వన్డే ప్రపంచకప్-2023లో పాకిస్తాన్ వరుసగా నాలుగో మ్యాచ్‌లో ఓటమి చవిచూసింది. ధర్మశాల వేదికగా శుక్రవారం దక్షిణాఫ్రికాతో జరిగిన కీలక మ్యాచ్‌లో ఒక్క వికెట్ తేడాతో పాక్ ఓటమి పాలైంది. దీంతో పాకిస్తాన్ సెమీస్ ఆశలు గల్లంతు అయ్యాయి.
కాగా ఈ మ్యాచ్‌లో మాత్రం పాకిస్తాన్ ఆఖరి వరకు అద్భుతంగా పోరాడింది. కానీ చివరకు విజయం మాత్రం ప్రోటీస్‌నే వరించింది. ఈ నేపథ్యంలో మిగిలిన మూడు మ్యాచ్‌ల్లో గెలిచినా పాక్ సెమీస్ చేరే అవకాశం ఐదు శాతమే ఉంది.
ఈ క్రమంలో పాకిస్తాన్ మాజీ వికెట్ కీపర్ రషీద్ లతీఫ్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. గత ఐదు నెలలుగా ఆటగాళ్లకు జీతం చెల్లించడం లేదని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు జీతాలు చెల్లించడం లేదని లతీఫ్ ఆరోపించాడు. అదే విధంగా పీసీబీ నుంచి ఆటగాళ్లకు ఎటువంటి సపోర్ట్ కూడా లేదని ఆయన చెప్పుకొచ్చాడు. కాగా అంతకుముందు పాక్ డ్రెస్సింగ్ రూమ్‌లో విభేదాలు ఉన్నాయని పాకిస్తాన్ మీడియాలో తెగ వార్తలు వచ్చాయి.
ఈ నేపథ్యంలో పీటీవీతో లతీఫ్ మాట్లాడుతూ.. “పాకిస్తానీ మీడియాలో చాలా విషయాలు చక్కెర్లు కొడుతున్నాయి. అవన్నీ తప్పుడు వార్తలే. మీకు అస్సలు నిజాలను నేను చెబుతాను. గత రెండు రోజులుగా పీసీబీ చైర్మన్ జాకా అష్రఫ్‌తో మాట్లాడేందుకు బాబర్ ఆజం ప్రయత్నిస్తున్నాడు. కానీ అతడు స్పందించడం లేదు.
బాబర్ పీసీబీ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ సల్మాన్ నసీర్, డైరెక్టర్ ఉస్మాన్ వాల్హాలకు కూడా ఆజం మెసేజ్ చేశాడు. వారు కూడా అతడికి రిప్లే ఇవ్వలేదు. అస్సలు కెప్టెన్ కాల్ చేస్తే ఎందుకు స్పందించడం లేదు? అందుకు కారణం ఏమిటి? పాకిస్తాన్ క్రికెట్ బోర్డులో ఏదో జరుగుతోంది" అంటూ పేర్కొన్నాడు.
అదే విధంగా ఆటగాళ్ల సెంట్రల్ కాంట్రాక్టులు గురించి లతీప్ మాట్లాడుతూ.. "వరల్డ్‌కప్‌కు ముందు ఆటగాళ్లు సంతకం చేసిన సెంట్రల్ కాంట్రాక్టులను పునఃపరిశీలిస్తామని పీసీబీ చెప్పింది. దీంతో సెంట్రల్ కాంట్రాక్ట్‌ల ఒప్పందం ఇంకా ఒక కొలిక్కి కాలేదు. ఈ క్రమంలో గత ఐదు నెలలుగా ఆటగాళ్లకు జీతాలు అందలేదు.
అటువంటిప్పుడు వారు ఎలా ఆడుతారు? నేను ఈ విషయాన్ని మరి పెద్దది చేయాలని అనుకోవడం లేదని చెప్పుకొచ్చాడు. కాగా ఈ ఏడాది సెప్టెంబర్‌లో ఆటగాళ్లు పాకిస్తాన్ క్రికెట్‌బోర్డు సెంట్రల్ కాంట్రాక్ట్‌లను ఇచ్చింది. మెన్స్ టీమ్‌లోని క్రికెటర్లతో మూడేళ్ల ఒప్పందానికి గానూ అంతర్జాతీయ క్రికెట్ మండలి ద్వారా లభించే ఆదాయంలో మూడు శాతం మేర చెల్లించేందుకు అంగీకరించింది. కానీ కొన్ని రోజుల తర్వాత ఈ విషయాన్ని పునఃపరిశీలిస్తామని పీసీబీ ఓ ప్రకటనలో తెలిపింది.
చదవండి: World Cup 2023: ట్రావిస్ హెడ్ విధ్వంసకర సెంచరీ.. వరల్డ్‌కప్ అరంగేట్రంలోనే!
Comments
Please login to add a commentAdd a comment