Pat Cummins's response Goes Viral: ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు కెప్టెన్ ప్యాట్ కమిన్స్‌ది ప్రేమ వివాహం. ఈ స్టార్ బౌలర్‌కు 2013లో బెకీ బోస్టన్ అనే అమ్మాయితో ఏర్పడిన పరిచయం స్నేహంగా మారింది. మనసులు కలవడంతో ప్రేమపక్షుల్లా విహరిస్తూ పరస్పరం అభిరుచులు పంచుకున్న ఈ జంట.. 2020లో నిశ్చితార్థం చేసుకుంది.
అప్పటికే సహజీవనం చేస్తున్న కమిన్స్- బెకీ 2021లో తాము తమ తొలి సంతానానికి జన్మనివ్వబోతున్నట్లు ప్రకటించారు. ఆ మరుసటి ఏడాది అంటే 2022లో వివాహ బంధంలో అడుగుపెట్టారు. కుమారుడు ఆల్బీతో కలిసి సంతోషంగా జీవితం గడుపుతున్న ఈ జంట ఎప్పుటికప్పుడు కపుల్ గోల్స్ సెట్ చేయడంలో ముందుంటారు.
గొప్ప తల్లి, భార్య, నా వాలైంటైన్
ఇక వాలంటైన్స్ డే సందర్భంగా భార్య బెకీతో కలిసి ఉన్న ఫొటోను ప్యాట్ కమిన్స్ ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నాడు. ‘‘గొప్ప తల్లి, భార్య, నా వాలైంటైన్. సర్ఫింగ్ చేయడంలోనూ దిట్ట. ప్రేమికుల దినోత్సవం శుభాకాంక్షలు బెకీ’’ అంటూ సతీమణిపై ప్రేమను కురిపించాడు.
మీ భార్యను ప్రేమిస్తున్నా
ఇందుకు స్పందించిన ఓ నెటిజన్.. ‘‘నేను భారతీయుడిని.. మీ భార్యను ప్రేమిస్తున్నా’’ అంటూ కామెంట్ చేశాడు. అయితే, ప్యాట్ కమిన్స్ ఇందుకు హుందాగా బదులిస్తూ... ‘‘సరే.. ఈ సందేశాన్ని ఆమెకు చేరవేస్తాను’’ అని పేర్కొనడం వైరల్‌గా మారింది.
కాగా గతేడాది ప్యాట్ కమిన్స్ కెరీర్‌లో అద్భుతంగా గడిచింది. అతడి సారథ్యంలో ఆస్ట్రేలియా ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ 2021-23, వన్డే వరల్డ్‌కప్-2023 టైటిల్స్ గెలిచింది. ప్రస్తుతం క్రికెట్ నుంచి విశ్రాంతి తీసుకున్న కమిన్స్ కుటుంబానికి సమయం కేటాయించాడు. rఇక ఐపీఎల్ తాజా సీజన్‌లో అతడు సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున బరిలో దిగనున్నాడు.
చదవండి: IPL 2024- SRH: తెలివైన నిర్ణయం.. సన్‌రైజర్స్ కెప్టెన్‌గా అతడే!
Sanjana Ganesan: వదినమ్మ అంటూనే వెకిలి కామెంట్.. పో.. ఇక్కడి నుంచి!
Comments
Please login to add a commentAdd a comment