CWC 2023: ఉత్కంఠ పోరులో దక్షిణాఫ్రికా ఓటమి.. ఫైనల్లో ఆస్ట్రేలియా | CWC 2023 SA vs Aus 2nd Semi Final Toss Playing XI Updates Highlights - Sakshi
Sakshi News home page

CWC 2023 2nd Semi Final: ఉత్కంఠ పోరులో దక్షిణాఫ్రికా ఓటమి.. ఫైనల్లో ఆస్ట్రేలియా

Published Thu, Nov 16 2023 1:59 PM | Last Updated on Thu, Nov 16 2023 10:18 PM

CWC 2023 2nd Semi Final SA vs Aus Toss Playing XI Updates Highlights - Sakshi

ICC Cricket World Cup 2023 - South Africa vs Australia:  వన్డే వరల్డ్‌కప్‌-2023 ఫైనల్లో ఆస్ట్రేలియా అడుగుపెట్టింది. ఈడెన్‌ గార్డెన్స్‌ వేదికగా ఉత్కంఠ భరితంగా సాగిన రెండో సెమీఫైనల్లో దక్షిణాఫ్రికాపై 3 వికెట్ల తేడాతో ఆసీస్‌ విజయం సాధించింది. తద్వారా 8వ సారి వరల్డ్‌కప్‌ ఫైనల్‌ బెర్త్‌ను ఆసీస్‌ ఖారారు చేసుకుంది.

213 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన ఆసీస్‌.. 47.2 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి ఛేదించింది. కెప్టెన్‌ ప్యాట్‌ కమ్మిన్స్‌ ఫోర్‌ కొట్టి తన జట్టుకు అద్బుతమైన విజయాన్ని అందించాడు. ఆస్ట్రేలియా బ్యాటర్లలో ఓపెనర్‌ ట్రావిస్‌ హెడ్‌(62) పరుగులతో టాప్‌ స్కోరర్‌గా నిలవగా.. స్మిత్‌(30), ఇంగ్లీష్‌(28) కీలక ఇన్నింగ్స్‌లు ఆడారు. ఇక దక్షిణాఫ్రికా బౌలర్లు మాత్రం అద్బుతమైన పోరాట పటిమ కనబరిచారు.

వరుసక్రమంలో వికెట్లు పడగొడుతూ ఆసీస్‌ను బ్యాక్‌ఫుట్‌లో ఉంచారు. కానీ చివరకి విజయం మాత్రం కంగారులనే వరించింది. దక్షిణాఫ్రికా బౌలర్లలో షమ్సీ, కొయెట్జీ తలా రెండు వికెట్లు సాధించగా.. మహారాజ్‌, రబాడ, మార్‌క్రమ్‌ తలా వికెట్‌ సాధించారు. ఇక ఆక్టోబర్‌ 19న అహ్మదాబాద్‌ వేదికగా జరగనున్న ఫైనల్లో టీమిండియాతో ఆస్ట్రేలియా తలపడనుంది.

ఇంగ్లీష్‌ ఔట్‌.. తిరిగి గేమ్‌లోకి దక్షిణాఫ్రికా
193 పరుగుల వద్ద ఆస్ట్రేలియా ఏడో వికెట్‌ కోల్పోయింది. 28 పరుగులు చేసిన ఇంగ్లీష్‌ను కొయెట్జీ క్లీన్‌ బౌల్డ్‌ చేశాడు. దీంతో ప్రోటీస్‌ తిరిగి మళ్లీ పోటోలోకి వచ్చింది.  ఆసీస్‌ విజయానికి 19 పరుగులు కావాలి.

విజయం దిశగా ఆసీస్‌..
దక్షిణాఫ్రికాతో రెండో సెమీఫైనల్లో ఆస్ట్రేలియా విజయం దిశగా అడుగులు వేస్తోంది. ఆసీస్‌ గెలుపుకు 72 బంతుల్లో 25 పరుగులు కావాలి. క్రీజులో ఇంగ్లీష్‌(27), మిచెల్‌ స్టార్క్‌(6) ఉన్నారు.

