొని కేప్‌టౌన్‌లోని 40 లక్షలమంది పౌరుల ఇళ్లకూ, వ్యాపార సంస్థలకూ నల్లాల ద్వారా నీటి సరఫరా నిలిచిపోతుంది. పౌరులందరూ నగరంలో ఏర్పాటయ్యే 200 నీటి కేంద్రాల వద్ద బారులు తీరి నిలబడి నీళ్లు పట్టుకోవాల్సివస్తుంది. అప్పటినుంచీ మనిషికి కేవలం 25 లీటర్ల నీటిని మాత్రమే ఇస్తారు. తెల్లారింది మొదలుకొని రాత్రి నిద్రపోయేవరకూ ప్రతి ఒక్కరూ ఈ నీటితోనే తమ సమస్త అవసరాలనూ తీర్చుకోవాలి. ప్రపంచవ్యాప్తంగా 2022 నాటికల్లా నీటి వనరులన్నీ యుద్ధాలకు వనరులుగా మారబోతున్నాయని అయిదారేళ్లక్రితం అమెరికా ఇంటెలిజెన్స్ సంస్థ అంచనా వేసింది. ఎత్తయిన భవంతుల్ని, కళ్లు జిగేల్మనేలా విద్యుత్ దీప కాంతుల్ని, వాహనాలు శరవేగంతో దూసుకెళ్లడానికి వీలయ్యే రోడ్లనూ పరిచి, అక్కడ సమస్తమూ కేంద్రీకరించి ఆ నగరాలను అభివృద్ధి నమూనాలుగా, తమ ఘనతగా చాటే పాలకులు కళ్లు తెరవక తప్పదని కేప్‌టౌన్ అనుభవం చెబుతోంది. దక్షిణ అట్లాంటిక్ మహా సముద్ర తీరాన ఉండే కేప్‌టౌన్ సాధారణ నగరం కాదు. నల్లజాతి ప్రజల మహానాయకుడు నెల్సన్ మండేలాను దీర్ఘకాలం బందీగా ఉంచిన కారాగారం ఆ నగరంలోనిదే. దేశంలో ప్రధాన నగరం జోహ న్నెస్‌బర్గ్ అయినా ప్రపంచంలోని సంపన్నుల కళ్లన్నీ కేప్టౌన్పైనే ఉంటాయి. ఏటా ప్రపంచం నలుమూలలనుంచీ ఆ నగరానికి 16 లక్షలమంది సందర్శకులు వస్తుంటారు. వారు అక్కడ చేసే ఖర్చు 330 కోట్ల డాలర్ల(రూ.21,000 కోట్ల) పైమాటే. ఆకాశాన్నంటే అయిదు నక్షత్రాల హోటళ్లు, బీచ్‌లు, కేబుల్ కార్లు, ప్రపంచం మూల మూలలనుంచీ తరలివచ్చిన రకరకాల వినియోగవస్తువులతో కొలువు దీరే మహా దుకాణ సముదాయాలు, సైకిల్ రేసులు, క్రికెట్ మొదలుకొని రగ్బీ వరకూ తరచుగా జరిగే జాతీయ, అంతర్జాతీయ క్రీడలు పర్యాటకులకు మంచి కాలక్షేపాన్నిస్తాయి. నగరానికి దగ్గర్లో సముద్ర గర్భాన ఉండే రాబెన్ ద్వీపానికి రాత్రి, పగలు తేడాలేకుండా పడవల్లో రాకపోకలు సాగించే జనాన్ని చూసి తీరాల్సిందే. కేప్‌టౌన్ ప్రధాన ఓడరేవున్న నగరం కూడా. ఇంత హడావుడి నగరం కనుక అక్కడికి పొట్టపోసుకొనేందుకొచ్చే వలస జనం కూడా ఎక్కువే. డబ్బే సర్వస్వమైన ఆ నగరం ఇప్పుడు నీటి చుక్కకు కటకటలాడే దుస్థితి తలె త్తడాన్ని సహజంగానే జీర్ణించుకోలేకపోతోంది. ఇదెక్కడో ఏర్పడ్డ సంక్షోభమని కొట్టి పారేయడానికి లేదు. మన నగరాల తలుపు తట్టే రోజు ఎంతో దూరంలో లేదు. రాబోయే రోజుల్లో నీటి సంక్షోభాన్ని ఎదుర్కొనబోతున్న నగరాల జాబితాను ఈమధ్యే బీబీసీ ప్రకటించింది. అందులో బ్రెజిల్ ఆర్థిక రాజధాని సావోపావ్లో మొదటి స్థానంలో ఉంటే ఆ తర్వాత