
గ్లోబల్ వార్మింగ్‌తో ప్రళయం ముంచుకొస్తోందంటూ నలువైపుల నుంచి హెచ్చరికలు వినిపిస్తున్నా మనిషిలో మార్పు రావడం లేదు. క్రమంగా పెరుగుతున్న భూతాపంతో మంచు కొండలు వేగంగా అంతరించిపోతున్నాయి. ఉష్ణోగ్రతల ధాటికి గ్లేసియర్లు కరిగిపోతున్నాయి. వందేళ్లలో ఓ పెద్ద గ్లేసియర్‌లో చోటు చేసుకున్న మార్పులను తెలియజేస్తూ ఐఎఫ్‌ఎస్ అధికారి సుధా రామన్ ట్విట్టర్‌లో పోస్టు చేసిన ఫోటో వైరల్‌గా మారింది.
రష్యాలోని స్వాల్‌బార్డ్‌లోని మంచు కొండల దగ్గర 103 ఏళ్ల గ్యాప్‌లో తీసిన రెండు ఫోటోలను పోస్ట్ చేశారు సుధా రామన్. మొదటి ఫోటోలో ఎత్తైన మంచు కొండలు ఉండగా... తర్వాత తీసిన ఫోటోలో మంచు కొండలు దాదాపుగా కరిగిపోయిన ఉన్నాయి.
Two photos taken at the same spot with a 103 years difference. What do you see here? pic.twitter.com/rcSCnEgrj0
— Sudha Ramen IFS 🇮🇳 (@SudhaRamenIFS) June 16, 2021