ఉత్కంఠగా సెమీఫైనల్‌-2
ఈడెన్‌గార్డెన్స్‌ వేదికగా దక్షిణాఫ్రికా-ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న రెండో సెమీఫైనల్‌ ఉత్కంఠగా మారింది. క్రీజులో నిలదొక్కుకున్న స్టీవ్‌ స్మిత్‌ను కొయెట్జీ పెవిలియన్‌కు పంపాడు. దీంతో సఫారీలు మళ్లీ మ్యాచ్‌లోకి వచ్చారు. ఆసీస్‌ విజయానికి ఇంకా 38 పరుగులు కావాలి. క్రీజులో ఇంగ్లీష్‌(19), మిచెల్‌ స్టార్క్‌(1) ఉన్నారు.

ఐదో వికెట్‌ డౌన్‌.. మాక్స్‌వెల్‌ ఔట్‌
దక్షిణాఫ్రికా స్పిన్నర్లు అద్బుతంగా బౌలింగ్‌ చేస్తున్నారు. డేంజరస్‌ మాక్స్‌వెల్‌ను తబ్రేజ్ షంషి క్లీన్‌ బౌల్డ్‌ చేశాడు. ఆసీస్‌ విజయానికి 25 ఓవర్లలలో 72 పరుగులు కావాలి. క్రీజులో స్మిత్‌, ఇంగ్లీష్‌ ఉన్నారు.

నాలుగో వికెట్‌ డౌన్‌.. 
113 పరుగుల వద్ద ఆస్ట్రేలియా నాలుగో వికెట్‌ కోల్పోయింది. 18 పరుగులు చేసిన లబుషేన్‌.. షంస్సీ బౌలింగ్‌లో ఔటయ్యాడు. ఆసీస్‌ విజయానికి 79 పరుగులు కావాలి. క్రీజులోకి మాక్స్‌వెల్‌ వచ్చాడు.

ఆసీస్‌ మూడో వికెట్‌ డౌన్‌..
106 పరుగుల వద్ద ఆసీస్‌ మూడో వికెట్‌ కోల్పోయింది. 62 పరుగులతో అద్బుతంగా ఆడుతున్న ట్రెవిస్‌ హెడ్‌ను కేశవ్‌ మహారాజ్‌ క్లీన్‌ బౌల్డ్‌ చేశాడు. క్రీజులోకి లబుషేన్‌ వచ్చాడు. ఆసీస్‌ విజయానికి 35 ఓవర్లలో 104 పరుగులు కావాలి.

దక్షిణాఫ్రికాతో సెమీస్‌..  ట్రావిస్‌ హెడ్‌ హాఫ్‌ సెంచరీ
ఆసీస్‌ ఓపెనర్‌ ట్రెవిస్‌ హెడ్‌ అద్భుతమైన  హాఫ్‌ సెంచరీతో చెలరేగాడు. 40 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్స్‌లతో హెడ్‌ తన హాఫ్‌ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. 12 ఓవర్లకు ఆసీస్‌ స్కోర్‌: 92/2

రెండో వికెట్‌ కోల్పోయిన ఆస్ట్రేలియా.. మార్ష్‌ ఔట్‌
ఆస్ట్రేలియాతో జరుగుతున్న సెమీఫైనల్లో దక్షిణాఫ్రికా కమ్‌బ్యాక్‌ ఇచ్చే ప్రయత్నం చేస్తోంది. 61 పరుగులు వద్ద ఆస్ట్రేలియా రెండో వికెట్‌ కోల్పోయింది. రబాడ బౌలింగ్‌లో మిచెల్‌ మార్ష్‌ ఖాతా తెరవకుండానే పెవిలియన్‌కు చేరాడు. 8 ఓవర్లకు ఆసీస్‌ స్కోర్‌: 61/2

తొలి వికెట్‌ కోల్పోయిన ఆస్ట్రేలియా..
213 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా తొలి వికెట్‌ కోల్పోయింది. 29 పరుగులు చేసిన డేవిడ్‌ వార్నర్‌.. మార్‌క్రమ్‌ బౌలింగ్‌లో క్లీన్‌ బౌల్డయ్యాడు. క్రీజులోకి మిచెల్‌ మార్ష్‌ వచ్చాడు.  7 ఓవర్లకు ఆస్ట్రేలియా స్కోర్‌: 60/1

దూకుడుగా ఆడుతున్న ఆసీస్‌ ఓపెనర్లు..
213 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా.. 4 ఓవర్లు ముగిసే సరికి వికెట్‌ నష్టపోకుండా 24 పరుగులు చేసింది. క్రీజులో ఓపెనర్లు డేవిడ్‌ వార్నర్‌(11), హెడ్‌(9) పరుగులతో ఉన్నారు.