నగరం బెంగళూరే. బీజింగ్, కైరో, మాస్కో తదుపరి స్థానాల్లో ఉన్నాయి. ఈ నగరాలన్నీ చెప్పుకోవడానికి ‘శరవేగంగా’ అభివృద్ధి చెందుతున్న నగరాలే. వాటి ద్వారా ప్రభుత్వాలకు లభిస్తున్న ఆదాయం సైతం భారీగానే ఉంటున్నది. కానీ అక్కడికి చేరుతున్న జనాభాకు అవసరమైన జల వనరులు ఆ నగరాలకు అందుబాటులో లేవు. వెనకా ముందూ చూసుకోకుండా అభివృద్ధినంతటినీ ఒకేచోట కేంద్రీకరించడం వల్ల తలెత్తిన సమస్య ఇది. బెంగళూరుకు నీటి సమస్య కొత్తగాదు. అక్కడ సమస్య ఉన్నట్టు ప్రభుత్వాలు సైతం గుర్తించి దశాబ్దాల వుతోంది. అయినా ఎవరికీ చీమ కుట్టినట్టయినా లేకపోయింది. పాలకులు హ్రస్వ దృష్టితో వ్యవహరించారు. అడవుల్ని విచక్షణారహితంగా నాశనం చేస్తుంటే, కొండల్ని పిండి చేస్తుంటే వానలు పడటం తగ్గుతుందని, కరువు రాజ్యమేలుతుందని పర్యావరణవాదులు హెచ్చరిస్తున్నా పెడచెవిన పెట్టారు. పైపెచ్చు అభివృద్ధి మాటున తామే సహజ సంపదను ధ్వంసం చేసే పనికి పూనుకున్నారు. కరువు కాటకాల వల్ల నదులు చిక్కిపోతున్నాయి. పారినంత మేరా అనేక వ్యర్థాల బారిన పడి అవి కాలుష్యమయమవుతున్నాయి. ఇక నగర జనాభాకు నీటి లభ్యత అడుగంటడంలో ఆశ్చర్యమేముంది? భూ ఉపరితలంపై నీటి వాటా 70 శాతమైతే 30 శాతం మాత్రమే భూభాగం. ఇంత పుష్కలంగా నీరున్నా అందులో తాగడానికి పనికొచ్చేది 3 శాతం మాత్రమే. ప్రపంచ జనాభా 760 కోట్లయితే అందులో కోటిమందికి అసలు మంచినీటి సదుపాయమే లేదు. మరో 270 కోట్లమంది ఏటా కనీసం నెలరోజులపాటు చాలి నంత నీరు లభ్యంకాక సతమతమవుతున్నారు. ప్రపంచంలోని 500 మహా నగరాలు మున్ముందు నీటి ఇబ్బందుల్లో పడతాయని నాలుగేళ్ల క్రితం వెలువడిన సర్వే అంచనా వేసింది. ప్రతి నాలుగు నగరాల్లోనూ ఒకటి మంచినీటి వెతల్ని ఎదుర్కొనవలసి వస్తుందని ఆ సర్వే అంటున్నది. ఇప్పటికైనా ప్రభుత్వాలు మేల్కొని తమ అభివృద్ధి నమూనాలను సమీక్షించుకోనట్టయితే ప్రమాదకర పర్య వసానాలు ఏర్పడటం ఖాయం. ఈ విషయంలో తెలంగాణ ప్రభుత్వాన్ని అన్ని రాష్ట్రాలూ ఆదర్శంగా తీసుకోవాలి. 2020 నాటికి ఆ రాష్ట్రంలోని 46,530 చెరు వుల్ని, సరస్సుల్ని పునరుద్ధరించాలన్న సంకల్పంతో 2015లో ప్రారంభించిన ‘మిషన్ కాకతీయ’ అనుకున్నట్టు విజయం సాధిస్తే ఇటు మంచినీటి కొరతనూ తీరుస్తుంది. అటు సాగునీటి లభ్యతనూ పెంచుతుంది. ఇది అనుసరణీయమైన మార్గం. ముప్పు ముంచుకొచ్చే వరకూ పట్టనట్టు ఉంటే ఇప్పుడు కేప్‌టౌన్ వాసులు ఎదుర్కొంటున్న దుస్థితే అందరికీ దాపురిస్తుంది. బహుపరాక్!! -
నాసా పరిశోధన: మంగళూర్‌కే ముంపు
-
నాసా సంచలనం.. మునిగేది మన నగరమే!
