వన్డే ప్రపంచకప్-2023లో భాగంగా ఆస్ట్రేలియాతో జరగుతున్న ఫైనల్లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. మరోసారి జట్టుకు అద్బుతమైన ఆరంభాన్ని ఇచ్చాడు. కేవలం 31 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్‌లతో 47 పరుగులు చేశాడు. భారత ఇన్నింగ్స్ 10 ఓవర్‌లో మాక్స్‌వెల్ బౌలింగ్‌లో భారీ షాట్‌కు ప్రయత్నించిన హిట్‌మ్యాన్.. హెడ్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు.
కాగా ఈ మెగా టోర్నీలో రోహిత్ శర్మ ఓవరాల్‌గా 597 పరుగులు సాధించాడు. తద్వారా ఓ అరుదైన ఘనతను రోహిత్ తన పేరిట లిఖించుకున్నాడు.వరల్డ్‌కప్ సింగిల్ ఎడిషన్‌లో అత్యధిక పరుగులు చేసిన కెప్టెన్‌గా రోహిత్ శర్మ నిలిచాడు.
ఇప్పటివరకు ఈ రికార్డు న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ పేరిట ఉండేది. 2019 వరల్డ్‌కప్‌లో విలియమ్సన్ 578 పరుగులు చేశాడు. తాజా మ్యాచ్‌తో కేన్ మామ ఆల్‌టైమ్ రికార్డును హిట్‌మ్యాన్ బ్రేక్ చేశాడు.
చదవండి: World Cup 2023 Final: చెత్త షాట్ ఆడి ఔటైన శుబ్‌మన్ గిల్.. కోపంతో చూసిన రోహిత్! వీడియో వైరల్
Most runs by captains in a World Cup:
— Kausthub Gudipati (@kaustats) November 19, 2023
597 - ROHIT SHARMA🇮🇳 in 2023
578 - Kane Williamson🇳🇿 in 2019
548 - Mahela Jayawardene🇱🇰 in 2007#CWC2023 #INDvsAUSfinal pic.twitter.com/PJ8utlco09
Comments
Please login to add a commentAdd a comment