మిల్లర్‌ విరోచిత శతకం.. ఆస్ట్రేలియా టార్గెట్‌ 213 పరుగులు
ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో సెమీఫైనల్లో తొలుత బ్యాటింగ్‌ చేసిన దక్షిణాఫ్రికా నామమాత్రపు స్కోర్‌కే పరిమితమైంది. దక్షిణాఫ్రికా  49. 4 ఓవర్లలో 212 పరుగులకు ఆలౌటైంది. దక్షిణాఫ్రికా గౌరవప్రదమైన స్కోర్‌ సాధించడం‍లో డేవిడ్‌ మిల్లర్‌ కీలక​ పాత్ర పోషించాడు.

మిల్లర్‌ విరోచిత శతకంతో చెలరేగాడు. 116 బంతుల్లో 8 ఫోర్లు, 5 సిక్స్‌లతో 101 పరుగులు చేసి  జట్టుకు ఫైటింగ్‌ స్కోర్‌ను అందించాడు.  24 పరుగులు 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన ప్రోటీస్‌ను మిల్లర్‌, క్లాసెన్‌(47) అదుకున్నారు.  క్లాసెన్‌ ఔటైన తర్వాత  మిల్లర్‌  పూర్తి బాధ్యతను తన భుజాన వేసుకున్నాడు. ఇక ఆస్ట్రేలియా బౌలర్లలో స్టార్క్‌, కమ్మిన్స్‌ 3వికెట్లు పడగొట్టగా.. హాజిల్‌వుడ్‌, హెడ్‌ తలా రెండు వికెట్లు సాధించారు

 డేవిడ్‌ మిల్లర్‌ సెంచరీ
దక్షిణాఫ్రికా మిడిలార్డర్‌ బ్యాటర్‌ డేవిడ్‌ మిల్లర్‌ విరోచిత శతకంతో చెలరేగాడు. 24 పరుగులు 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన జట్టును తన అద్భుత ఇన్నింగ్స్‌ మిల్లర్‌ అదుకున్నాడు. 116 బంతుల్లో 8 ఫోర్లు, 5 సిక్స్‌లతో 101 పరుగులు చేసి ఔటయ్యాడు. 48 ఓవర్లకు దక్షిణాఫ్రికా స్కోర్‌: 203/9

ఎనిమిదో వికెట్‌ డౌన్‌..
191 పరుగుల వద్ద దక్షిణాఫ్రికా ఎనిమిదో వికెట్‌ కోల్పోయింది. 4 పరుగులు చేసిన కేశవ్‌ మహారాజ్‌.. స్టార్క్‌ బౌలింగ్‌లో ఔటయ్యాడు. 47 ఓవర్లకు దక్షిణాఫ్రికా స్కోర్‌: 196/8

ఏడో వికెట్‌ డౌన్‌..
172 పరుగుల వద్ద దక్షిణాఫ్రికా ఏడో వికెట్‌ కోల్పోయింది. 19 పరగులు చేసిన గెరాల్డ్ కోయెట్జీ.. కమ్మిన్స్‌ బౌలింగ్‌లో పెవిలయన్‌కు చేరాడు. 44 ఓవర్లు దక్షిణాఫ్రికా స్కోర్‌: 174/7

40 ఓవర్లలో సౌతాఫ్రికా స్కోరు: 156/6
మిల్లర్‌ 67, కోయెట్జీ 18 పరుగులతో క్రీజులో ఉన్నారు.

38 ఓవర్లలో సౌతాఫ్రికా స్కోరు: 149-6
మిల్లర్‌ 66, కోయెట్జీ 16 పరుగులతో క్రీజులో ఉన్నారు.

మిల్లర్‌ హాఫ్‌ సెంచరీ
31.3: మాక్స్‌వెల్‌ బౌలింగ్‌లో ఫోర్‌ బాది ఫిఫ్టీ పూర్తి చేసుకున్న మిల్లర్‌

వరుసగా రెండు వికెట్లు కోల్పోయిన సౌతాఫ్రికా
30.5: హెడ్‌ బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగిన మార్కో జాన్సెన్‌. ఆరో వికెట్‌ కోల్పోయిన సౌతాఫ్రికా. కొయోట్జీ క్రీజులోకి వచ్చాడు.