వాషింగ్టన్ : గ్లోబల్ వార్మింగ్ మూలంగా ధ్రువాలలోని మంచు ఫలకాలు కరిగిపోయి తీర ప్రాంతాలు ముంపునకు గురయ్యే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నాసా పరిశోధనలో తేలిన సంచలన విషయం ఏంటంటే... ఆ ప్రభావం ఎక్కువగా చూపించబోయేది మన నగరంపైనేనంటా. గ్రెడియంట్ ఫింగర్‌ప్రింట్ మ్యాపింగ్(జీఎఫ్ఎం) పేరిట ఈ మధ్యే నాసా ఓ కొత్త పరికరాన్ని కనిపెట్టింది. దాని ద్వారా ఏయే ప్రాంతాల్లో ముంపు ప్రభావం ఎక్కువగా ఉండబోతుందని అంచనా వేస్తోంది. గ్రీన్లాండ్, అంటార్కిటికాలో మంచు శిలలు కరిగిపోతే న్యూయార్క్, లండన్, ముంబై లాంటి మహానగరాల వాటిల్లే ముప్పు కంటే మంగళూర్‌కే ముంపు తీవ్రత ఎక్కువగా పొంచి ఉందంట. సుమారు 293 పోర్టు పట్ణణాలను పరిశోధించిన నాసా ఈ నివేదికను విడుదల చేసింది. గ్రీన్ లాండ్ ఉత్తరాది, తూర్పు వైపున ఉన్న మంచుపొరలు కరిగిపోయి న్యూయార్క్ పట్టణానికి ఏర్పడే ప్రమాదం కన్నా... మంగళూరుకు ఏర్పడే ముప్పు ఎక్కువగా ఉందని తేలింది. వీటితోపాటు కరాచీ, చిట్టాగాంగ్, కొలంబో పట్టణాలకు కూడా మునిగిపోయే ప్రమాదం ఉందని నాసా హెచ్చరిస్తోంది. -
సిటీని వణికించిన చినుకు దాడి
* హైదరాబాద్ అతలాకుతలం * ఏప్రిల్‌లో రికార్డు వర్షపాతం * నీట మునిగిన లోతట్టు ప్రాంతాలు * విద్యుత్ సరఫరా, ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం * గ్లోబల్ వార్మింగ్, అల్పపీడన ద్రోణి ప్రభావం * 6.1 సెంటీమీటర్లు: నగరంలో 78 ఏళ్ల తరువాత ఏప్రిల్ నెలలో ఒకరోజు వర్షపాతం * 6.07 సెంటీమీటర్లు: 1937, ఏప్రిల్ 20న వర్షపాతం హైదరాబాద్‌లో రికార్డు స్థాయి వర్షపాతం నమోదైంది. గత 36 గంటల్లో 8.1 సెంటీమీటర్ల మేర భారీ వర్షం పడింది. ఆదివారం ఉదయం నుంచి సోమవారం ఉదయం వరకు 24 గంటల్లోనే 6.1 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. గత 78 ఏళ్లలో వేసవిలో ఈ స్థాయిలో వర్షం పడటం ఇదే తొలిసారి. గ్లోబల్ వార్మింగ్ ప్రభావం, అరేబియా, బంగాళాఖాతం నుంచి వీస్తున్న బలమైన తేమగాలులు, ఛత్తీస్‌గఢ్ నుంచి రాష్ర్టం మీదుగా ఏర్పడిన అల్పపీడన ద్రోణి ప్రభావంతో అకాల వర్షాలు కురుస్తున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. 4 రోజులుగా నగరంలో వర్షాలు పడుతున్నాయి. సోమవారం కూడా కుండపోత కురిసింది. ప్రధాన రహదారులపై మోకాళ్ల లోతున వరద నీరు ప్రవహించడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. పలు ప్రాంతాల్లో ఫీడర్లు ట్రిప్పయి, విద్యుత్ తీగలు తెగిపడి గంటల తరబడి కరెంట్ సరఫరా నిలిచిపోయింది. జీహెచ్ఎంసీ అత్యవసర బృందాలను అప్రమత్తం చేసినప్పటికీ రాత్రివేళ సహాయ కార్యక్రమాలకు ఆటంకం కలిగింది. కాగా, ఐదు రోజులుగా కురుస్తున్న వర్షాలకు గ్రేటర్ పరిధిలోని జంట జలాశయాలు హిమాయత్‌సాగర్, ఉస్మాన్‌సాగర్(గండిపేట్)లోకి స్వల్పంగా వరద నీరు చేరింది.