వరల్డ్ క్రికెట్‌లో 'చోకర్స్' అంటే మనకు టక్కున దక్షిణాఫ్రికానే గుర్తుకు వస్తుంది. ఎందుకంటే కీలకమైన మ్యాచ్‌లలో చేతులెత్తేసే నైజం సౌతాఫ్రికాది. అందుకే ప్రోటీస్ జట్టును చోకర్స్ అని పిలుస్తుంటారు. వరల్డ్‌కప్ నాకౌట్ మ్యాచ్‌ల్లో ఒత్తిడికి చిత్తు అవుతుందన్న మాటను మరోసారి దక్షిణాఫ్రికా నిజం చేసంది. వన్డే వరల్డ్‌కప్-2023లో ఈడెన్‌గార్డెన్స్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో సెమీఫైనల్లో సౌతాఫ్రికా బ్యాటర్లు దారుణ ప్రదర్శన కనబరుస్తున్నారు.
ఆసీస్ బౌలర్ల ధాటికి సఫారీలు విలవిల్లాడుతున్నారు. కేవలం 24 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి దక్షిణాఫ్రికా పీకల్లోతు కష్టాల్లో పడింది. తొలి పవర్‌లో ప్లేలో అయితే సౌతాఫ్రికా కేవలం 18 పరుగులు మాత్రమే చేసింది. లీగ్ మ్యాచ్‌ల్లో తొలుత బ్యాటింగ్ చేసినప్పుడు మెరుపులు మెరిపించిన దక్షిణాఫ్రికా.. సెమీస్‌లో మాత్రం కంగారుల ముందు తలవంచింది.
ఆసీస్ పేసర్లు మిచెల్ స్టార్క్, హాజిల్‌వుడ్ తలా రెండు వికెట్లు పడగొట్టి దక్షిణాఫ్రికాను కోలుకోలేని దెబ్బకొట్టారు. 14 ఓవర్లు ముగిసే సరికి దక్షిణాఫ్రికా 4 వికెట్లు కోల్పోయి కేవలం 44 పరుగులు మాత్రమే చేసింది. ఈ ఏడాది వరల్డ్‌కప్ లీగ్ మ్యాచ్‌ల్లో దుమ్మురేపిన సౌతాఫ్రికా.. కీలకమైన సెమీస్‌లో మాత్రం చేతులెత్తేసింది.
చదవండి: MS Dhoni: ఉత్తరాఖండ్‌లోని స్వగ్రామానికి వెళ్లిన ధోని.. ఆమె పాదాలకు నమస్కరించి..
Comments
Please login to add a commentAdd a comment