క్లాసెన్‌ బౌల్డ్‌
30.4: నిలకడగా సాగుతున్న సౌతాఫ్రికా ఇన్నింగ్స్‌కు ట్రవిస్‌ హెడ్‌ బ్రేక్‌ వేశాడు. 47 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఉన్న క్లాసెన్‌ను అద్భుత రీతిలో బౌల్డ్‌ చేశాడు. దీంతో ప్రొటిస్‌ జట్టు ఐదో వికెట్‌ కోల్పోయింది. కాగా మిల్లర్‌తో కలిసి క్లాసెన్‌ 95 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. సౌతాఫ్రికా స్కోరు: 

27 ఓవర్లలో సౌతాఫ్రికా స్కోరు: 95/4
►26.4: మరో సిక్స్‌ కొట్టిన క్లాసెన్‌
►26.3: జంపా బౌలింగ్‌లో సిక్సర్‌ బాదిన క్లాసెన్‌

సగం ఇన్నింగ్స్‌ ముగిసే సరికి ప్రొటిస్‌ ఇలా
క్లాసెన్‌, మిల్లర్‌ 79 బంతుల్లో 55 పరుగుల భాగస్వామ్యం నమోదు చేశారు. క్లాసెన్‌ 22, మిల్లర్‌ 33 పరుగులతో క్రీజులో ఉన్నారు. 25 ఓవర్లలో సౌతాఫ్రికా స్కోరు: 79/4

నిలకడగా ఆడుతున్న క్లాసెన్‌, మిల్లర్‌
►21 ఓవర్లలో సౌతాఫ్రికా స్కోరు: 68/4 (21)

►డేవిడ్‌ మిల్లర్‌ కాస్త దూకుడు పెంచాడు. 19వ ఓవర్‌ ముగిసే సరికి 28 బంతులు ఎదుర్కొని 25 పరుగులు రాబట్టాడు. మరో ఎండ్‌లో క్లాసెన్‌ నిలకడగా ఆడుతూ 13 పరుగుల వద్ద ఉన్నాడు. స్కోరు: 62-4 

మళ్లీ మొదలైన ఆట
వర్షం తెరిపినివ్వడంతో ఆట మళ్లీ మొదలైంది. 15 ఓవర్లలో సౌతాఫ్రికా స్కోరు: 46-4

వర్షం కారణంగా ఆగిన ఆట
వర్షం రావడంతో మ్యాచ్‌ను నిలిపివేశారు. వరణుడి ఆగమానికి ముందు సౌతాఫ్రికా 14 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి కేవలం 44 పరుగులు చేసింది. క్లాసెన్‌ 10, మిల్లర్‌ 10 పరుగులతో క్రీజులో ఉన్నారు. ఆస్ట్రేలియా బౌలర్లలో పేసర్లు స్టార్క్‌, హాజిల్‌వుడ్‌ చెరో రెండు వికెట్లు తీశారు.

సౌతాఫ్రికాకు షాకుల మీద షాకులు
11.5:హాజిల్‌వుడ్‌ బౌలింగ్‌లో డస్సెన్‌ అవుట్‌. డస్సెన్‌(6) రూపంలో నాలుగో వికెట్‌ కోల్పోయిన సౌతాఫ్రికా. మిల్లర్‌, క్లాసెన్‌ క్రీజులో ఉన్నారు.

మూడో వికెట్‌ కోల్పోయిన సౌతాఫ్రికా
10.5: స్టార్క్‌ బౌలింగ్‌లో మార్కరమ్‌ అవుటయ్యాడు. 10 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద నిష్క్రమించాడు.  ఇప్పటికే బవుమా, డికాక్‌ వికెట్లు కోల్పోయిన ప్రొటిస్‌.. మార్కరమ్‌ రూపంలో మరో కీలక వికెట్‌ కోల్పోవడంతో కష్టాల్లో కూరుకుపోయింది. క్లాసెన్‌, డస్సెన్‌(5) క్రీజులో ఉన్నారు. 

