పాకిస్తాన్ మాజీ కెప్టెన్ మహ్మద్ హఫీజ్‌కు ఆ దేశ క్రికెట్ బోర్డు కీలక బాధ్యతలు అప్పగించింది. పాకిస్తాన్ పురుషుల క్రికెట్ జట్టు డైరెక్టర్‌గా హాఫీజ్‌ను పీసీబీ నియమించింది. ఇప్పటివరకు ఆ జట్టు డైరెక్టర్‌గా పనిచేసిన మిక్కీ ఆర్థర్ స్ధానాన్ని హాఫీజ్ భర్తీ చేయనున్నాడు. కాగా ప్రపంచకప్‌లో ఘోర వైఫల్యంతో విదేశీ కోచింగ్ స్టాఫ్ మొత్తాన్ని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు తొలిగించింది.
ఇప్పటికే మోర్నీ మోర్కెల్ బౌలింగ్ కోచ్ పదవికి రాజీనామా చేయగా.. తాజాగా మిక్కీ ఆర్థర్‌పై పీసీబీ వేటు వేసింది. ఈ క్రమంలోనే టెక్నికల్ కమిటీలో సభ్యునిగా ఉన్న హాఫీజ్‌కు టీమ్ డైరెక్టర్‌గా పీసీబీ ప్రమోషన్ ఇచ్చింది. అదేవిధంగా కొత్త కోచింగ్ స్టాప్‌ను పీసీబీ త్వరలోనే ప్రకటించనుంది. మాజీ కెప్టెన్ మహ్మద్ హఫీజ్ పాకిస్తాన్ పురుషుల క్రికెట్ జట్టు డైరెక్టర్‌గా బాధ్యతలు చేపట్టాడు.
పాకిస్తాన్ కోచింగ్ స్టాఫ్ పోర్ట్‌ఫోలియోను పీసీబీ మార్చింది. ప్రస్తుతం ఉన్న కోచ్‌లు అందరూ కూడా నేషనల్ క్రికెట్ అకాడమీలో పనిచేస్తారు. వారిలో కొంతమందిని జట్టు కోసం ఎంపిక చేస్తుంది. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ సిరీస్‌లకు త్వరలోనే మా కొత్త కోచింగ్ స్టాప్‌ను ప్రకటించనున్నామని పీసీబీ ఒక ప్రకటనలో పేర్కొంది.
పాకిస్తాన్ తరఫున హఫీజ్ 55 టెస్టులు, 218 వన్డేలు, 119 టీ20లు ఆడాడు. మూడు ఫార్మాట్‌ల్లో కలిపి 12,780 పరుగులు చేయడంతోపాటు 253 వికెట్లు కూడా సాధించాడు. కాగా ఇప్పటికే పాకిస్తాన్ కెప్టెన్సీకి బాబర్ ఆజం గుడ్‌బై చెప్పిన సంగతి తెలిసిందే.
టీ20ల్లో పాకిస్తాన్ కొత్త కెప్టెన్‌గా షాహీన్ అఫ్రిది ఎంపిక కాగా.. టెస్టు సారథిగా షాన్ మసూద్ నియమితుడయ్యాడు. కాగా ఈ ఏడాది డిసెంబర్‌లో పాకిస్తాన్ టెస్టు సిరీస్ ఆడేందుకు ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లనుంది. అయితే హెడ్‌కోచ్ లేకుండానే ఆసీస్ పర్యటను పాక్ జట్టు వెళ్లనుంది. ఈ క్రమంలో జట్టు డైరక్టర్‌గా ఉన్న హఫీజ్ హెడ్‌కోచ్‌గా వ్యవహరించనున్నాడు.
చదవండి: World Cup 2023: ఇదేమి బ్యాటింగ్ రా బాబు.. అందుకే 'చోకర్స్' ట్యాగ్ లైన్
Comments
Please login to add a commentAdd a comment