10.1: ప్రొటిస్‌ ఇన్నింగ్‌స్లో తొలి బౌండరీ
స్టార్క్‌ బౌలింగ్‌లో ఫోర్‌ బాదిన మార్కరమ్‌ 

పవర్‌ ప్లేలో సౌతాఫ్రికా స్కోరు: 18/2 
పవర్‌ ప్లేలో సౌతాఫ్రికా  దారుణ ప్రదర్శన కనబరిచింది. 10 ఓవర్లు ముగిసే సరికి ఓపెనర్ల వికెట్లు కోల్పోయి కేవలం 18 పరుగులు మాత్రమే చేసింది.

తొమ్మిది ఓవర్లు ముగిసే సరికి సౌతాఫ్రికా స్కోరు: 17/2
6, 7 ఓవర్లను మెయిడిన్‌ చేసిన హాజిల్‌వుడ్‌, స్టార్క్‌. సౌతాఫ్రికా స్కోరు: 8/2 (7)

5.4: రెండో వికెట్‌ కోల్పోయిన సౌతాఫ్రికా
హాజిల్‌వుడ్‌ బౌలింగ్‌లో కమిన్స్‌కు క్యాచ్‌ ఇచ్చి ఓపెనర్‌ క్వింటన్‌ డికాక్‌ పెవిలియన్‌ చేరాడు. మొత్తంగా 14 బంతులు ఎదుర్కొని కేవలం 3 పరుగులే చేసి నిష్క్రమించాడు. ఇక ఆరంభంలోనే బవుమా వికెట్‌ తీసి స్టార్క్‌ షాకివ్వగా.. కీలక వికెట్‌ పడగొట్టి హాజిల్‌వుడ్‌ కోలుకోలేని దెబ్బకొట్టాడు. మార్కరమ్‌, డస్సెన్‌ క్రీజులో ఉన్నారు. స్కోరు: 8-2(6).

కట్టుదిట్టంగా ఆసీస్‌ బౌలింగ్‌ బౌలింగ్‌
ఆస్ట్రేలియా బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేస్తున్నారు. పొదుపుగా బౌలింగ్‌ చేస్తూ పరుగులకు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా సఫారీలను కట్టడి చేస్తున్నారు. దీంతో ఐదు ఓవర్లు ముగిసే సరికి ఒక వికెట్‌ నష్టపోయిన ప్రొటిస్‌ జట్టు కేవలం 8 పరుగులు మాత్రమే చేయగలిగింది.

2 ఓవర్లు ముగిసే సరికి సౌతాఫ్రికా స్కోరు: 2/1 (2)
రాస్సీ వాన్ డర్ డస్సెన్ 0, డికాక్‌ రెండు పరుగులతో క్రీజులో ఉ‍న్నారు.

ఆసీస్‌తో సెమీస్‌.. తొలి వికెట్‌ కోల్పోయిన సౌతాఫ్రికా
►0.6: తొలి ఓవర్లోనే సౌతాఫ్రికాకు ఆసీస్‌ పేసర్‌ మిచెల్‌ స్టార్క్‌ షాకిచ్చాడు. కెప్టెన్‌ తెంబా బవుమాను డకౌట్‌గా వెనక్కి పంపాడు.
టాస్‌ గెలిచిన సౌతాఫ్రికా తొలుత బ్యాటింగ్‌ ఎంచుకుంది.

తుదిజట్లు
దక్షిణాఫ్రికా: క్వింటన్ డికాక్(వికెట్‌కీపర్‌), టెంబా బవుమా(కెప్టెన్‌), రాస్సీ వాన్ డర్ డస్సెన్, ఎయిడెన్ మార్క్రమ్, హెన్రిచ్ క్లాసెన్, డేవిడ్ మిల్లర్, మార్కో జన్సెన్, కేశవ్ మహరాజ్, గెరాల్డ్ కొయెట్జీ, కగిసో రబడ, తబ్రేజ్ షంషి

ఆస్ట్రేలియా
ట్రవిస్ హెడ్, డేవిడ్ వార్నర్, మిచెల్ మార్ష్, స్టీవెన్ స్మిత్, మార్నస్ లబూషేన్‌, గ్లెన్ మాక్స్‌వెల్, జోష్ ఇంగ్లిస్(వికెట్‌కీపర్‌), పాట్ కమిన్స్(కెప్టెన్‌), మిచెల్ స్టార్క్, ఆడమ్ జంపా, జోష్ హాజిల్‌వుడ్.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement